Friday, December 2, 2011

నా బ్రదర్ మనీ మైండెడ్ మనిషి

నా బ్రదర్ మనీ మైండెడ్ మనిషి

తన బ్రదర్ మనీ మైండెడ్ మనిషి అని సినీ నటి ఆమని వాపోతోంది. అందుకే తన ఫ్యామిలీ గొడవల్లో తనను ఇరికించి వేడుక చూస్తూ మిన్నకుండి పోయాడని వాపోయింది. ఒక సోదరిగా తన బ్రదర్‌కు పెళ్లి చేస్తే.. ఆయన మాత్రం తనను కష్టాల్లో ఇరికించారంది. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం హీరోగా నిర్మితమవుతున్న "దేవస్థానం" చిత్రంలో ఆయనకు భార్యగా ఆమని నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను సినిమారంగం నుంచి త్వరగా వెళ్ళిపోయాయనే బాధ తనకు ఇపుడు కలిగిందన్నారు. మంచి పాత్రలు వస్తున్న సమయంలోనే కొన్ని ఫ్యామిలీ కారణాలవల్ల దూరమయ్యానని చెప్పుకొచ్చింది. నా బ్రదర్‌ మనీమైండెండ్‌.. వారి ఫ్యామిలీలో గొడవల్లో నన్ను ఇరికించాడు. సోదరిగా అతనికి పెండ్లిచేశాను. ఆ తర్వాత అతని భార్య చెప్పినట్లు నాపై ఆస్తిగొడవల్లో లాగాడు. పెండ్లి చేయడం వరకే నాపని.. ఆ తర్వాత విషయాలు అనవసరం అని అంది.