నమిత చెన్నై వస్తే స్నేహను వదలదట
రాజన్న చిత్రంలో అక్కినేని నాగార్జున సరసన నటిస్తున్న హోమ్లీ బ్యూటీ స్నేహ తనకు నచ్చినవారితోనే స్నేహం చేస్తోందట. తనకు కాలేజీ స్నేహితురాళ్లున్నట్లే సినిమా ఫ్రెండ్స్ కూడా ఉన్నారట.అయితే ఇలాంటి ఫ్రెండ్స్‌లో చాలా బాగా, ప్రాణపదంగా ఉండే స్నేహితురాలు ఫిలిమ్ ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరే ఉన్నారట. ఎవరేంటి అనడిగితే.. నమిత అని బదులిచ్చిందట స్నేహ. నమిత ఎప్పుడు చెన్నై వచ్చినా తన ఇంటికి వచ్చి తనతో భోజనం చేయకుండా వెళ్లదట. అంతేకాదు... తనేదైనా బాధలో ఉంటే పనిమాలా వచ్చి ఓదార్చి వెళుతుందట. నమితలాంటి స్నేహితురాలు.. ఆప్తురాలు తనకు ఇండస్ట్రీలో లేరని నమితపై పొగడ్తల జల్లు కురిపిస్తోంది స్నేహ. ఇంతకీ స్నేహ - నమిత ఫ్రెండ్‌షిప్ ఎప్పట్నుంచి బలపడిందోనని అడిగితే, ఇద్దరు మనసులు ఒకేలా ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా కలిసి నడుస్తారంటూ సూత్రాలు వల్లిస్తోందట స్నేహ.
No comments:
Post a Comment