Sunday, October 30, 2011

డిసెంబరు ఒకటిన చెర్రీ-ఉపాసన నిశ్చితార్థం?

డిసెంబరు ఒకటిన చెర్రీ-ఉపాసన నిశ్చితార్థం?


మెగాస్టార్ చిరంజీవి తనయుడు, టాలీవుడ్ యువ హీరో రామ్ చరణ్ తేజ్ అలియాస్ చెర్రీ, ఉపాసన కామినేని నిశ్చితార్థం డిసెంబర్ ఒకటో తేదీన జరుగనునట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని మెగాస్టార్, కాంగ్రెసు నేత చిరంజీవి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులకు స్వయంగా చెప్పారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. తన నిశ్చితార్థానికి రావాలని గవర్నర్‌ దంపతులను చెర్రీ స్వయంగా ఆహ్వానించినట్టు సమాచారం. అందుకు గవర్నర్ దంపతులు ఆనందంగా అంగీకరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, వీరి నిశ్చితార్థం నిజామాబాద్ జిల్లా దోమకొండలోని పురాతన కోటలో జరుగనుంది. ఇందుకోసం ఈ కోటను సిద్ధం చేస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఆ గడీలోనే నిశ్చితార్థం, వివాహం జరగాలని ఉపాసన కుటుంబ సభ్యులు భావించడంతో ఇందుకు చెర్రీ కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది. 

Saturday, October 29, 2011

నాగార్జున "డమరుకం" ఓ కాపీ సినిమానా..?!!‌!

నాగార్జున "డమరుకం" ఓ కాపీ సినిమానా..?!!‌!


అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తోన్న చిత్రం 'డమరుకం'. కామెడీ చిత్రాలు తీసుకునే శ్రీనివాసరెడ్డికి నాగ్‌ను దర్శకత్వం వహించే ఛాన్స్‌ వచ్చింది. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ వెంకట్‌రెడ్డి తనవాడుగా భావించి శ్రీనివాసరెడ్డికి బాధ్యత అప్పగించారు. ఈ సినిమా వ్యవహాలను అచ్చిరెడ్డి చూస్తున్నారు. కుబేరులు వంటిచిన్న చిత్రాలు తీసే శ్రీనివాసరెడ్డికి పెద్ద సినిమా ఎలా వచ్చిందని మొదట ఆశ్చర్యపోయారు. తను ఒక టీమ్‌ను తయారుచేసుకుని భారీబడ్జెట్‌ కథను వెంకటరెడ్డికి వినిపించారు. దాంతో అది నచ్చి నాగ్‌కు చెబితే ఆయన ఓకే అన్నారు. ఇంతకీ ఈ చిత్రానికి మూలం 'ది ఇమ్మోర్టల్స్‌ ఆఫ్‌ మెలూహా' అనే విదేశీ చిత్రం. ఒక రకమైన కాపీ సినిమా ఇది. ఈ చిత్రం షూటింగ్‌ అప్పుడప్పుడు జరుగుతోంది. ఇటీవలే సారథిలో వేసిన సెట్స్‌తో చిత్రం ఒక షెడ్యూల్‌ పూర్తయింది. తాజాగా అన్నపూర్ణలో వేసిన సెట్లో జరుగుతోంది. ఈమధ్యలో రాజన్న చిత్రాన్ని నాగ్‌ పూర్తిచేశారు. మరి ఈ కాపీ సినిమా ఎంతరకు వర్కవుటుందో చూడాలి. 

Friday, October 28, 2011

నమిత చెన్నై వస్తే స్నేహను వదలదట

నమిత చెన్నై వస్తే స్నేహను వదలదట 

రాజన్న చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటిస్తున్న హోమ్లీ బ్యూటీ స్నేహ తనకు నచ్చినవారితోనే స్నేహం చేస్తోందట. తనకు కాలేజీ స్నేహితురాళ్లున్నట్లే సినిమా ఫ్రెండ్స్ కూడా ఉన్నారట.అయితే ఇలాంటి ఫ్రెండ్స్‌లో చాలా బాగా, ప్రాణపదంగా ఉండే స్నేహితురాలు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరే ఉన్నారట. ఎవరేంటి అనడిగితే.. నమిత అని బదులిచ్చిందట స్నేహ. నమిత ఎప్పుడు చెన్నై వచ్చినా తన ఇంటికి వచ్చి తనతో భోజనం చేయకుండా వెళ్లదట. అంతేకాదు... తనేదైనా బాధలో ఉంటే పనిమాలా వచ్చి ఓదార్చి వెళుతుందట. నమితలాంటి స్నేహితురాలు.. ఆప్తురాలు తనకు ఇండస్ట్రీలో లేరని నమితపై పొగడ్తల జల్లు కురిపిస్తోంది స్నేహ. ఇంతకీ స్నేహ - నమిత ఫ్రెండ్‌షిప్ ఎప్పట్నుంచి బలపడిందోనని అడిగితే, ఇద్దరు మనసులు ఒకేలా ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా కలిసి నడుస్తారంటూ సూత్రాలు వల్లిస్తోందట స్నేహ. 

Thursday, October 27, 2011

అందాలు చూపించేందుకు సై అంటున్న హాన్సిక

అందాలు చూపించేందుకు సై అంటున్న హాన్సిక

బొద్దుగా కాస్త నమితలాగా బాడీలాంగ్వేజ్‌ ఉన్న హాన్సికకు.. అదే కొంచెం ఇబ్బందిగా ఫీలవుతుంది. మొన్నీమధ్య 'ఓ మై ఫ్రెండ్‌' ఆడియో వేడుకలో వేదికపైకి డాన్స్‌ వేస్తుంటే.. కుర్రకారు వీలలు వేసి జోరుగా ఆనందించారు. ఆమె ఎగసిపడుతున్న హృదయ అందాలు చూస్తూ ఎంజాయ్‌ చేశారు. ఇది ఇండోర్‌ స్టేడియంలాంటిది. మరి ఔట్‌డోర్‌ అయితే.. భలే పసందు అనుకుంటారు ప్రజలు.. షూటింగ్‌ ఉన్నప్పుడుల్లా ఉదయమే హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌కు వెళ్ళేది. అక్కడ జాగింగ్‌, స్కిప్పింగ్‌ చేస్తోంది. జాగింగ్‌ చేస్తుంటే.. ముసలివారితో పాటు కుర్రకారు గుటకలు వేసి చూసేవారట. దీంతో రెండో రోజుకు ఆ పార్క్‌‌ఫుల్‌ అయిపోయింది. ఉదయమే ఇంత హడావుడి ఏమిటని... గ్రహించిన వాకర్స్‌ అసోసియేషన్‌ ఆమెకు తగువిధంగా సూచించారట. దీంతో ఆ తర్వాతి రోజు నుంచి మళ్ళీ పార్కులో కన్పించలేదట. 

Saturday, October 22, 2011

ఆ అర్థ"నగ్న" వీడియోలను 18 ఏళ్ల లోపువారు చూడొద్దన్నానుగా: పూనమ్

ఆ అర్థ"నగ్న" వీడియోలను 18 ఏళ్ల లోపువారు చూడొద్దన్నానుగా: పూనమ్

తన బాత్రూం సీక్రెట్స్, బెడ్రూం వీడియోలను యూ ట్యూబ్ పీకి పారేయడంపై పూనమ్ పాండే తెగ బాధపడిపోతోంది. తను విడుదల చేసిన ఆ రెండు వీడియోలు కేవలం శాంపిల్ వీడియోలు మాత్రమేననీ, అసలు సిసలైన వీడియోలు పెట్టాలని అనుకుంటుండగా యూ ట్యూబ్ అనవసరంగా ఆ వీడియోలను తొలగించేసిందని అంటోంది. తన బాత్రూం సీక్రెట్స్ వీడియోను పోస్ట్ చేసినప్పుడే 18 ఏళ్ల లోపు పిల్లలు ఆ వీడియోలను చూడవద్దంటూ హెచ్చరిక జోడించాననీ, అలా చెప్పినప్పటికీ అభ్యంతరం ఎందుకో తనకు అర్థం కావడం లేదని వాపోతోంది. బాత్రూం సీక్రెట్స్ వీడియోలోనే దాదాపు దుస్తులను విడిచేసినట్లు చూపించింది. ఇక మిగిలిన వీడియోల్లో పూర్తిగా విప్పేసి కనిపించినా కనిపిస్తుందేమోనన్న భయంతో యూ ట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని కొందరు చెప్పడాన్ని పూనమ్ ఖండిస్తోంది. అందంగా ఎలా కనిపించాలో తనకు తెలుసుననీ, అయినా చూసేవారికి లేని సిగ్గు నాకెందుకు అంటూ పొగరు సమాధానాలు చెపుతోందట ఈ ముద్దుగుమ్మ. తను వీడియోలను చూసి బాలీవుడ్ హాట్ సెక్సిణి పారిస్ హిల్టన్ లాంటివారు తన బాటలో పయనించేందుకు ఉత్సుకత చూపడాన్ని చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని డబ్బా కొట్టుకుంటోంది పూనమ్.  

Sunday, October 16, 2011

కోటి రూపాయిలిచ్చినా పవర్ స్టార్ పక్కన నటించను

కోటి రూపాయిలిచ్చినా పవర్ స్టార్ పక్కన నటించను

పవర్ స్టార్ తన సరసన నిత్యా మీనన్ నటింపజేయడానికి కోటి రూపాయలు ఆఫర్ చేశాడట. కోటి రూపాయలనగానే నిత్యా మీనన్ ఎగిరి గంతేస్తాడనుకున్నాడట పాపం పవర్ స్టార్. కానీ ఎన్ని కోట్లిచ్చినా సీనియర్ నటుల వెంట నటించేది లేదని అమ్మడు తెగేసి చెప్పిందట. అన్నట్లు ఈ పవర్ స్టార్ మన పవర్ స్టార్ కాదండీ బాబూ. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్‌లో 50 ఏళ్లు దాటిన తర్వాత నటిస్తూ ముందుకు సుకెళుతున్న నటుడు డాక్టర్ శ్రీనివాసన్. తాజాగా తన పేరు ముందు పవర్ స్టార్ అని తగిలించుకున్నాడులెండి. ఈయన తను తీయబోయే చిత్రంలో నిత్యా మీనన్‌ను తన సరసన నటింపజేయాలని అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా నిత్యా మీనన్‌కు కోటి రూపాయలు పారితోషికం ఆఫర్ చేశాడట. కోటి అంటే ఎవరైనా కాదంటారా...? అని అనుకున్నాడట ఆయన. కానీ నిత్యా మీనన్ మాత్రం అంత పెద్ద వయసాయనతో ఎన్ని కోట్లిచ్చినా నటించనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసిందట. 

Thursday, October 13, 2011

బాలకృష్ణ వదిలేసిన కథనేనా చిరంజీవి చేసేది..?!!


మెగాస్టార్‌గా సినిమాల్లో వెలిగిపోయి రాజకీయస్టార్‌గా ఎదగలేక తిరిగి వచ్చిన చిరంజీవి ఎటువంటి సినిమా చేయాలనే డైలమాలో ఉన్నారట. అయితే కథాచర్చలు మాత్రం తెగ జరిగిపోతున్నాయి. పరుచూరి బ్రదర్స్‌ దాన్ని భుజాలపై వేసుకున్నారు. ఇదిలావుంటే ఒకప్పుడు బాలకృష్ణతో తీయాలనుకున్న కథనే చిరుతో చేద్దామంటూ చర్చిస్తున్నారట. అదే స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ. ఆయన అల్లూరి సీతారమరాజు కంటే ముందుతరం వాడు. బ్రిటీష్‌ పాలకులపై తిరగబడ్డ నాయకుడు. అదే కథను చిరంజీవితో చేయాలనే ఏడాది క్రితం స్క్రిప్ట్‌ వర్క్‌ జరిగింది. దానికి కొందరు పేరున్న రచయితలు కూడా పనిచేశారు. అయితే రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో చిరంజీవి సినిమా పక్కన పడేశారు.

Tuesday, October 11, 2011

మధురిమను చుట్టుముట్టి ఒత్తేసిన మాస్ జనం

మధురిమను చుట్టుముట్టి ఒత్తేసిన మాస్ జనం 

అందాల తార మధురిమకు నేచురల్ బ్యూటీగా పేరుంది. ఈ తార బజాజ్ ఎలక్ట్రానిక్స్ బంపర్ డ్రా కార్యక్రమానికి హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లింది. ఆమె వస్తుందన్న విషయాన్ని ముందే తెలుసుకున్న కుర్రకారు అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. ఇంతలో అమ్మడు అక్కడికి రానే వచ్చింది. అసలే అందగత్తె. అలా రోడ్డుపై దిగి వంటరిగా నడిచి వస్తుంటే.. ఆ అందాలను చూసి ఆగలేని మాస్ జనం ఆమెపైకి ఎగబడ్డారట. ఎలాగోలా తప్పించుకుని బయటపడదామనుకునేలోపే ఆ ప్రాంతమంతా చీమలదండులా మారిపోయిందట. ఆమె చుట్టూ చేరి శరీరాన్ని బాగా ఒత్తిడికి గురి చేశారట. ఇది తట్టుకోలేక, బయటపడలేక ఏడ్వడటం మొదలెట్టిందట మధురిమ. అయినా వదిల్లేదట మాస్. దీంతో రోడ్డుపైనే బోర్లా పడుకుని రోదించడం మొదలెట్టిందట. ఇదిలావుండగానే ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగును ఒకతను దొరకబుచ్చుకుని అక్కడ్నుంచి తుర్రుమన్నాడట. ఇంతలో షాపువారు ఎలాగోలా పరిస్థితిని దారికి తెచ్చేసరికి మధురిమ తోటకూర కాడలా మారిపోయిందట. వారివైపు గుడ్లురిమి చూస్తూ.. ఏడుస్తూ కారెక్కి వెళ్లిపోయిందట. అందగత్తెలు అలా రోడ్డుపై కనబడితే మాస్ మైమరిచిపోవడం జరుగుతూనే ఉన్నది. మరి అది గుర్తించి వెళితేనే బ్యూటీలకు సేఫ్. 

Saturday, October 8, 2011

పిచ్చతాగుడు తాగుతున్న కాజల్ అగర్వాల్!!

పిచ్చతాగుడు తాగుతున్న కాజల్ అగర్వాల్!!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ఇమేజ్‌ను "మగధీర" చిత్రం ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చెన్నయ్‌లో అడుగుపెట్టింది. అక్కడ ఒకటిరెండు ఆఫర్లు రావడంతో.. తనకు గుర్తింపునిచ్చిన తెలుగు చిత్రసీమను కించపరిచేలా మాట్లాడింది. ఆ తర్వాత తన ఇమేజ్‌ను పెంచుకునేందుకో.. లేక నాలుగు కాసులకు కక్కుర్తిపడో తెలియదు గానీ.. ఒక ఆంగ్ల పత్రికకు టాప్‌లెస్‌గా ఫోటో ఇచ్చింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగడంతో ఆ ఫోటో తనది కాదని, అది మార్ఫింగ్ చేశారంటూ బుకాయించింది. ఇంతలో ఆ మ్యాగజైన్ యజమానులు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించడంతో "అలా కనిపిస్తే తప్పేంటంట" అంటూ మాట మార్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కాలు మోపేందుకు మరెన్నో జిమ్మిక్కులు చేసింది. అవికూడా ఫలించలేదు కదా.. చెడ్డపేరును తెచ్చిపెట్టాయి.
దీంతో అటు తెలుగు చిత్రసీమలో ఆఫర్లు లేక.. కోలీవుడ్, బాలీవుడ్ ఆదుకోక పోవడంతో తన పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అంతేకాకుండా దక్షిణాదిలో తనకున్న క్రేజ్‌ను, డిమాండ్‌ను తన చేతులారా చెడుపుకున్నాననే బాధ, నిరాశనిస్పృహలో కొట్టుమిట్టాడుతోంది. ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు పిచ్చతాగుడుకు బానిసై పోయినట్టు వినికిడి. ఈ తాగుడు కారణంగా తన అందం కూడా పాడు చేసుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉబ్బిపోయిన ముఖంతో కనిపిస్తున్న కాజల్‌ని చూసి సినీజనం తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. కొందరైతే ప్రభాస్‌తో పెరిగిన దూరమే కాజల్ పిచ్చి చేష్టలకి కారణమని చెపుతుండగా, మరికొందరు మాత్రం అవకాశాలు లేకపోవడం వల్లే కాజల్ తాగుబోతుగా మారిందని చెపుతున్నారు.
సంబంధిత సమాచారం

Wednesday, October 5, 2011

మసాలా ఉండక పోతే జనాలకెక్కదు

మసాలా ఉండక పోతే జనాలకెక్కదు

నిజ జీవిత కథలతో నిర్మించే చిత్రాల్లో మసాలా ఉండకపోతే.. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి లేదా జనాలకెక్కదని బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. అందువల్ల శృంగార దేవత సిల్క్‌స్మిత జీవితగాథతో నిర్మితమవుతున్న డర్టీ పిక్చర్స్ చిత్రంలో పాత్రకు, కథ డిమాండ్‌కు అనుగుణంగానే తన ఎక్స్‌పోజింగ్ ఉంటుందని విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో మోతాదుకు మించి విద్యాబాలన్ తన అందచందాలను ఆరబోసినట్టు విమర్శలు వస్తున్న విషయం తెల్సిందే. దీనిపై విద్యాబాలన్ కాస్త ఘాటుగానే స్పందించింది. తానూ ఒక నటిననే విషయాన్ని గుర్తు పెట్టుకోంది. పాత్ర డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు చెప్పింది చేయడమే నా విధిగా భావిస్తాను. డర్టీపిక్చర్‌లో దక్షిణాదిలో పాపులర్ అయినటువంటి సిల్క్‌స్మిత పాత్రలో, ఆ పాత్ర డిమాండ్ మేరకే నటించాను కానీ ఎక్కడా పరిధిదాటలేదని స్పష్టం చేసింది. 

Saturday, October 1, 2011

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వేగడం చాలా కష్టమట..!!

పవన్‌కళ్యాణ్‌తో ఎవరైనా సఖ్యంగా ఉండాలంటే... కష్టమేనని ఫిలింనగర్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ మధ్య స్నేహం బాగా ఉండేది. అది ఉత్తుత్తి స్నేహమని జోరుగా వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెపువ్వు' అనే చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు పెట్టిన పేరు వర్కవుట్‌ కాదేమోనని అప్పుడే కొంతమంది ఊహించారు. ఆ తర్వాత వెంకటేష్‌ మల్టీస్టారర్‌ సినిమాల గురించి ప్రకటిస్తూ చెప్పాడు కూడా.. ఆ తర్వాత ఏం జరిగిందో..కానీ.. నేను చేయడంలేదని పవన్‌కళ్యాణ్‌ చెప్పేశాడట. అసలే.. రిజర్వ్‌గా ఉండే పవన్‌ బయటకూడా అలా ఉంటే ఫ్యూచర్‌లో హీరోగా నిలబడటం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయ్‌.

వాళ్లు డ్యాన్సులోనే కాదు.. సెక్స్‌లో కూడా రెచ్చిపోయేందుకే డ్రగ్స్ తీస్కుంటున్నారా..?!!

సినీ పరిశ్రమలో దాదాపు 70 శాతం మందికి డ్రగ్స్‌ అలవాటు ఉన్నదని టాలీవుడ్ భోగట్టా. దీనికి బలం చేకూరే విధంగా ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్‌ కేసులో ఎవరు పట్టుపడ్డా... అందులో సినీప్రముఖులు ఉంటున్నారు. కేవలం మత్తులో జోగడమే కాకుండా ఈ డ్రగ్స్‌తో రకరకాలుగా ఉపయోగాలున్నాయట. కొన్ని డ్రగ్స్‌ వాడితే మొహం తేజోవంతంగా ఉంటుంది. హుషారుగా ఉంటుంది. ముఖ్యంగా ఫైట్స్‌, డాన్స్‌ చేసేటప్పుడు కొంతమంది నటులు వీటిని ఉపయోగిస్తారని తెలిసింది. మొన్నీమధ్య పట్టుబడ్డ నైజీరియా దేశస్థుడు డ్రగ్స్‌ ఉపయోగాలు చెబుతూ... ఎక్కువ ఎనర్జీతో 24గంటలు హుషారుగా ఉంటారనీ, సెక్స్‌లో కూడా ఎక్కువసేపు పాల్గొంటారనే రహస్యాన్ని వెల్లడించాడు. ఇక రాజకీయ నాయకులుకూడా కొందరు వాడతారని నిజాన్ని చెప్పాడు. కానీ అవి బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారట.