కోటి రూపాయిలిచ్చినా పవర్ స్టార్ పక్కన నటించను
పవర్ స్టార్ తన సరసన నిత్యా మీనన్ నటింపజేయడానికి కోటి రూపాయలు ఆఫర్ చేశాడట. కోటి రూపాయలనగానే నిత్యా మీనన్ ఎగిరి గంతేస్తాడనుకున్నాడట పాపం పవర్ స్టార్. కానీ ఎన్ని కోట్లిచ్చినా సీనియర్ నటుల వెంట నటించేది లేదని అమ్మడు తెగేసి చెప్పిందట. అన్నట్లు ఈ పవర్ స్టార్ మన పవర్ స్టార్ కాదండీ బాబూ. వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్‌లో 50 ఏళ్లు దాటిన తర్వాత నటిస్తూ ముందుకు సుకెళుతున్న నటుడు డాక్టర్ శ్రీనివాసన్. తాజాగా తన పేరు ముందు పవర్ స్టార్ అని తగిలించుకున్నాడులెండి. ఈయన తను తీయబోయే చిత్రంలో నిత్యా మీనన్‌ను తన సరసన నటింపజేయాలని అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా నిత్యా మీనన్‌కు కోటి రూపాయలు పారితోషికం ఆఫర్ చేశాడట. కోటి అంటే ఎవరైనా కాదంటారా...? అని అనుకున్నాడట ఆయన. కానీ నిత్యా మీనన్ మాత్రం అంత పెద్ద వయసాయనతో ఎన్ని కోట్లిచ్చినా నటించనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసిందట.
No comments:
Post a Comment