Friday, December 31, 2010

మా ఫ్రెండ్స్‌కి ఆమె పార్టీ ఇచ్చారు

మా ఫ్రెండ్స్‌కి ఆమె పార్టీ ఇచ్చారు

మీరొక్క అవకాశం ఇచ్చి చూడండి. పాట పాడకపోతే అప్పుడు నన్నడగండి’’ అంటున్నారు రిచా గంగోపాధ్యాయ. తెలుగులో పాట పాడటం మాత్రమే కాదు.. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవాలని కూడా అనుకుంటున్నారామె. అందుకే తెలుగు భాష మీద పట్టు తెచ్చుకునే పనిలో ఉన్నారు. ‘హాయ్ బాగున్నారా?’ అంటూ తెలుగులో అందంగా పలకరిస్తారు ఈ బ్యూటీ. కర్నాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నారామె. ఖాళీ దొరికినప్పుడల్లా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తుంటారు. పాటలు పాడతారా? అన్నప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. ఇటీవలే రిచా నటించిన ‘నాగవల్లి’ విడుదలైంది. త్వరలో ‘మిరపకాయ్’ విడుదల కానుంది. ఈ ఏడాది మూడు సినిమాలు విడుదలవ్వడం పట్ల రిచా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ - ‘‘లీడర్‌తో నా కెరీర్ వైభవంగా ఆరంభమైంది. ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ సినిమాలు చేస్తున్న నాకు ఇటీవల విడుదలైన ‘నాగవల్లి’ మంచి పేరు తెచ్చింది. ‘మిరపకాయ్’ మాస్ సినిమా కాబట్టి అది నన్ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది. వాస్తవానికి నేను సినిమాల్లోకి వెళతానని అన్నప్పుడు మా అమ్మా నాన్న ససేమిరా అన్నారు. చిన్నప్పట్నుంచీ నాకు కొంచెం మొండితనం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే చేసే తీరాలి. అందుకని పట్టు వదలకుండా అమ్మా నాన్నని ఒప్పించి ఆర్టిస్ట్ అయ్యాను. లీడర్, నాగవల్లి విజయం సాధించడంతో మా వాళ్లు కూడా ఆనందంగా ఉన్నారు. ఇటీవల నాతో కలిసి మా అమ్మ ‘నాగవల్లి’ చూసింది. బాగా యాక్ట్ చేశావని అభినందించింది. ఆ ఆనందంలో నా ఫ్రెండ్స్ అందరికీ మంచి పార్టీ కూడా ఇచ్చింది’’ అన్నారు. ప్రస్తుతం రిచా యూఎస్‌లో తన ఇంట్లో హాయిగా సేద తీరుతున్నారు. యూఎస్‌లోనే చదువుకున్నారు కాబట్టి రిచాకు అక్కడ స్నేహితులు ఎక్కువ. ‘మిరపకాయ్’ తర్వాత ఆమె నటించబోయే చిత్రం ఆరంభం కావడానికి కొంత సమయం పడుతుందట. అందుకే యూఎస్ వెళ్లిపోయి తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిపి ఎంజాయ్ చేస్తున్నారామె.

అసిన్, త్రిషలా కాకూడదని...

అసిన్, త్రిషలా కాకూడదని...


దక్షిణాది కథానాయికల్లో ఎవరినైనా బాలీవుడ్‌లో నటించే అవకాశం వరించిందటే ఎగిరి గంతేసి ఆ చిత్రాన్ని ఒప్పుకుంటారు. నేటి కథానాయికల్లో చాలా మంది బాలీవుడ్‌లో తమకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ‘బర్ఫీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన గోవా సుందరి ఆ చిత్రంలో రెండో కథానాయికగా నటిస్తున్నారు. హిందీ చిత్రసీమలోకి ప్రవేశించాలని కలలు కనే వారి జాబితా నుంచి అందాల భామ అనుష్కకు మినహాయింపు ఇవ్వొచ్చు. ఇటీవలే ఓ క్రేజీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయ్యే అవకాశం వచ్చినా ఈ తార సున్నితంగా ఆ ఆఫర్‌ని తిరస్కరించారు. సూర్య, అనుష్క తమిళంలో నటించిన ‘సింగం’ (తెలుగులో యముడు పేరుతో అనువదించారు) చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు రోహిత్‌శెట్టి హిందీలో కూడా అనుష్కనే కథానాయికగా నటించమని రిక్వెస్ట్ చేశాడట. కానీ ప్రస్తుతం తను తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా బిజీగా వుండటంతో దక్షిణాది సినీ పరిశ్రమతో తనకు చాలా కంఫర్టబుల్‌గా వుందని, ప్రస్తుతం తనకు బాలీవుడ్‌లో ప్రవేశించే ఆలోచన లేదని చెప్పారట అనుష్క. అయితే తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా భాసిల్లుతున్న తను బాలీవుడ్‌లోకి ప్రవేశించి అసిన్, త్రిష తరహాలో ఫెయిల్యూర్స్ చవి చూడటం ఇష్టం లేకనే ఆమె బాలీవుడ్‌లోకి ప్రవేశించడం లేదని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Thursday, December 30, 2010

ప్రియాంక వద్దు!

ప్రియాంక వద్దు!


చేతన్‌ భగత్‌ రాసిన నవల 'టూ స్టేట్స్‌' ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. తొలుత ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌, ప్రియాంక చోప్రా నాయకానాయికలుగా ఎంపికయ్యారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో సాజిద్‌ నదియడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు దర్శకుడు కూడా మారారు. కథానాయకుడిగా షారుఖ్‌ రావడంతో విశాల్‌ భరద్వాజ్‌ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఇందులో షారుఖ్‌ ద్విపాత్రాభినయం చేస్తారు. అంతేకాకుండా సహ నిర్మాతగానూ వ్యవహరించబోతున్నారు. నాయికగా ప్రియాంకను కూడా తప్పించమని షారుఖ్‌ దర్శకుడికి సూచించారట. ఎవరైనా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారు. దీంతో కొత్త నాయిక కోసం అన్వేషణ మొదలుపెట్టారు విశాల్‌.

ఆ అనుభవం మళ్లీ వద్దు

ఆ అనుభవం మళ్లీ వద్దు


మీరొక సినిమా చేస్తే 60 నుంచి 100 రోజులు డేట్స్ ఇస్తారు. జస్ట్ రెండు, మూడు గంటలు డాన్స్ చేయండి మేడమ్. మీకు 3 కోట్లు ఇస్తాం’’ అని కత్రినా కైఫ్‌తో గత కొన్ని రోజులుగా ముంబయ్‌లో ఉన్న ఒక ఐదు నక్షత్రాల హోటల్ వారు సంప్రతింపులు జరుపుతున్నారు. మరో హోటల్ యాజమాన్యం అయితే ఇంకో అరకోటి పెంచి ‘మూడున్నర కోట్లు’ ఇవ్వడానికి ముందుకొచ్చిందట. అయినప్పటికీ కత్రినా కైఫ్ మనసు చలించలేదని సమాచారం. గత ఏడాది ఓ లగ్జరీ హోటల్‌లో కత్రినా కైఫ్ నూతన సంవత్సరం వేడుకల్లో డాన్స్ చేయడం, అక్కడ నానా రభసా జరగడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. బహుశా ఈసారి అలాంటి చేదు అనుభవం ఎదురు కాకూడదనే డాన్సులకు దూరంగా ఉండాలని కత్రినా ఫిక్స్ అయ్యారని ఆమె సన్నిహితుడు చెబుతున్నారు.

Wednesday, December 29, 2010

హాలీవుడ్‌లో రొమాన్స్

హాలీవుడ్‌లో రొమాన్స్


సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న కథానాయికల జాబితాలో విమలారామన్ కూడా వుంటారు. కెరీర్ తొలినాళ్లలో ఉదయ్‌కిరణ్, వరుణ్‌సందేశ్ లాంటి యువ కథానాయకులతో జతకట్టినా ఈ తార ఇప్పుడు సీనియర్ కథానాయకులతో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల ‘గాయం-2’ చిత్రంలో జగపతిబాబుతో నటించిన ఈ భామ త్వరలో రంగ ది దొంగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ మంగమ్మగా ఈ చిత్రంలో విమలా కనిపించనున్నారు. ఇక సుమంత్‌తో నటించిన రాజ్, తరుణ్‌తో జతకట్టిన చుక్కలాంటి అమ్మాయి-చక్కనైన అబ్బాయి చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. ఇదిలా వుండగా ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఈ భామ ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా నటించారని తెలిసింది. రోహన్ రాయ్ రూపొందించిన ‘డ్రామ్ ట్రిపుల్ నైన్’ అనే చిత్రంలో విమల హాలీవుడ్ నటుడు జోష్వా ఫెడరిక్‌తో హాట్ హాట్ సన్నివేశాల్లో నటించారట. ఆశిష్ విద్యార్థితో పాటు ‘వాన’ ఫేమ్ వినయ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం 2011 ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సమాచారమ్. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా బిజీగా వున్న విమల తను నటించిన హాలీవుడ్ చిత్రంతో ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాలంటే ‘డ్రామ్ ట్రిపుల్ నైన్’ విడుదల వరకు ఆగాల్సిందే.

అతనే నా వాడు

అతనే నా వాడు


జయం’ చిత్రంతో తెలుగు సదా సినీ పరిశ్రమకు పరిచయమై దాదాపుగా పదేళ్లు దాటిపోతోంది. ఆమె సినీ కెరీర్ వయసే పదేళ్లు అయినప్పుడు ఖచ్చితంగా ఈ తారకి పెళ్ళి వయసు వచ్చిందనే సందేహం మీకు రావడం సహజం. ఖచ్చితంగా మీ అనుమానం కరెక్టే. ఎందుకంటే ఈ అందాల భామ కూడా ఇప్పుడు అదే ఆలోచనలో వున్నారు. ఎలాగూ సినీ రంగంలో అనుకున్నంత గుర్తింపు రాలేదు. అందుకే తొందరలోనే తాళి కట్టించుకోవాలని సదా తహతహలాడుతున్నారు. ‘జయం’ లాంటి విజయం తర్వాత కొంతకాలం క్రేజీ హీరోయిన్‌గా భాసిల్లిన ఈ తార సంచలన దర్శకుడు శంకర్ రూపొందించిన ‘అపరిచితుడు’ చిత్రంలో కూడా నాయికగా నటించే అవకాశాన్ని పొందారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించినా కూడా ఎందుకో నటిగా ఎదగలేకపోయారు సదా. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాలేవీ సెట్స్ మీద లేవు. అందుకే త్వరగా పెళ్ళి చేసుకోవాలనే యోచనలో వున్నారు కాబోలు ఈ తార. ఈ సందర్భంలో సదాను మిమ్మల్ని కట్టుకునే వాడు ఎలా వుండాలి అని ప్రశ్నించగా ‘‘హృతిక్‌రోషన్ అంత అందగాడు అయ్యుండి, షారుక్‌ఖాన్‌కు వున్నంత సెన్సాఫ్ హ్యుమర్ కలిగి వుండి, హాలీవుడ్ కథానాయకుడు ట్రామ్ క్రూజర్‌లా సెక్సప్పీల్ కన్పడాలి ’’ అని సెలవిచ్చారామె. అంటే ముగ్గురిలో వున్న ఆ లక్షణాలు ఒకే వ్యక్తిలో కలగలిపితే అతను సదా కలల రాకుమారుడు అన్నమాట. ఆ కుర్రాడు మరి ఆమెకు ఎప్పుడు దొరుకుతాడో వేచి చూడాలి. 

Tuesday, December 28, 2010

ఆ తృప్తి చాలు!

ఆ తృప్తి చాలు!


2010లో బాలీవుడ్‌ గడప తొక్కింది ప్రియమణి. మణిరత్నం, రామ్‌గోపాల్‌ వర్మ... వీళ్ల సినిమాల్లో చేస్తున్నాను... అని తెగ మురిసిపోయింది. కానీ కాలం కలిసిరాలేదు. 'రావణ్‌'లోనూ, 'రక్తచరిత్ర - 2'లోనూ చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలే దక్కాయి. ఆ రెండు సినిమాలూ బాక్సాఫీసును ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. అయినా ప్రియమణి ఏ మాత్రం బెంగపడటం లేదు. ఇవి నా తొలి అడుగులే... ప్రయాణం ఇంకా ఉంది అని ధీమాగా చెబుతోంది. ''ఓ సినిమా ఒప్పుకొన్నప్పుడు నా పాత్ర చిన్నదా? పెద్దదా? అందులో ఎన్ని సన్నివేశాలుంటాయి? ఇవేమీ ఆలోచించను. 'రావణ్‌' సినిమా ఒప్పుకొంటున్నప్పుడూ అంతే. మణిరత్నం అనే పేరు తప్ప నాకు ఏమీ కనిపించలేదు. 'రక్తచరిత్ర'లో నా పాత్ర నిడివి తక్కువే. కానీ మంచి నటన ప్రదర్శించే అవకాశం దక్కింది. ఆ తృప్తి చాలు. నేనేదో హిందీ సినిమా చేస్తున్నాను... అనే భావన ఎప్పుడూ కలగలేదు. చేసిన రెండు సినిమాల్లోనూ ఎక్కువగా దక్షిణాదికి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులే పనిచేశారు. ఫలితం సంగతి అటుంచితే ఈ రెండు సినిమాల వల్ల నాకు రావలసిన గుర్తింపే వచ్చింది'' అని చెప్పింది ప్రియమణి. 

ఆ తప్పులు ఇక జరగవ్

ఆ తప్పులు ఇక జరగవ్


ర్యాంప్‌పై హొయలొలికిస్తూ పిల్లి నడకలు నడవడం శ్రీయకు కొత్త కాదు. కానీ చేనేత చీర కట్టుకుని నడవడం మాత్రం ఆమెకు సరికొత్త అనుభవమే. ఇటీవల చెన్నయ్‌లో జరిగిన ‘ఫ్యాషన్ వీక్’లో ఆమె ఆకుపచ్చ రంగు చేనేత చీర కట్టుకుని అందంగా వాక్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ‘‘ఓహ్.. ఈ చీరలో నాకు నేనే ముద్దొచ్చా. చేనేత చీరలు అద్భుతం’’ అని శ్రీయ పేర్కొన్నారు. తెలుగులో పలు విజయాలు చవిచూసిన శ్రీయకు బాలీవుడ్‌లో మాత్రం చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఈ కారణంగా ఇక హిందీ సినిమాల జోలికి వెళ్లరా? అనే ప్రశ్నను శ్రీయ ముందుంచితే - ‘‘హిందీ రంగంపై నాకు ఆసక్తి లేదని చెబితే అబద్ధం ఆడానని ఇట్టే తెలిసిపోతుంది. బాలీవుడ్ మార్కెట్ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకని హిందీ రంగానికి దూరం కాదల్చుకోలేదు. అయితే గతంలో నాకు మంచి కథలు ఎన్నుకునే విషయంలో అవగాహన లేక తప్పులు చేశాను. అందుకు పశ్చాత్తాపపడటంలేదు. ఈసారి మాత్రం మంచి కథ ఎన్నుకుని హిందీలో కూడా విజయం చవి చూస్తా’’ అన్నారు. ‘ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్’ చిత్రం ద్వారా ఆమె హాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టారు. మన ఇండియన్ మూవీస్‌కి హాలీవుడ్‌కి ఎలాంటి తేడాని గమనించారు? అని శ్రీయను అడిగితే - ‘‘హాలీవుడ్ సినిమాలకు పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఒకసారి స్క్రిప్ట్ ఓకే అయితే ఆ తర్వాత ఒక్క పదాన్ని కూడా మార్చరు. అలాగే షూటింగ్ ఆరంభించే ముందు వర్క్‌షాప్స్ ఉంటాయి. స్క్రిప్ట్ చదవడానికి క్లాసులు ఏర్పాటు చేస్తారు. రిహార్సల్స్ చేస్తారు. కానీ ఇక్కడ వర్కింగ్ స్టయిల్ వేరు. షూటింగ్ స్పాట్‌లో కూడా మార్పులు చేస్తుంటారు. అది తప్పేం కాదు. ఒక్కోసారి ఆ మార్పులు సినిమా విజయానికి కారణం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తారతమ్యం లేదు. ఎక్కడ చేసినా నన్ను నేను నిరూపించుకోవాలనే తాపత్రయంతో వర్క్ చేస్తాను’’ అని చెప్పారు.

Monday, December 27, 2010

నన్నెవరూ ఆపలేరు!

నన్నెవరూ ఆపలేరు!

మీర్‌ ఖాన్‌ భార్య కిరణ్‌ రావ్‌ రూపొందించిన తొలి చిత్రం 'ధోబీ ఘాట్‌'. ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రచార కార్యక్రమంలో అమీర్‌ను పక్కనపెట్టారు కిరణ్‌. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అమీర్‌ ప్రచారానికి వస్తే... గుర్తింపు మొత్తం ఆయన ఖాతాలోకి వెళ్లిపోతుందని దర్శకురాలు భావించిందట. అందుకే ఆయన్ను రావద్దని కోరింది. కానీ అమీర్‌ వూరుకుంటారా..? ఈ సినిమాలో ఆయన నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. అందుకే ఆయన చెబుతూ ''నన్నెవరూ 'ధోబీ ఘాట్‌' ప్రచారంలో పాల్గొనకుండా ఆపలేరు. ఈ సినిమాలో నటించడం నాకు గర్వంగా ఉంది. 'ధోబీ ఘాట్‌' నిర్మాతగా.. ఇందులో నటించిన వ్యక్తిగా తొలి నుంచీ సినిమా పూర్తయ్యే వరకూ నా ప్రమేయం తప్పకుండా ఉంటుంద''న్నారు. సమాజంలోని నాలుగు వర్గాల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తుల చుట్టూ కథ తిరుగుతుంది. వీరందరూ ఎలా కలుసుకున్నారు..? కథ ఎలాంటి మలుపులు తిరిగింది..? అన్నది తెరమీద చూడాల్సిందే. వచ్చే నెల 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

అది సినిమా పెళ్లంటే నమ్మరేంటి?

అది సినిమా పెళ్లంటే నమ్మరేంటి?


సల్మాన్ మంచి నటుడే కాదు... మంచి జోకర్ కూడా. తనతో మాట్లాడుతుంటే కాలం ఇట్టే గడిసిపోతుంది. ప్రాక్టికల్ జోకులు వేసి ఒక్కోసారి ఇబ్బందులకు కూడా గురిచేస్తారాయన. మనకు కోపం వచ్చిందనుకోండి... మళ్లీ వెంటనే నవ్వించేస్తారు’’ ఇటీవల ఓ ఛానెల్ కార్యక్రమంలో అసిన్ అన్న మాటలివి. ఇలా సల్మాన్ గురించి కబుర్లు చెప్పాల్సిన అవసరం అసిన్‌కి ఏంటి... అనుకుంటున్నారా? విషయం ఏంటంటే... వీరిద్దరూ బాలీవుడ్‌లో ‘రెడీ’ రీమేక్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైన నాటి నుంచి వీరి మధ్య ఎఫెక్షన్ బాగా ముదిరిందని, ఒకర్ని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అంతేకాక, ‘రెడీ’ సినిమాలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు గెటప్‌లో ఉన్న వీరిద్దరి స్టిల్ ఈ మధ్య బయటకు వచ్చింది. ఇక బాలీవుడ్ జనాలు ఈ స్టిల్ చుట్టూ కథలు అల్లేస్తూ... వీరిద్దరికీ పెళ్లి కూడా అయిపోయిందని చెప్పడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానల్ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమంలో సదరు యాంకర్ ఈ ఫొటో మేటర్‌ని బయట పెట్టి.. దీనికి మీ సమాధానం ఏంటని సల్మాన్‌ని అడిగింది. దానికి ఆయన సమాధనమిస్తూ-‘‘ అబ్బా.. ఈ గాసిప్ నిజమైపోతే ఎంత బావుండో...’’ అంటూ అసిన్ వంక అదోలా చూస్తూ... మెలికలు తిరిగిపోయారట. లక్షలాది మంది చూసే కార్యక్రమంలో సల్మాన్ అలా ప్రవర్తించే సరికి అసిన్ కాస్తంత ఇబ్బందిగా ఫీలైపోతూ... ‘‘ఈయన భలే జోకులు వేస్తారు. అవన్నీ ఉత్తుత్తి గాలి కబుర్లు. వాటిని లెక్క చేయాల్సిన పనిలేదు. ఆ స్టిల్ మేం సినిమా కోసం ఇచ్చిందే’’ అని కవర్ చేశారట. తదనంతరం ఆమె పై విధంగా స్పందించారట. ఏదేమైనా నిప్పు లేకుండా పొగ రాదంటారు. మరి ఈ పొగకు కారణం ఏంటో!

Friday, December 24, 2010

ఆమె వెనుక ఎవరో ఉన్నారు

ఆమె వెనుక ఎవరో ఉన్నారు


చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం’ అన్నట్లుగా వుంది ప్రస్తుతం నయనతార పరిస్థితి. ఇన్నాళ్లు ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించి ఇప్పుడేమో.. ఆయనతో లవ్‌ఎఫైర్ కారణంగానే కెరీర్‌ను నష్టపోయనంటూ తన అక్కసు వెల్లగక్కుతున్నారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నయన తన మనసులోని బాధను బయటపెట్టారు. ప్రభుతో ప్రేమ, పెళ్ళి అన్నీ సాఫీగా సాగిపోతాయనుకుంటే ఆ వ్యవహరం కాస్తా వివాదస్పదమై పోయిందని, ఇదంతా ప్రభుదేవా వల్లే జరిగిందని నయనతార చెప్పుకొచ్చారు. అయితే వెంటనే తనకు తానే సర్దిచెప్పుకుంటూ ఇందులో ప్రభుదేవా తప్పు వుందని తాను అనుకోవడం లేదనీ. రాజీకి ఒప్పుకున్న ప్రభుదేవా భార్య, చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించిందనీ ,ఆమె వెనుక ఎవరో వుండి వ్యవహారాన్ని రాద్దాంత చేశారని చెప్పారు ఆ ఇంటర్వ్యూలో నయనతార. ఇదిలా వుంటే ప్రభుదేవా మాత్రం వీటినేమీ పట్టించుకోకుండా ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో డైరక్షన్ అవకాశాల కోసం పచార్లు చేస్తున్నాడని సమాచారం. తన వద్ద చాలా కథలు వున్నాయనీ చెబుతూ, ఆ సినిమాలో హీరోయిన్‌గా నయనతార పేరును ప్రపోజ్ చేస్తున్నాడట ప్రభు. ఈ ప్రపోజల్ నచ్చని నిర్మాతలు తర్వాత చూద్దాంలే అని మోహం చాటేస్తుండగా, ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడట. సో.. మొత్తం మీద తన వల్ల కెరీర్ నష్టపోయిన నయనతార కెరీర్‌కు మళ్లీ పూర్వవైభవం సంతరించు కునేలా ప్రభుదేవా ప్రయత్నిస్తున్నాడు. అయితే నయన మాత్రం తన క్రేజ్‌తోనే అవకాశాలను తెచ్చుకోవాలనే ఆలోచనలో వున్నారట. ఆమె ప్రస్తుతం తెలుగులో శ్రీరామరాజ్యం చిత్రంలో బాలకృష్ణ సరసన సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మళ్లీ 'మర్డర్‌'

మళ్లీ 'మర్డర్‌'


మ్రాన్‌ హష్మి, మల్లికా శెరావత్‌ నటించిన 'మర్డర్‌' సినిమా అయిదేళ్ల కిందట విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపు రూపొందించే పనిలో పడ్డారు దర్శకుడు మోహిత్‌ సూరి. తాజా చిత్రంలో కథానాయకుడిగా ఇమ్రాన్‌ హష్మి కొనసాగుతున్నా.. నాయికగా కొత్త ముఖానికి చోటిచ్చారు. మల్లికా శెరావత్‌ స్థానాన్ని జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఆక్రమించింది. దర్శకుడు మాట్లాడుతూ ''మర్డర్‌ తరవాత దానికి రెండో భాగం అంటే ప్రేక్షకులు అంచనాలు పెంచుకొంటారు. వారికి తగ్గట్లు కథ సిద్ధం చేసుకున్నాను. మళ్లీ మల్లికానే నాయికగా తీసుకొంటే బాగుండదేమో అనిపించి కొత్త ముఖాన్ని చూపించాలనుకున్నాను. జాక్వెలైన్‌, ఇమ్రాన్‌ హష్మి మధ్య కొన్ని శృంగార సన్నివేశాల్ని చిత్రీకరించిన తరవాతే ఆమెను ఎంపిక చేసుకొన్నాను. తెర మీద వారిద్దరినీ చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతార''ని వెల్లడించారు. 

Thursday, December 23, 2010

కార్తీతో రొమాన్స్

కార్తీతో రొమాన్స్

స్టన్నింగ్ లుక్స్‌తో.. మోడ్రన్ కాస్ట్యూమ్స్‌తో చూడగానే క్లాస్ అమ్మాయిగా అనిపించే మిల్కీ వైట్ భామ తమన్నా. అందుకే ఇప్పటి వరకు ఈ తార క్లాస్ అమ్మాయి పాత్రలనే చేసింది. మాస్ పాత్రలకు, విలేజ్ గాళ్ పాత్రలకు ఆమె సరిగ్గా నప్పదని దర్శకులు కూడా ఆమెతో ఆ తరహా పాత్రలు చేయించటానికి ఇష్టపడటం లేదు. కానీ ఇప్పుడు తమన్నా క్లాస్ ఇమేజ్ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం క్లాస్ పాత్రలే చేస్తే మాస్ ఆడియన్స్‌కు చేరువ కాలేనన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడామె తమిళంలో కార్తీ సరసన నటిస్తున్న ‘సిరుత్తె’ చిత్రంలో మాస్ లుక్‌తో కనిపించనున్నారు. తెలుగు విక్రమార్కుడు చిత్రానికి రీమేక్‌గా నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రానికి శివ దర్శకుడు. గతంలో ఈయన తెలుగులో గోపీచంద్‌తో శౌర్యం, శంఖం చిత్రాలను తెరెకెక్కించారు. కాగా తెలుగు విక్రమార్కుడు చిత్రంలో రవితేజ, అనుష్కల మధ్య పలు రొమాంటిక్ సన్నివేశాలు వున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే తమన్నా, కార్తీలు కూడా ఈ రీమేక్ సినిమాలో ఆ రొమాంటిక్ సన్నివేశాల్లో పోటీ పడి నటించారట. మాస్‌ను ఈ సన్నివేశాలు విపరీతంగా అలరిస్తాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అంతే కాదు... వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యిందని తమిళ సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

నిర్మాతకు షాక్ ఇచ్చిన కత్రినా

నిర్మాతకు షాక్ ఇచ్చిన కత్రినా

ఇటీవల ఓ దక్షిణాది నిర్మాత కత్రినాను కలిశాడట. తన సినిమాలో నటించాల్సిందిగా కోరి, అధిక పారితోషికం ఆఫర్ చేశాడట. ఆ పారితోషికం విని కత్రినా షాక్ అవుతారని సదరు నిర్మాత భావిస్తే... ఆ నిర్మాతనే షాక్‌కు గురిచేస్తూ... పదికోట్లు పారితోషికం అడిగారట కత్రినా. అంత మొత్తం ఇస్తే గానీ దక్షిణాదిలో చేయన నీ, ‘తీన్ మార్ ఖాన్’ విడుదల తర్వాత ఎలాగూ తన పారితోషికం పదికోట్లు అవ్వడం ఖాయమని పేక మేడలు కట్టేశారట కత్రినా. దాంతో కిమ్మనకుండా ఆ నిర్మాత వెనుదిరిగారట. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా? అని కత్రినాను అడిగితే ‘‘అది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకనుకుంటున్నారు...? కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకోరు..?’’ అని ఎదురు ప్రశ్నించారు ఈ సెక్సీబ్యూటీ. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘తీన్‌మార్ ఖాన్’ కోసం నేను పడ్డ శ్రమ అలాంటిది. పాత్ర కోసం నా శరీరాకృతిని కూడా మార్చుకున్నాను. నాకు జీరో సైజులపై, కొలతలపై అస్సలు అవగాహన లేదు. కానీ ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడి నా ఆకృతిలో మార్పును తెచ్చుకున్నాను. నటన విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేశాను. అవన్నీ కలిసి వస్తాయని నమ్మకంతో ఉన్నాను’’ అని చెప్పారు కత్రినా. మరికొన్ని విషయాలను ఆమె చెబుతూ- ‘‘పర్‌ఫెక్ట్ ఫిజిక్ అంటే... నా దృష్టిలో జీరో సైజు కాదు. కాస్తంత బొద్దుగా ఉంటేనే అందానికీ, ఆరోగ్యానికీ మంచిదని నా అభిప్రాయం. ‘తీన్ మార్ ఖాన్’ తర్వాత మళ్లీ మునుపటి ఫిజిక్ కోసం ప్రయత్నిస్తా. నచ్చిన తిండి తినడం, వీలైనంత సేపు నిద్రపోవడం, ఎక్కువగా ఆలోచించకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం నా అందానికి కారణాలు’’ అని చెప్పుకొచ్చారు కత్రినా. 

Wednesday, December 22, 2010

కంగన ఒప్పుకోలేదు!

కంగన ఒప్పుకోలేదు!

కంగనా రనౌత్‌ కథానాయికగా బాలాజీ టెలీ ఫిలిమ్స్‌ సంస్థ 'రాగిని ఎం.ఎం.ఎస్‌' అనే చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఏక్తా కపూర్‌ నిర్మాత. గతంలో కంగన వీరి నిర్మాణంలో వచ్చిన 'ఒన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబయి' చిత్రంలో నటించారు. అందుకే తాజా చిత్రంలోనూ ఆమెనే నాయికగా తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అయితే కంగన సుముఖంగా లేదు. ఆమె సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం.. ఆమె పోషించాల్సిన పాత్ర ప్రధానమైనదే అయినా.. కథలో ఎక్కువ భాగం శృంగారం, అంగాంగ ప్రదర్శనలకే ప్రాముఖ్యం ఉండటంతో ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించనట్లు తెలిసింది. 'ఫ్యాషన్‌' చిత్రంలో ఆమె నటనకు గతంలో అవార్డులు వచ్చిన తరవాత కంగన ఆచితూచి సినిమాల్ని ఎంపిక చేసుకొంటోంది. దీనికి నిదర్శనమే 'రాగిని ఎం.ఎం.ఎస్‌.' సినిమాను వదులుకోవడం! ఇప్పుడు ఏక్తా మరో నాయిక కోసం అన్వేషణ మొదలుపెడుతోంది.

వాళ్లు మాత్రమే నన్ను మాయ చేయగలరు

వాళ్లు మాత్రమే నన్ను మాయ చేయగలరు


ఇలియానా ‘ఫెస్టివల్ మూడ్’లో ఉన్నారు. 25న క్రిస్మస్ పండగను వైభవంగా జరుపుకోవడం కోసం ఈ బ్యూటీ గోవా వెళ్లారు. పండగకు కావల్సిన షాపింగ్ చేస్తూ ఆమె బిజీ బిజీగా ఉన్నారు. షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఈ సుందరాంగికి ఓ బుడతడు తారసపడ్డాడట. ‘మీ లిప్‌స్టిక్ కావాలి. ఇస్తారా?’ అని ఆ పిల్లాడు అడగ్గానే ఇలియానాకు చెప్పలేనంత ఆనందం కలిగిందట. ‘నా లిప్‌స్టిక్ నీకెందుకు?’ అని ఆ చిన్నారిని అడిగితే - ‘మీ గుర్తుగా ఉంచుకుంటా’ అన్నాడట. ఆ సమాధానానికి మురిసిపోయి ఇలియానా బ్యాగ్‌లో ఉన్న లిప్‌స్టిక్ తీసి బుడతడికి బహుమతిగా ఇచ్చేశారు.
‘‘పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల ముద్దు ముద్దు మాటలు, చేష్టలు చూస్తుంటే నేను పరిసరాలను మర్చిపోతాను. నన్ను మాయ చేయగల శక్తి పిల్లలకు మాత్రమే ఉంది. నా లిప్‌స్టిక్ అడిగిన పిల్లాడు భలే ముద్దుగా ఉన్నాడు. వాడ్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ఇలియానా అంటున్నారు. ప్రస్తుతం రానా సరసన ఆమె నటించిన ‘నేను నా రాక్షసి’ విడుదలకు సిద్ధం అవుతోంది. ‘పోకిరి’లాంటి సంచలనాత్మక విజయం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇలియానా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించడం ఖాయం అని, సినిమా బాగా వచ్చిందని ఇలియానా అంటున్నారు. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఇలియానా ఆచి తూచి సినిమాలను ఎన్నుకుంటుంటారు. కొంతమంది కథానాయికల్లా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని ఇలియానా పాటించరు. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘పరిస్థితులు బాగున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటారు. అందులో నిజం ఉంది. కానీ కేవలం ధనార్జనే దృష్టిలో పెట్టుకుని ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే ఫేడవుట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే కెరీర్‌కి ప్లస్ అయ్యే సినిమా అనిపిస్తే ఒప్పుకుంటా’’ అన్నారు. 

Tuesday, December 21, 2010

టబు కొడుకు ఇర్ఫాన్‌

టబు కొడుకు ఇర్ఫాన్‌

తెరపై కొన్ని పాత్రలు భలే విచిత్రంగా ఉంటాయి. వారిని ఆ పాత్రల్లో నటింపజేయాలనే ఆలోచన రావడమే దర్శకులకు ఓ సాహసమని చెప్పాలి. ముఖ్యంగా టబు, ఇర్ఫాన్‌ ఖాన్‌ - వీరి మధ్య ప్రణయ సన్నివేశాలు చక్కగా పండుతాయి. 'మఖ్బూల్‌', 'ది నేమ్‌ సేక్‌' సినిమాలే ఉదాహరణ. అయితే వారిని తల్లీకొడుకులుగా చూపించాలని తైవాన్‌కి చెందిన ఆంగ్ల దర్శకుడు ఆంగ్‌ లీ అనుకోవడం విచిత్రమే. ఆయన రూపొందించబోయే సినిమా 'లైఫ్‌ ఆఫ్‌ పి'. ఇందులోనే టబు తనయుడిగా ఇర్ఫాన్‌ కనిపించబోతున్నారు. తొలుత ఇర్ఫాన్‌ ఖాన్‌, టబు ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయం తెలియగానే అందరూ సాధారణంగానే జంటగా కలిసి నటించబోతున్నారని అనుకున్నారు. కానీ ఇర్ఫాన్‌ అసలు విషయం చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు.

ఊహించని షాక్

ఊహించని షాక్

స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం ఫ్రీదా పింటోకి ఇటీవల ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఓ స్వచ్ఛంద సంస్థ మురికివాడల కోసం చేస్తున్న సత్కార్యాల్లో ఫ్రీదా పింటో పాలుపంచుకున్నారు. దీనికోసం ముంబయ్‌లో ఉన్న పలు మురికివాడలకు వెళ్లారు ఫ్రీదా. అయితే అక్కడున్నవారెవ్వరూ ఈవిడగార్ని గుర్తుపట్టలేదట. ‘స్లమ్‌డాగ్...’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాననే ఆనందాన్ని పలు సందర్భాల్లో ఫ్రీదా వ్యక్తపరిచారు. మురికివాడల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. కానీ ఆ వాడలకు చెందినవాళ్లు గుర్తుపట్టకపోవడం ఫ్రీదాను ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆమె ఆవేదన పడలేదు... ఈ విషయాన్ని ఫ్రీదా చాలా లైట్‌గా తీసుకున్నారు. 

Monday, December 20, 2010

పవన్‌కల్యాణ్‌ దర్శకత్వం

పవన్‌కల్యాణ్‌ దర్శకత్వం

ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ మరోసారి మెగాఫోన్‌ పట్టుకోబోతున్నారా? అవుననే అంటున్నాయి తెలుగు సినీవర్గాలు. ఆయన ఈసారి స్టార్ట్‌, కెమెరా, యాక్షన్‌... అని చెప్పేది కెమెరా వెనక నుంచి కాదు. ముందు నుంచి! ఆదిత్య ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న సినిమాలో పవన్‌కల్యాణ్‌ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన దర్శకుడిగా కనిపించబోతున్నారు. ఆంగ్లంతోపాటు, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్‌ పాత్రను గోప్యంగా ఉంచారు. ఇందులో ఆయన సినీ దర్శకుడి పాత్రను పోషిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన చిత్రాలు రూపొందించిన యువ దర్శకుడి పాత్ర అది. ఈ చిత్రంలో బాలనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రీస్తు కాలంతో పాటు, సమకాలీన అంశాలను కథలో మేళవించి తెరకెక్కిస్తున్నారు. రచయిత జె.కె.భారవి, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, పవన్‌కల్యాణ్‌ మధ్య ఇటీవల కథామేళవింపుపై చర్చలు జరిగాయి. ఇందులో చురుగ్గా పాల్గొన్న పవన్‌... తన పాత్రపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిసింది. ఇందులో ఆయన సరసన ఓ ప్రముఖ కథానాయిక నటిస్తుంది. ఇటలీ, మొరాకో, ఇజ్రాయెల్‌ల్లో చిత్రీకరణ జరుపుతారు. హాలీవుడ్‌కు చెందిన ప్రొడక్షన్‌ డిజైనర్‌ స్టీఫెన్‌ ఎమ్‌.ఆర్టలానీ, మేకప్‌ నిపుణుడు క్రిస్టినా టిన్స్‌లే ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తారు. నిర్మాత: కొండా కృష్ణంరాజు.

దేనికైనా ఛాలెంజ్

దేనికైనా ఛాలెంజ్


భరత్‌తో ప్రియమణి ‘బెట్’ కట్టబోతున్నారు. ఇది నిజం బెట్ కాదు. సినిమా బెట్. అంటే ఆ సినిమా పేరే ‘బెట్’ అన్నమాట. ప్రముఖ దర్శకుడు సురేష్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఓ తమిళ చిత్రానికి ‘బెత్’ తెలుగు అనువాద రూపం. ‘దేనికైనా ఛాలెంజ్’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. భరత్, ప్రియమణి జంటగా నటించిన ఈ చిత్రాన్ని శిల్పి క్రియేషన్స్ పతాకంపై తొండపు నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రేమ, స్నేహం ఇందులో ప్రథానాంశం. వాటికి సరికొత్త నిర్వచనాన్ని ఈ చిత్రంలో చెప్పాం. స్నేహం కోసం ప్రాణాలిచ్చే పాత్రలో భరత్ పాత్ర చిత్రణ చిత్రణ ఆకట్టుకుంటుంది. భరత్, ప్రియమణి మధ్య జరిగే సన్నివేశాలు పాటలు చాలా బాగుంటాయి. వైజాగ్, మారిషస్, దుబాయ్‌ల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. కొత్త సంవత్సరంలో తొలి రోజున తొలి చిత్రంగా అంటే జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు.ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: దేవా, కెమెరా: భూపతి, నిర్మాణ సారథి, సీహెచ్‌వీయస్‌ఎస్ బాబ్జీ.

Thursday, December 16, 2010

బికినీకి రెడీ

బికినీకి రెడీ

మీరు ఒక పని ఒప్పుకున్నారనుకోండి.. మీ బాస్‌ని మెప్పించడానికి హార్డ్‌వర్క్ చేస్తారు కదా. నేను కూడా అంతే.. నా అభిమానులను సంతోషపెట్టాలనే ధ్యేయంతో కృషి చేస్తాను. అసలు వాళ్లు థియేటర్లకు ఎందుకు వస్తారు? మా అందాలను చూసి తరించాలనే గదా. నేను బికినీ ధరిస్తే నా అభిమానులు ఆనందపడతారు. అందుకే సీన్ డిమాండ్ చేస్తే.. బికినీ ధరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా. అలాగే ప్రముఖ పత్రికల ముఖచిత్రాలపై బికినీలో దర్శనమివ్వడానికి పచ్చజెండా ఊపిన సందర్భాలు ఉన్నాయి. ఆ కవర్‌పేజీని కత్తిరించి గోడకు అంటించుకున్నామని అభిమానులు చెప్పినప్పుడు నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు’’ అంటున్నారు శ్రీయ. అంగాంగ ప్రదర్శనపరంగా ఆమె ఎలాంటి నియమాలు పెట్టుకోరు. పబ్లిక్ ఫంక్షన్స్‌కి వచ్చినప్పుడు కూడా సాధ్యమైనంతవరకు గ్లామరస్ డ్రెస్సులే వేసుకొస్తారామె. ఈ విషయం గురించి అడిగినప్పుడు శ్రీయ పై విధంగా స్పందించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చెన్నయ్‌లో ఉన్నారు. అక్కడ ‘ఫొటోషూట్’ జరుగుతోందట. అర్ధరాత్రి చెన్నయ్‌లోని ప్రముఖ వీధులలో ఈ ఫొటోషూట్ చేస్తున్నారు. దీనికోసం కెన్యాకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ సిడ్నీతో ఆమె ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకున్నారు. ఈ షూట్ గురించి శ్రీయ చెబుతూ - ‘‘రాత్రిపూట చెన్నయ్ మహానగరం సుందరంగా ఉంటుందన్న సంగతి నాకిప్పుడు తెలిసింది. ఇప్పటివరకు నేను కొన్ని ఫొటోషూట్స్‌లో పాల్గొన్నాను. కానీ రాత్రిపూట చేయడం ఇదే తొలిసారి. ఇదొక కొత్త అనుభూతినిస్తోంది’’ అన్నారు.

ఆయన అనుమతితో బర్త్‌డే జరుపుకున్నా

ఆయన అనుమతితో బర్త్‌డే జరుపుకున్నా
 
మంగళవారం రాత్రి నా ముద్దుల సోదరి నాకోసం ఓ ‘గెట్ టు గెదర్’ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ పార్టీలో నా క్లోజ్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. చల్లని వాతావరణంలో పార్టీ చేసుకుంటుంటే చెప్పలేనంత ఆనందం కలిగింది’’ అంటున్నారు సమీరారెడ్డి. ఈ 14న తన పుట్టినరోజు. సరిగ్గా ఆ రోజు షూటింగ్ ఉండటంతో బర్త్‌డే ఎంజాయ్‌మెంట్‌ని మిస్ అయినట్లేనని సమీరా అనుకున్నారు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో ఆమె ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. చెన్నయ్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. కానీ బర్త్‌డే సందర్భంగా సమీరాకు ప్రభుదేవా శెలవు ఇచ్చారట. దర్శకుడు శెలవు ప్రకటించగానే స్కూల్ పిల్లలా సంబరపడిపోతూ సమీరా ముంబయ్ ఫ్లయిట్ ఎక్కి, ఇంట్లో వాలిపోయారు. ఆ విషయం గురించి చెబుతూ - ‘‘ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లో, రెండు హిందీ మూవీస్‌లో నటిస్తూ బిజీగా ఉన్నాను. బర్త్‌డే నాడు అమ్మానాన్నలతో గడిపితే బాగుండు అనుకున్నాను. అయితే దర్శక,నిర్మాతలను శెలవు అడగడానికి మొహమాటమనిపించింది. ప్రభుదేవా సార్ నా పరిస్థితిని అర్థం చేసుకున్నారో ఏమో ఆయనంతట ఆయననే అనుమతి ఇచ్చారు. కుటుంబ సభ్యులతో బర్త్‌డే జరుపుకోవడంతో నూతనోత్సాహం కలిగింది’’ అన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో చేస్తున్న సినిమా గురించి చెబుతూ - ‘‘ఈ చిత్రంలో నేను చాలా మంచి పాత్ర చేస్తున్నాను. ఈ సినిమా గురించి చర్చలు జరిపినప్పుడు ప్రభు సార్ ‘వెరీ టాలెంటెడ్’ అనుకున్నాను. షూటింగ్ ఆరంభించిన తర్వాత ఆ అభిప్రాయం బలపడింది. ఆయన చాలా ఎనర్జిటిక్. విశ్రాంతి కోరుకోరు. చాలా యాక్టివ్‌గా ఉంటారు’’ అన్నారు సమీరా రెడ్డి.

Wednesday, December 15, 2010

అందుకు అభ్యంతరం లేదు

అందుకు అభ్యంతరం లేదు


'లీడర్‌'లో మెరిసిన తార రిచా గంగోపాధ్యాయ. ఈ భామ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి... వారం రోజుల తేడాలో! 'నాగవల్లి', 'మిరపకాయ్‌' చిత్రాల్లో రిచా కథానాయిక. ''నా జీవితంలో ఈ డిసెంబరు నెలని మర్చిపోలేను. వారం రోజుల వ్యవధిలో రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. 'నాగవల్లి' విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆత్రుత పెరిగిపోతోంది. 'మిరపకాయ్‌'లోనూ నా పాత్ర అందరికీ నచ్చుతుంది'' అని ధీమాగా చెబుతోంది. విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ రిచా నాయిక స్థానాన్ని వేరొకరితో పంచుకొంది. 'మిరపకాయ్‌'లో రిచాకు పోటీగా దీక్షాసేథ్‌ ఉంది. 'నాగవల్లి'లో అయితే ఏకంగా ఐదుగురు నాయికలు. వీరిలో ప్రధాన పాత్ర ఎవరికి దక్కింది అనే విషయం దాచిపెట్టారు. ''నాయిక స్థానాన్ని వేరొకరితో పంచుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. అనుష్క లాంటి నటితో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే'' అని చెబుతోంది రిచా.

పరిధి దాటి ప్రవర్తించను

పరిధి దాటి ప్రవర్తించను


‘‘నేను కళాకారిణిని. వృత్తి రీత్యా అందరితో కలిసి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా హీరోలందరితో నాకు మంచి స్నేహబంధం ఉంది. అయితే దానికి కూడా ఓ పరిధి ఉంటుంది. పరిధి దాటి నేనెప్పుడూ ప్రవర్తించను’’ అంటున్నారు కాజల్. ఇటీవల ఓ సందర్భంలో తన మనోగతాన్ని మీడియా ముందు వ్యక్తపరుస్తూ కాజల్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘నేను తెలుగమ్మాయిని కాకపోయినా... తెలుగు హీరోయిన్‌ని అయినందుకు గర్వపడుతున్నాను. కథానాయికలను గౌరవించడంలో తెలుగు చిత్రపరిశ్రమకు సాటి వేరే లేదు. నటిగా ఇక్కడ పూర్తి సంతృప్తిని ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే ఏ భాషలో నటించినా తొలి ప్రాధాన్యత మాత్రం తెలుగుకే’’ అని చెప్పారు. మీ గ్లామర్ రహస్యం ఏంటని ఈ అందాన్ని అడిగితే- ‘‘శరీరంతో పాటు మనసును కూడా అదుపులో పెట్టుకుంటే అందం దానంతట అదే మన సొంతం అవుతుంది. టైమ్‌కి తినడం... సరిపడా నిద్ర పోవడం... వీలైనంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించడం... ఇవన్నీ శరీరాన్ని అదుపులో ఉంచితే, ఆందోళనకు దూరంగా ఉండటం... ప్రశాంతతను ఎక్కువగా ఇష్టపడటం... ఎప్పుడూ హ్యాపీగా ఉండటం లాంటివి మనసును అదుపులో ఉంచుతాయి. అందం కోసం వీటిని తప్పక పాటిస్తాను. నా అందం వెనుకున్న రహస్యం ఇదే’’ అని చెప్పుకొచ్చారు కాజల్.

Tuesday, December 14, 2010

బాధపడొద్దు బాబాయ్..

బాధపడొద్దు బాబాయ్..


ఆరెంజ్ సూపర్ ప్లాప్‌తో నిర్మాత నాగబాబు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యాడు. మొన్నీమధ్య మిరపకాయ్ ఆడియో ఫంక్షన్లో ఆరెంజ్ దర్శకునిపై పరోక్షంగా విరుచుకపడ్డాడు. కోట్ల రూపాయలు పెట్టి నిర్మాత సినిమా తీస్తుంటే, దాన్ని సీరియస్‌గా తీసుకోని కొందరు దర్శకులు నిర్మాతలను పురుగుల్లా పీల్చి పిప్పి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాబాయ్ ఆవేదనను అబ్బాయ్ అర్థం చేసుకున్నాడో ఏమోగానీ, రాంచరణ్ ఆరెంజ్ సినిమాకోసం తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశాడట. బాధపడకు బాబాయ్... నిర్మాత దెబ్బతిన్నప్పుడు నటీనటులు తప్పక ఆదుకోవాలని తన మాటగా చెప్పాడట. మరి రాంచరణ్ బాటలో ఎంతమంది నటీనటులు పయనిస్తారో...? 

అలా చేయకండి ప్లీజ్...

అలా చేయకండి ప్లీజ్...
 
 
ఓ పక్క సినిమాలు, మరో పక్క కమర్షియల్ యాడ్స్... ఇలా సందడి సందడిగా సాగుతోంది అసిన్ కెరీర్. బాలీవుడ్‌లో తన పారితోషికం కూడా కోట్లలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అసిన్ ముందు ప్రస్తావించినప్పుడు- -‘‘ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తారో అర్థం కావడంలేదు. నా లాంటి ఓ స్టార్ హీరోయిన్ ఎంత పారితోషికం తీసుకోవచ్చో నేను అంతే తీసుకుంటున్నాను. నాకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వెచ్చిస్తాను. నేను చేసే సేవల గురించి చెప్పుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే వాటిని గోప్యంగా ఉంచుతాను. దయచేసి ఇలాంటి అబద్ధాలను సృష్టించి... ప్రేక్షకుల్లో నాపై బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలా చేయకండి... ప్లీజ్’’ అని ప్రాధేయపడుతున్నారు అసిన్. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘డబ్బు సంపాదించడం తప్పు కాదు. మనిషే డబ్బును సృష్టించినా... ప్రస్తుతం ఆ డబ్బే మనిషిని నడిపిస్తోంది. అందుకే దాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం’’ అన్నారు. రెమ్యునరేషన్ తక్కువ అయిన కారణంగానే దక్షిణాది చిత్రాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది... అనడిగితే- ‘‘నన్ను స్టార్‌ని చేసింది దక్షిణాది పరిశ్రమే. అలాంటి పరిశ్రమకు దూరంగా ఎందుకు ఉంటాను చెప్పండి...? ఇటీవలే కథ నచ్చడంతో ఓ తమిళ చిత్రం చేస్తున్నాను. ఆ సినిమాకు నేను తీసుకుంటోంది సగం పారితోషికమే. బాలీవుడ్‌లో సినిమాలతోను, వాణిజ్యప్రకటనలతోను బిజీగా ఉన్నా... కథ నచ్చడంతో ఈ సినిమా అంగీకరించాను. కథ, పాత్ర నచ్చితే... పారితోషికాన్ని పెద్ద పట్టించుకోను’’ అని చెప్పారు అసిన్.

Monday, December 13, 2010

మసాజ్ పార్లర్‌లో ఏం జరిగింది?

మసాజ్ పార్లర్‌లో ఏం జరిగింది?

అవినాష్, సలీమ్, మల్లిక, సుమ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'మల్లిక మసాజ్ సెంటర్'. బాలీవుడ్‌లో విడుదలైన ఓ చిత్రాన్ని ఈ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఎస్.వి.రమణ, మహిపాల్‌రెడ్డి నిర్మాతలు. రసూల్ ఆలమ్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ "ఉద్యోగరీత్యా బ్యూటీపార్లర్‌లో చేరిన ఓ యువతి అనుకోకుండా మర్డర్ మిస్టరీలో చిక్కుకుంటుంది. ఆ సమస్య నుంచి ఆమె ఎలా బయటపడింది అనేది కథాంశం. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యువతను ఆకట్టుకునే అంశాలు ఎన్నో వున్నాయి. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ నెల 25న తెలుగులో విడుదల చేస్తాం. తర్వాత తమిళంలోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''ని అన్నారు. అవినాష్, సలీమ్, మల్లిక, సుమ, దీపక్, ఫిరోజ్‌ఖాన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పి.వి.రవీంద్రరెడ్డి, నిర్మాణం: ఇస్కాన్ క్రియేషన్. 

నెల తప్పి నెల రోజులైంది

నెల తప్పి నెల రోజులైంది
 
 
సెక్సీభామ మల్లికా షెరావత్ నటించిన ‘హి..స్..స్..స్..’ చిత్రం ఇటీవలే విడుదలై ‘తుస్...స్...స్’ అనిపించుకున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందు ఈ సినిమా గురించి తెగ గొప్పలు చెప్పుకున్న ఈ సెక్స్ బాంబ్... ఫలితం చూసి కుదేలైపోయుంటారని అందరూ భావించారు. కానీ మల్లికలో సినిమా ఫ్లాప్ అయ్యిందన్న బాధ ఇసుమంత కూడా కనిపించడంలేదు. బాధ పడకపోగా తన ట్విట్టర్‌ని ఫాలో అయ్యేవారిని ఫూల్స్ చేస్తూ... ఆ విధంగా తన పబ్లిసిటీని పెంచుకుంటున్నారు. విషయంలోకెళితే... ఇటీవలే మల్లిక తన ట్విట్టర్‌లో ‘‘నేను నెల తప్పి నెల రోజులైంది. ప్రస్తుతం నేను గర్భవతిని’’ అంటూ ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ఈ మెసేజ్ చూడగానే ఆమె ఫాలోయర్స్‌కు కడుపు ఉబ్బరం అగక ‘‘ఈ పుణ్యం కట్టుకున్న పురుష పుంగవుడు ఎవరు...?’’ అని అడిగారట. దాంతో ఈ అందాల భామ వారి ఆరాటం చూసి... నవ్వు ఆపుకోలేకపోయారట. వెంటనే ‘జస్ట్ జోక్’’ అంటూ మరో మెసేజ్ పోస్ట్ చేశారట. దాంతో వారి ఉత్సాహం కాస్తా నీరుగారిపోయిందని సమాచారం. ఇటీవల కొందరు హీరోయిన్లు ట్విట్టర్స్‌ను తమ సొంత పబ్లిసిటీకి వాడుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే... మల్లిక ఈ మెసేజ్‌లు పోస్ట్ చేసి ఉంటారని కొందరు అనుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఏప్రిల్ రావడానికి నాలుగు నెలలకు ముందే ఫాలోయర్స్‌ను ఫూల్స్ చేశారు మల్లిక.
 

Friday, December 10, 2010

తెలియక పొరపాటు చేశా

తెలియక పొరపాటు చేశా


ప్రతిభకు తగ్గ ప్రతిఫలం దక్కినప్పుడు కలిగే ఆనందానికీ, తృప్తికి విలువ కట్టలేం. ‘పరుత్తివీరన్’ చిత్రానికి జాతీయ ఉత్తమనటిగా ఎంపికైనప్పుడు అలాంటి అనుభూతినే పొందాను. ప్రస్తుతం ‘రక్తచరిత్ర’ విజయం కూడా దాదాపు అలాంటి అనుభూతినే ఇచ్చింది’’ అంటున్నారు ప్రియమణి. ‘రక్తచరిత్ర’ చిత్రంలోని తన పాత్రకు ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి స్పందన వస్తోందని, ఇది గ్లామర్ తారగా కాకుండా, ఒక నటిగా నేను సాధించిన విజయం అని చెప్పారు ప్రియమణి. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘ఇంకొన్ని రోజుల్లో వెళ్లిపోతున్న ఈ 2010 నా జీవితంలో మరచిపోలేని సంవత్సరం. మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ లాంటి దేశం గర్వించదగ్గ దర్శకులతో పనిచేసే అవకాశం ఇచ్చిన సంవత్సరం ఇది. అందుకే నా లైఫ్‌లో ఇదొక మెమరబుల్ ఇయర్’’ అన్నారు. మరికొన్ని విషయాలను ప్రియమణి చెబుతూ- ‘‘నాకు నటన అంటే ఇష్టం. తొలినాళ్లలో కొన్ని పరాజయాలు నాకు చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇక నటన జోలికి వెళ్లకుండా మోడలింగ్ వైపే దృష్టిపెడదాం అనుకున్నాను. అలాగే చే శాను కూడా. కానీ ఏదో తెలియని వెలితి. నేను చేస్తుంది కరెక్ట్ కాదని అనిపించింది. ఆ సమంలోనే పరుత్తివీరన్ అవకాశం వచ్చింది. ఆ విజయం నా జీవితాన్నే మార్చేసిన విషయం తెలిసిందే’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు ప్రియమణి. ‘‘ఇక్కడ నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఒలికించక తప్పదు. అందుకే స్థిరత్వం కోసం గ్లామర్ బాట పట్టాను. కానీ కొన్ని సందర్భాల్లో కొందరి మాటలు నన్ను పక్కదారి పట్టించాయి. బికినీలంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు. ‘ద్రోణ’కు ముందు బికినీలో ఎవరైనా కనిపించారా...? అనే విషయం కూడా తెలీదు. ‘స్టైల్‌గా పాటను తీస్తాం... ‘తుషార్’ చిత్రంలో కరీనా కపూర్‌లా మిమ్మల్ని చూపించాలనేది నా తపన’ అని నాతో బికినీలో నటింపజేశారు ఆ చిత్ర దర్శకుడు. కానీ తర్వాత నేను ఎదుర్కొన్న విమర్శలు నాకు ఎంతో బాధ కలిగించాయి. అందుకే ఇక నుంచి గ్లామర్ విషయంలో కూడా కొన్ని పరిధులను పాటించాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు ప్రియమణి.

ఎవడాడు.. నరికేస్తా....!: సింహా విజయోత్సవంలో బాలయ్య

ఎవడాడు.. నరికేస్తా....!: సింహా విజయోత్సవంలో బాలయ్య 


నిర్మాత మహేంద్ర వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నందమూరి హీరో బాలయ్యబాబు సింహా విజయోత్సవ ఫంక్షన్‌  వైశ్రాయ్‌లో జరిగింది. ఆ ఫంక్షన్‌కు మీడియా వెళితే మీరెందుకు వచ్చారు. మీకు కావాల్సినవి (కవర్లు) రేపు ఇస్తాం. అప్పుడురండి అంటూ చులకనగా మాట్లాడాడు. దీనిపై చర్చ జరిగింది. ఇంతలో సీనియర్ జర్నలిస్టు బాలయ్య దృష్టికి తేవడంతో "ఎవడాడు.. నరికేస్తా.. నా కొ.." అంటూ తిట్టాడు. దీంతో నిర్మాత హుటాహుటిన వచ్చి బాలయ్యకు క్షమాపణ చెప్పాడు.ఆ తర్వాత మహేంద్ర తరపున తాను క్షమాపణ చెబుతున్నానని బాలయ్య అనడంతో.. మీరు అవసరం లేదని జర్నలిస్టులు చెప్పారు. తదనంతరం మహేంద్ర మొహం చాటేసి టాయ్‌లెట్స్ రూమ్‌లో మీడియా ప్రముఖులతో కాళ్ళపై పడి క్షమాపణ కోరాడు. 

Thursday, December 9, 2010

ఏమెట్టి పెంచారే నిన్ను

ఏమెట్టి పెంచారే నిన్ను 

రామ్‌గోపాల్‌వర్మ కలం చేతపట్టారు. ఇన్నాళ్లు తన సినిమాలకు కథలు, మాటలు రాసుకున్న ఆయన తొలిసారిగా ఓ పాట రాశారు. అదికూడా సాదాసీదా పాట కాదు. స్ర్తీ అందాన్ని వర్ణిస్తూ సాగే మాస్ మసాలా సాంగ్. సునీల్ హీరోగా శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై కోనేరు కిరణ్‌కుమార్ నిర్మాణంలో ఆయన రూపొందిస్తున్న ‘కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ చిత్రం కోసం ఆయన ఈ పాట రాశారు. కోటి స్వరసారథ్యంలో గీతామాధురి, సింహ ఈ పాటను ఆలపించారు. ఈ పాట బుధవారం మార్కెట్లోకి విడుదలైంది. మరో పాటను వచ్చేవారం విడుదల చేస్తారు. తొలిసారిగా తాను రాసిన ఈ పాట గురించి రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ-‘‘విచిత్రమైన పరిస్థితుల నడుమ వచ్చే పాట ఇది. సినీరంగంలోకి అడుగుపెట్టిన అప్పల్రాజుకు తొలి ప్రయత్నంలోనే అదృష్టం లాంటి దురదృష్టం ఎదురవుతుంది. కష్టపడి రాసుకున్న గొప్ప కథకు సావిత్రి లాంటి అందం, ఆహార్యం, నటన గల నటిని అప్పల్రాజు ఊహించుకుంటుంటే... నిర్మాత మాత్రం అందాల ప్రదర్శన తప్ప ఇంకేమీరాని ఓ కమర్షియల్ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతాడు. దాంతో ఆ హీరోయిన్‌ను కలవడానికి షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కి వెళ్తాడు అప్పల్రాజు. అక్కడ ఆ హీరోయిన్, హీరోపై ఈ పాట చిత్రీకరణ జరుగుతుంటుంది. ఈ పాట సాహిత్యాన్ని, హీరోయిన్ ఎక్స్‌పోజింగ్‌ని చూసి అప్పల్రాజు కళ్లు, చెవులు రెండూ మూసుకుంటాడు. ఇదీ ఈ పాట సందర్భం’’ అని చెప్పారు వర్మ. ఇంకా ఆయన చెబుతూ- ‘‘నేను ఈ పాట రాయడానికి బలీయమైన కారణమే ఉంది.స్ర్తీని దేవుడు సృష్టించిన అత్యంత మహాసృష్టిగా భావించి, ప్రేమించి, గౌరవించి, ఆరాధించి నేను ఈ పాట రాశాను. కేవలం అమ్మాయిలను మాత్రమే పొగడకుండా అబ్బాయిలను కూడా పొగిడాను. కాకపోతే అమ్మాయిల గురించి నేను రాసిన ప్రతి మాటా నా హృదయంలోంచి వచ్చినవి. అబ్బాయిల గురించి రాసినవన్నీ... ఉత్తుత్తివి.’’ అంటూ చెప్పుకొచ్చారు రామ్‌గోపాల్‌వర్మ. ఈ చిత్రానికి సహనిర్మాత: సుమన్ వర్మ, సమర్పణ: వందిత కోనేరు.

అనుష్కపై కన్ను

అనుష్కపై కన్ను
 
సకల కళా వల్లభుడి కన్ను అనుష్కపై పడిందంటోంది కోలీవుడ్. అదే నిజమైతే అనుష్క పంట పండినట్లే. ఈ క్రేజీ నటి తమిళంలో విజయ్, సూర్య, శింబు, విక్రమ్, మాధవన్‌తో జత కట్టారు. టాప్ 10లో నెంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారు. ఇక కమలహాసన్‌తో నటించే అవకాశం వస్తే ఆమెకంతకంటే అదృష్టం ఏముంటుంది. కాగా ప్రస్తుతం విక్రమ్ జంటగా మదరాసుపట్టణం ఫేమ్ విజయ్ దర్శకత్వంలో నటిస్తున్న అనుష్కపై కమల్ దృష్టి పడిందని సమాచారం. మన్మథన్ అంబు చిత్రాన్ని పూర్తి చేసిన కమలహాసన్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారని తెలిసింది. దీనికి తలైవన్ ఇరుకిండ్రాన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో తనకు జంటగా అనుష్కను ఎంపిక చేయాలనే అభిప్రాయంతో కమల్ ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిలింస్‌తో కలసి భారీస్థాయిలో నిర్మించడానికి ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ ముందుకొచ్చినట్లు కోలీవుడ్ భోగట్టా.

Wednesday, December 8, 2010

ఆయనతో పోల్చకండి

ఆయనతో పోల్చకండి
అందరికీ నమష్కారం...’’ పరభాష నుంచి ఇక్కడకు దిగుమతైన కథానాయికలు తప్పక నేర్చుకునే తెలుగు మాట ఇది తాము నటిస్తున్న సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడేటప్పుడు... ఈ మాటతో స్పీచ్ ప్రారంభిస్తారు. ఇక మిగిలిందంతా... ఇంగ్లీషే. కనీసం స్టార్‌డమ్ వచ్చాక కూడా తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయరు. అనుష్క, చార్మి, ప్రియమణి లాంటి తారలను మినహాయిస్తే... దాదాపు అందరి పరిస్థితి ఇదే. ఈ పద్ధతి కరెక్ట్ కాదు అంటున్నారు శ్రుతి హాసన్.చెప్పే డైలాగ్‌పై మనకు కమాండ్ లేకపోతే... పాత్ర ఎలా పండుతుంది అని ప్రశ్నిస్తున్నారామె. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘ఈ విషయంలో నాన్నే నాకు ఆదర్శం. నాన్నగారు ఏ భాషలోనైనా డెరైక్ట్‌గా నటిస్తే.. ఆయన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకునేవారు. ముఖ్యంగా నాన్నకు తెలుగుభాషంటే చాలా ఇష్టం. తెలుగు చాలా తీయనైన భాష అంటారాయన. మనం ఏ భాషలో నటించినా.. భాషపై పట్టు ఉంటేనే పాత్ర పండుతుంది అని చెప్పేవారు నాన్న. ఆయన మాటను తూ.చ తప్పక పాటిస్తాన్నేను. ఇక నుంచి తెలుగులో ఏ సినిమా చేసినా... నా పాత్రకు నా గాత్రమే వినిపించేలా ప్రయత్నిస్తా’’ అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘నేను కమల్‌హాసన్ కుమార్తెను అవ్వడం వలన నన్ను నాన్నతో పోల్చి చూడటం సర్వసాధారణం. కానీ ఆయనకూ నాకూ నక్కకూ, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నా వయసు ఇరవై ఏళ్లు. నటుడిగా ఆయన వయసు యాభై ఏళ్లు. అలాంటి గొప్ప వ్యక్తితో నన్ను పోల్చడం కరెక్ట్ కాదు. నా వరకు నేను ఎలా చేస్తున్నాను... అని మాత్రమే చూడండని ప్రేక్షకులకు మనవి చేస్తున్నాను’’ అన్నారామె.

నగ్నంగా ఫోజిస్తే నీకు కోటి రూపాయలిస్తాం...

నగ్నంగా ఫోజిస్తే నీకు కోటి రూపాయలిస్తాం... 


ముంబయిలో ఇటీవల ఓ కార్యక్రమానికి ప్యాంటీ వేసుకోకుండా వచ్చి దర్శనమిచ్చిన యానాగుప్తా ఫోటోలను చూసి విదేశీ పత్రికలు ఆమె కాల్షీట్లకోసం ఎగబడుతున్నాయట. తాజాగా ఓ పత్రిక ఆమె ముందు మంచి ఆఫర్ ఉంచిందట. అదేమంటే... పూర్తి నగ్నంగా కనబడుతూ తమ పత్రిక కవర్‌పేజీకి ఫోజిస్తే కోటి రూపాయలు చెల్లిస్తామంటూ సదరు పత్రిక సందేశాన్ని పంపిందట. ఆ ఆఫర్‌ను అంగీకరించే విషయమై యానా తటపటాయిస్తుందట. ఇదిలావుంటే యానా ప్యాంటీలెస్ ఫోజిలివ్వడంపై ఇప్పటికే దేశంలో పలుచోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో యానా నగ్నంగా ఫోజివ్వడానికి అంగీకరిస్తే ఆమె కెరీర్ మటాష్ అవుతుందని బాలీవుడ్ ఫిలిమ్ జనం అంటున్నారు. మరి... యానా ఏం చేస్తుందో..?

Tuesday, December 7, 2010

సీన్ రివర్స్ అయ్యింది!

 సీన్ రివర్స్ అయ్యింది!


సినీ పరిశ్రమలో కథానాయికల మధ్య పోటీ అనేది సర్వసాధారణం. ఆ పోటీ కాస్త ముదిరితే కథానాయికల మధ్య కోల్డ్‌వార్‌కు దారి తీస్తుంటుంది. అలాంటి వాతావరణమే నయనతార, త్రిషల మధ్య వుందని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తుంటాయి. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఇరువురి సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ఈ తారల కోల్డ్‌వార్‌కు మరింత ఆజ్యం పోసే విధంగా ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. వివరాల్లోకి వెళితే... ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో ‘సావిత్రి’ పేరుతో త్వరలో ఓ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది. మొదట్లో ఈ చిత్రంలో దర్శకుడు త్రిషను నాయికగా ఎంపిక చేశారు. కాగా ఇప్పుడు త్రిష స్థానంలో నయనతార పేరును పరిశీలిస్తున్నారని తెలిసింది. గతంలో నయనతార ‘లక్ష్మీ, తులసి’ చిత్రాల్లో వెంకటేష్‌తో జత కట్టారు. అయితే ప్రభుదేవాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న నయనతార గత కొద్ది కాలంగా సినిమాలు అంగీకరించడం లేదు.కానీ ఇప్పుడు ఆమె వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకే బాలకృష్ణతో కలిసి ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ చిత్రంలో ఆమె సీత పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా నయనతార. అయితే తను చేయాలనుకున్న పాత్రపై నయన దృష్టి పెట్టడం త్రిషకు అస్సలు మింగుడుపడటం లేదట. గతంలో తమిళంలో నయనతార చేయవలసిన కొన్ని పాత్రలను త్రిష చేజిక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ‘సావిత్రి’లో కనుక నయనతార కమిట్ అయితే సీన్ రివర్స్ అయ్యిందని చెప్పొచ్చు.

వైఎస్ జగన్‌పై సినిమా

వైఎస్ జగన్‌పై సినిమా 
 
నిజజీవితాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకునే రాంగోపాల్ వర్మ మదిలో మరో కొత్త ఆలోచన పుట్టుక వచ్చినట్లు భోగట్టా. అదేమిటంటే... వైఎస్ జగన్ జీవితంపై సినిమా తీయాలనుకోవడం. వైఎస్సార్ మరణానికి ముందు, ఆ తర్వాత వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఎలా సాగిందన్న దానిపై వర్మ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే "వైఎస్ జగన్ రాజకీయం" అనే పేరుతో వర్మ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు భోగట్టా. ఇకపోతే ఇప్పటికే ప్రకటించిన బెజవాడ రౌడీలు చిత్రం స్క్రిప్టుపై వర్మ ప్రత్యేక దృష్టిలో పెట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నటిస్తారని సమాచారం.
 

Monday, December 6, 2010

మల్లికా శరావత్ శృంగారం వేస్టయింది

మల్లికా శరావత్ శృంగారం వేస్టయింది 
ఒకప్పుడు మలయాళంలో మమ్ముట్టి చిత్రం షకీలా చిత్రం విడుదలైతే షకీలాకు అద్భుత రెస్పాన్స్ వచ్చేది. తెలుగులో కూడా అప్పట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. తాజాగా మల్లికా శరావత్ మత్స్యకన్యగా తన అందాలను ఆరబోసిందనే చెప్పాలి. కానీ ఆమె హిస్‌స్ అని బుసకొట్టినా అదే టైంలో రిలీజై రక్తచరిత్రతోపాటు మరో రెండు తెలుగు సినిమాల ముందు ఆడలేదు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన చదలవాడ శ్రీనివాసరావు చేతులు కాల్చుకున్నాడు. రోబో వంటి చిత్రాన్ని విడుదల చేయాల్సింది మిస్సై ఇలా శృంగారపు సినిమా కూడా సక్సెస్ చేయలేకపోయాడని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

బిపాసా అంటే నాకు అసూయ

బిపాసా అంటే నాకు అసూయ
 
‘మీలో మీకు నచ్చనిది ఏంటి?’’ అనే ప్రశ్నను సోనమ్ కపూర్ ముందుంచితే.. ‘నా కాళ్లు’ అని ఠకీమని చెబుతారు. అద్దం ముందు నిలబడినప్పుడు పొరబాటున కూడా తన కాళ్ల వైపు చూసుకోరట. ‘‘నాకు కనుక బిపాసా బసులాంటి కాళ్లు ఉండి ఉంటే ఎంత బాగుంటుందో.. బిపాసా కాళ్లు చాలా బాగుంటాయి. అంత అందమైన కాళ్లను సొంతం చేసుకున్న బిపాసా అంటే నాకు అసూయ’’ అంటున్నారు సోనమ్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘ప్లేయర్స్’ అనే చిత్రం రూపొందుతోంది. మామూలుగా ఇద్దరు నాయికలు ఓ సినిమాలో కలిసి నటిస్తే.. కచ్చితంగా మనస్పర్థలు ఉంటాయంటారు. కానీ సోనమ్, బిపాసా ఆ మాటలు తప్పని నిరూపిస్తూ.. స్నేహంగా ఉంటున్నారట.

Thursday, December 2, 2010

పెళ్లయిన మగాడితో నటి నికిత సీక్రెట్ ఎఫైర్

పెళ్లయిన మగాడితో నటి నికిత సీక్రెట్ ఎఫైర్ 

తెలుగులో ఆర్యన్ రాజేష్ సరసన నటించించి నికిత ఆ తర్వాత రెండుమూడు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఆమె కన్నడలో బిజీగా నటిస్తోంది. పెండ్లి గురించి అడిగితే టైమ్ రావాలనేది. అది వచ్చినట్లుంది. హీరో దర్శన్‌తో కాపురం చేస్తుందన్న వార్తలు గుప్పుమన్నాయి. రహస్యంగా పెండ్లి చేసుకున్న ఈ జంట ఇటీవల ఊటీలో దర్శనమిచ్చారట. నికిత గుర్తుపట్టలేని విధంగా మోడ్రన్‌గా తయారైంది. దర్శన్‌కు ఆల్రెడీ కొడుకు ఉన్నాడు. తను ముంబయిలో ఉంటున్నట్లు అక్కడ గెస్ట్‌హౌస్‌లో చెప్పిందట. దర్శన్ ఆమెకు ఫ్లాట్ ఇచ్చాడని సమాచారం. ఒక ఏజ్ వచ్చాక తోడును కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇండస్ట్రీలో అందగత్తెలంతా సెకండ్స్‌గా ఎందుకెళతారో అర్థంకాని ప్రశ్న. 

'మిస్టర్ పర్ఫెక్ట్'

 'మిస్టర్ పర్ఫెక్ట్'

 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి 'మిస్టర్ పర్ఫెక్ట్' అనే పేరును ఖరారు చేశారు. దశరథ్.కె. దర్శకుడు. నిర్మాత దిల్‌రాజు చిత్ర విశేషాలను చెబుతూ " ఈ ఏడాది మా సంస్థ నుంచి 'రామ రామ కృష్ణ కృష్ణ', 'బృందావనం' విడుదలయ్యాయి.ఒకటి అబవ్ యావరేజ్, మరోటి సక్సెస్ సినిమాగా నిలిచి సంతృప్తిని మిగిల్చాయి. మా సంస్థ నిర్మిస్తున్న 12వ చిత్రానికి ప్రభాస్ కథానాయకుడు. ఈ సినిమాకు 'మిస్టర్ పర్ఫెక్ట్' అనే పేరును ఖరారు చేశాం. ఈ టైటిల్‌ను మాకిచ్చిన మహేష్‌బాబు, సురేందర్‌రెడ్డి, ఆర్.ఆర్.మూవీ వెంకట్‌కు కృతజ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 15తో పూర్తవుతుంది.సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో పాటల్ని కూడా విడుదల చేస్తాం. ఎక్కడో చర్చల్లో వచ్చిన పాయింట్ ఆధారంగా రెండేళ్ళు కష్టపడి తయారు చేసిన కథ ఇది. ప్రభాస్ మీద కొత్త స్టైల్‌ను ప్రయత్నించాం. 'మిస్టర్ పర్ఫెక్ట్' అంటే ఏమిటో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫ్యామిలీ, యూత్‌కు నచ్చే అన్ని అంశాలుంటాయి.
మూడు ఫైట్లు కూడా ఉన్నాయి. 'బొమ్మరిల్లు' తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మా బ్యానర్‌లో సంగీతాన్నందించిన సినిమా ఇది'' అని అన్నారు. కాజల్, తాప్సి నాయికలు. ప్రకాష్‌రాజ్, కె.విశ్వనాథ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షిండే, రఘుబాబు, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, బెనర్జీ, రాజా రవీంద్ర, సమీర్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మోహన్, కౌశల్, భగవాన్, తులసి, ప్రగతి, రజిత, సుదీప, ఉషాశ్రీ, అనితానాథ్, సంధ్యా ఝనక్, ప్రభావతి తదితరులు ఇతర పాత్రధారులు.ఈ చిత్రానికి మూలకథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే: పి.హరి, పాటలు: సిరివెన్నెల, అనంత్‌శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, బాలాజి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: విజయ్.కె.చక్రవర్తి, కళ: రవీందర్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, కథ, దర్శకత్వం: దశరథ్.కె. 

అందుకే నా గురించి వదంతులు రావు

అందుకే నా గురించి వదంతులు రావు

‘వేదాంతాలు వల్లిస్తున్నానని అనుకోకపోతే ఓ మాట చెబుతా. ‘మనకు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఏదైనా మనకు దక్కాలి అని ఉంటే మనం వద్దనుకున్నా అది దక్కే తీరుతుంది’’ అంటున్నారు కాజల్ అగర్వాల్. ఇలియానా, త్రిష, సమంత లాంటి తారలు మీకు గట్టి పోటీనిస్తున్నారు కదా? ఆ విషయంపై మీ ఫీలింగ్ అన్నప్పుడు ఈ బ్యూటీ పై విధంగా స్పందించారు. మరింత వివరంగా చెబుతూ - ‘‘ఏడాదికి దాదాపు వంద సినిమాలు రూపొందుతాయి. అందుకని ఎంతమంది కథానాయికలున్నా అందరికీ అవకాశాలు దక్కుతాయి.పైగా మేం ఒకే భాషకు పరిమితం కావడంలేదు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడం, మలయాళం.. అంటూ దక్షిణాది భాషలన్నింట్లోనూ చేస్తున్నాం. కాబట్టి పోటీ విషయంలో నేను ఏమాత్రం భయపడటంలేదు. అలాగే ఇతర తారల అవకాశాలను లాక్కోవాలని అనుకోను. నాదాకా వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోను’’ అన్నారు కాజల్. సినిమాల్లో బబ్లీగా యాక్ట్ చేసే కాజల్ విడిగా కూడా అలాగే ఉంటారు. అందరితో కలిసిపోయి స్నేహంగా మాట్లాడుతుంటారు. తెలుగు పరిశ్రమలో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని కాజల్ చెబుతూ - ‘‘నేను అందరితో కలివిడిగా ఉంటాను కాబట్టి నాతో కూడా అలానే ఉంటారు. ఎక్స్‌ట్రాలు చేయను. హద్దులో ఉంటాను కాబట్టి.. ‘ఫలానా హీరోతో కాజల్‌కు లవ్ అట’లాంటి వదంతులు నా గురించి రాలేదు. షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లిపోతాను. పబ్‌లకు దూరంగా ఉంటాను. వేళ కాని వేళ్లల్లో పార్టీలు చేసుకోను. క్రమశిక్షణగా ఉంటాను కాబట్టే నా గురించి ఎవరూ చెడుగా మట్లాడరు’’ అంటున్నారు.
 

Wednesday, December 1, 2010

హ్యాండిచ్చి మంచి పని చేశాడు

హ్యాండిచ్చి మంచి పని చేశాడు
ఇటీవల జెనీలియా ఓ ప్రైవేటు టాక్సీలో షూటింగ్‌కి అటెండ్ అయ్యారు. ప్రైవేటు టాక్సీలో దిగిన జెనీలియాను చూసి షూటింగ్‌స్పాట్‌లో ఉన్నవారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక జెన్నీని తీసుకొచ్చిన టాక్సీ డ్రైవర్ పరిస్థితి అయితే.. వర్ణించనవసరంలేదు. అందాల హాసిని తన కారులో ఆశీనురాలైంది అంటే ఆ సగటు మనిషి హృదయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవ్వకుండా ఉంటుందా...! అసలు జెన్నీకి ఇలా ప్రైవేటు టాక్సీలో రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనే విషయానికొస్తే... సమయాన్ని వృధా చేయడం అంటే జెన్నీకి ఇష్టం ఉండదు. ఒకరోజు షూటింగ్‌కి రెడీ అయ్యి.. ఇంటి లాన్‌లోకి వచ్చారామె. అక్కడ కారు లేదు, డ్రైవరూ లేడు. కాసేపు డ్రైవర్ కోసం వెయిట్ చేశారు జెన్నీ. ఎంతసేపటికీ అతను రాలేదు. అప్పుడర్థమైంది తనకు డ్రైవర్ హ్యాండిచ్చాడని. ఇక లేట్ చేయడం మంచిది కాదు అనుకున్నారు జెనీలియా.వెంటనే బయటికొచ్చి ఓ ప్రైవేటు టాక్సీని మాట్లాడుకొని షూటింగ్‌కి వచ్చేశారు. అదీ విషయం. ఆ సంగతి గురించి జెన్నీ వివరిస్తూ- ‘‘డ్రైవర్ హ్యాండిచ్చినందుకు బాధ పడటంలేదు. ఎందుకంటే... అతను హ్యాండివ్వడం వల్ల ఒకప్పటి మధురానుభూతులు మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. టాక్సీలో వెళుతున్నప్పుడు చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ట్రైన్స్‌లోనూ, రిక్షాల్లోనూ స్కూలుకి వెళ్లిన రోజులు, అమ్మతో పాటు మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చిన రోజులు... గుర్తొచ్చాయి. హీరోయిన్ అయిన తర్వాత పబ్లిక్ వెహికల్‌లో తిరగడం కుదర్లేదు. డ్రైవర్ హ్యాండివ్వడం వల్ల ఆ అవకాశం దొరికింది’’ అంటూ తనదైన శైలిలో స్మైల్ ఇచ్చారు 

హీరోయిన్ అందాలను ఆస్వాదించిన నిర్మాత స్నేహితులు

హీరోయిన్ అందాలను ఆస్వాదించిన నిర్మాత స్నేహితులు

ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి నిర్మాతలు వచ్చేది డబ్బుతో ఎంజాయ్ చేయడానికేనని పలు సంఘటనలు ఒక్కోసారి రుజువు చేస్తుంటాయి. ఓ నిర్మాత ఆదివారంనాడు షూటింగ్ చేపట్టాడు. దర్శకుడు, నిర్మాత రెండూ ఆయనే అవ్వడంతో హీరోయిన్ బికినీ షాట్ సీన్‌కు ఆయన తన ఫ్రెండ్స్‌ను తీసుకవచ్చాడు.బికినీలో ఉన్న ఆమె అందాలను వారు బాగా ఆస్వాదించారు. మూడు టేకులు వరకు చేయించారు. చాలా సిగ్గుతో చేసిన ఆమె ఆ తర్వాత మేకప్‌మేన్ అసలు సంగతి ఆమెకు ఉప్పదించడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే తను ఇక చేయనని చెప్పేసింది. ఆ తర్వాత తను రేపటి నుంచి రావడంలేదని వేరే షూటింగ్‌కు కమిట్ అయ్యానని తప్పుకుంది. అది సినిమా కాబట్టి నిర్మాత ఏమీ చేయలేని పరిస్థితి. రాత్రి ఆమె దగ్గరకు వెళ్లి సారీ చెప్పాడు. మరి ఆ తర్వాత ఏమైందోకానీ... తను ఊరు వెళ్లిపోతున్నట్లు చెప్పిందట. కొత్త అమ్మాయిలూ... వేషంకోసం వస్తే తస్మాత్ జాగ్రత్త.

Tuesday, November 30, 2010

డిసెంబర్ 5న 'మిరపకాయ్'ఆడియో

డిసెంబర్ 5న 'మిరపకాయ్'ఆడియో

 వితేజ హీరోగా హరీష్ శంకర్ ఎస్. దర్శకత్వంలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుష్పాల నిర్మిస్తున్న 'మిరపకాయ్' చిత్రం ఆడియో డిసెంబర్ 5న, సినిమా అదే 23న విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాత వెల్లడిస్తూ 'మా చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది.హైదరాబాద్, రాజమండ్రి, స్విట్జర్లాండ్, బ్యాంకక్‌లో చాలా లావిష్‌గా చిత్రీకరించాం. రవితేజ ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్, హరీష్‌శంకర్ టేకింగ్, థమన్ మ్యూజిక్, రాంప్రసాద్ ఫొటోగ్రఫీ మా సినిమాకి హైలైట్స్‌గా నిలుస్తాయి. మిరపకాయ్ టైటిల్‌కు తగ్గట్లుగానే రవితేజ పాత్ర ఉంటుంది. పాటలు బాగా వచ్చాయి. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన క్లైమాక్స్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది.వచ్చే నెల 5న ఆదిత్య సంస్థ ద్వారా ఆడియోను విడుదల చేస్తున్నాం. అలాగే డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు చిత్రంలో ఉన్నాయి' అన్నారు. దర్శకుడు హరీష్‌శంకర్ మాట్లాడుతూ 'రవితేజ నుంచి ఏ తరహా చిత్రాన్ని ఆయన అభిమానులు, ప్రేక్షుకులు కోరుకుంటారో దానికి తగ్గట్లుగానే ఈ సినిమా ఉంటుంది' అన్నారు. 

ఆరబోతకు అర్హత ఉండాలి

ఆరబోతకు అర్హత ఉండాలి
 
 
పాత్ర స్వభావాన్ని బట్టి డ్రెస్ ఉంటుంది. నవీనభావాలు కలిగిన అమ్మాయి పాత్ర వేసి.. పరికిణీలో కనిపిస్తే ఏం బావుంటుంది చెప్పండి? అసభ్యం.. అశ్లీలత లాంటివి చూసే కళ్లపై ఆధారపడి ఉంటుంది. నాకు అందంగా కనిపించింది మీకు అశ్లీలంగా కనిపించొచ్చు. మీకు అశ్లీలంగా అనిపించింది నాకు అందంగా కనిపించొచ్చు’’ అంటూ లాజిక్కులు లాగుతున్నారు విమలారామన్. ఇంతకీ ఈ విశ్లేషణకు కారణం ఏమిటి అనుకుంటున్నారా?... అవసరాన్ని బట్టి అందాల ప్రదర్శన చేస్తూ... దానికి ‘గ్లామర్’ అని పేరు పెట్టి కెరీర్ లాగించేస్తోన్న నేటి నాయికల గురించి ఆమె వద్ద ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె చెబుతూ-‘‘నా దృష్టిలో అందాల ఆరబోతకు కూడా ఓ అర్హత కావాలి. ఆకర్షణీయమైన శరీరాకృతి, అబ్బురపరచే అందం ఉంటే ఏ రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేసినా ఎబ్బెట్టుగా ఉండదు’’ అని తన మనసులోని మాటను ఆవిష్కరించారు విమలారామన్. ఏనాడూ తాను ఇబ్బంది కలిగించే రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేయలేదని, కథకు, సన్నివేశానికి అవసరం అనిపిస్తే అప్పుడు తప్పదని, పైగా అది నటిగా తన కర్తవ్యమని ఆ వెంటనే మాట మార్చేశారు ఈ మలయాళ మందారం.

Monday, November 29, 2010

జగన్ రాజీనామా పూర్తి లేఖ

జగన్ రాజీనామా పూర్తి  లేఖ  (క్లిక్ హియర్)
 

వాళ్లను చూస్తే అసూయ కలిగింది

వాళ్లను చూస్తే అసూయ కలిగింది
 పస్తుతం దక్షిణాదిన అత్యధిక చిత్రాల్లో నటిస్తున్న నాయిక అనుష్క. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతున్నారామె. ఓ వైపు సినిమాలు, మరో వైపు సేవాకార్యక్రమాలు..! ఇదీ అనుష్క లైఫ్ స్టైల్. ఈ విషయంలో మీకు స్ఫూర్తి ఎవరు..? అని అనుష్కను అడిగితే మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తీ నాకు స్ఫూర్తిప్రదాతే అని సమాధానమిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘దేవుడు ఇంద్రధనుస్సులాంటి జీవితం ఇచ్చాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ దొరకని లైఫ్ ఇది. అలా దేవుడిచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే... మనంత స్వార్థపరులు ప్రపంచంలో మరొకరు ఉండరని నా అభిప్రాయం. ఈ అభిప్రాయం నాకు కలగడానికి ఓ బలమైన కారణమే ఉంది. ఈ మధ్య ఓ వికలాంగుల పాఠశాలకు వెళ్లాను. అక్కడ పిల్లల్ని చూస్తే బాధ అనిపించింది. కానీ ఆ బాధ కాసేపే. కొంతసేపు వాళ్లతో గడిపిన తర్వాత వాళ్లను చూస్తే ఈర్ష్య కలిగింది. వాళ్లందరూ మాకంటే చాలా ఆనందంగా ఉన్నారన్న విషయం వారితో కాసేపు గడిపాక కానీ అర్థంకాలేదు. దేవుడు ఒకటి తీసుకుంటే... అంతకు పదంతలు శక్తిని ఇస్తాడని చిన్నప్పుడు అమ్మ చెప్పేది. వాళ్లను చూసిన తర్వాత అది నిజం అనిపించింది. ఆ క్షణమే వారికోసం ఏదైనా చేయాలన్న భావన మొదలైంది. అందుకే... సినిమాలతో పాటు... అలాంటి వారి సేవ కూడా నా జీవితంలో ఓ భాగంలా చేసుకున్నాను’’ అని చెప్పారు అనుష్క.

స్నేహ నడుముపై గిల్లిన ఆకతాయి

స్నేహ నడుముపై గిల్లిన ఆకతాయి


అందాల తారామణులు బయటకు వస్తే కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇటువంటి ఇబ్బందే స్నేహకు గురువారం ఎదురైంది. తమిళనాడులోని ఈరోడ్ పెరుందురై ప్రాంతంలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది అందాల తార స్నేహ. కార్యక్రమం జరుగుతుండగా అమ్మడిని చూసేందుకు అభిమానులు తోసుకుంటూ ఎగబడ్డారు. సందట్లో సడేమియా అన్నట్లు ఓ ఆకతాయి స్నేహ నడుముపై ఉన్న మెత్తటి శరీరాన్ని గిల్లాడు. దీంతో చిర్రెత్తిన స్నేహ సివంగిలా మారింది. సదరు ఆకతాయి చేయిపట్టుకుని ఏం ఒళ్లెలా ఉంది..? అంటూ ఎగెరెగిరిపడింది. అయితే కేవలం నడుము గిల్లిన అతడికి స్నేహ తన చేయి పట్టుకోవడంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుతో తలదించుకున్నాడు. స్నేహ మాత్రం అతడు కనబడినంత వరకూ తిడుతూనే వెళ్లింది

Friday, November 26, 2010

కుర్రాళ్లతో క్రేజీ భామ

కుర్రాళ్లతో క్రేజీ భామ
ఏమాయ చేసావె’ చిత్రంలో హోమ్లీ లుక్‌తో కనిపించి కురక్రారు మనసంతా దోచుకున్న సమంత ఇటీవల విడుదలైన ‘బృందావనం’లో హాట్ హాట్‌గా కనిపించి యువతకు మరింత దగ్గరయ్యారు. ఈ రెండు చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు సమంత. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే సమంత నటించిన తమిళ చిత్రం ‘బానా కాత్తాడి’ని తెలుగులోకి ‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు’ పేరుతో అనువదిస్తున్నారు నిర్మాత శ్రీనివాస్ దామెర.‘హృదయం’ ఫేం మురళి తనయుడు అధర్వ ఈ చిత్రంలో కథానాయకుడు. బద్రి వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘‘యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాలవారు మెచ్చే అంశాలున్నాయి. పరిస్థితులు ప్రేమికుల మధ్య అపార్థాలకు కారణం అయినా స్వచ్ఛమైన ప్రేమకు ఓటమి వుండదు అనేది ఈ చిత్రం ఇతివృత్తం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: వెన్నెలకంటి.

700 ప్రింట్లు... 1000 థియేటర్లలో 'ఆరెంజ్'

700 ప్రింట్లు... 1000 థియేటర్లలో 'ఆరెంజ్'

 రామ్‌చరణ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె.నాగేంద్రబాబు నిర్మించిన 'ఆరెంజ్' చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. 700 ప్రింట్లు, 1000 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత చెప్పారు.జెనీలియా, షాజన్ పదంసీ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ లవర్‌బోయ్‌గా, న్యూలుక్‌తో కనిపించి అభిమానులను అలరిస్తారని ఆయన తెలిపారు. 

Thursday, November 25, 2010

Yana Gupta attends charity event without underwear (PHOTO, VIDEO)

అండర్‌వేర్ లేకుండా దర్శనమిచ్చిన యానా గుప్తా

అండర్‌వేర్ లేకుండా దర్శనమిచ్చిన యానా గుప్తా 
ఐటమ్ గాళ్ యానా గుప్తా మరో సంచలనం సృష్టించింది. ఇటీవల ఆ ఛారిటీ ఈవెంట్‌కు హాజరైన యానా తొడలు కనబడే వరకు నల్లటి దుస్తులను ధరించి వచ్చింది. ఈవెంట్‌లో పాల్గనేందుకు వచ్చిన ఆమె అక్కడ ఓ కుర్చీలో ఆశీనురాలైంది. దీంతో నల్లగౌను కాస్తా తొడలను దాటి మరింత పైపైకి వెళ్లిపోయింది. అంతే..! కెమేరాలన్నీ ఆమె వ్యక్తిగత భాగంపై టపటపలాడటం మొదలుపెట్టాయి. ఈ విషయాన్ని గమనించిన యానాగుప్తా తను ప్యాంటీ ధరించలేదనీ, ఫోటోలు తీయవద్దని చెప్పినట్లు భోగట్టా. అయినా వినని కెమేరాలు అన్ని కోణాల్లో తీసేందుకు తెగ ఎగబడ్డాయట. వాటి ధాటిని తట్టుకోలేని యానా కాళ్లను క్రాస్‌గా పెట్టి ఆ భాగాన్ని కనబడకుండా చేద్దామని చూసినా ఆ ప్రయత్నాన్ని సైతం కెమేరాలు బంధించాయట. అండర్‌వేర్ లేకుండా రావడం ఎందుకూ...? అలా కాళ్లను అటూ ఇటూ తిప్పుతూ ఆ భాగాలను దాచిపెట్టే ప్రయత్నం చేయడం ఎందుకూ...? అని అక్కడ కొందరు యానాపై మండిపడ్డారట. అంతేకాదు ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినప్పుడు కనీసం లోదుస్తులతో రావాలన్న ఇంగితం కూడా లేదా అని మరికొందరు యానాకు బుద్ధి చెప్పారట.

బాబాల బాగోతం

బాబాల బాగోతం
 
భక్తుల బలహీనతలను సొమ్ముచేసుకునే దొంగ బాబాల చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘బాబాల బాగోతం’. పి.సి.రెడ్డి దర్శకత్వంలో సందె దేవదానం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది సందేశాత్మక చిత్రం. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా సినిమా ఉంటుంది.
షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జనవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. భరత్‌బాబు, ఐశ్వర్య, డా.శివప్రసాద్, సత్యప్రకాష్, అశోక్‌కుమార్, ఆనంద్‌రాజ్, ప్రత్యేకపాత్రలో పి.సత్యారెడ్డి, రమ్యశ్రీ, శ్వేత, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డాక్టర్ శ్రీకాంత్, కెమెరా: కొంకణాల శ్రీనివాసరెడ్డి, నిర్మాణం: దేవశ్రీ ప్రొడక్షన్స్.