వైఎస్ జగన్‌పై సినిమా నిజజీవితాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకునే రాంగోపాల్ వర్మ మదిలో మరో కొత్త ఆలోచన పుట్టుక వచ్చినట్లు భోగట్టా. అదేమిటంటే... వైఎస్ జగన్ జీవితంపై సినిమా తీయాలనుకోవడం. వైఎస్సార్ మరణానికి ముందు, ఆ తర్వాత వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఎలా సాగిందన్న దానిపై వర్మ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే "వైఎస్ జగన్ రాజకీయం" అనే పేరుతో వర్మ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు భోగట్టా. ఇకపోతే ఇప్పటికే ప్రకటించిన బెజవాడ రౌడీలు చిత్రం స్క్రిప్టుపై వర్మ ప్రత్యేక దృష్టిలో పెట్టారు. ఈ చిత్రంలో టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నటిస్తారని సమాచారం. |
Tuesday, December 7, 2010
వైఎస్ జగన్‌పై సినిమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment