అందుకు అభ్యంతరం లేదు
'లీడర్'లో మెరిసిన తార రిచా గంగోపాధ్యాయ. ఈ భామ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి... వారం రోజుల తేడాలో! 'నాగవల్లి', 'మిరపకాయ్' చిత్రాల్లో రిచా కథానాయిక. ''నా జీవితంలో ఈ డిసెంబరు నెలని మర్చిపోలేను. వారం రోజుల వ్యవధిలో రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. 'నాగవల్లి' విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆత్రుత పెరిగిపోతోంది. 'మిరపకాయ్'లోనూ నా పాత్ర అందరికీ నచ్చుతుంది'' అని ధీమాగా చెబుతోంది. విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ రిచా నాయిక స్థానాన్ని వేరొకరితో పంచుకొంది. 'మిరపకాయ్'లో రిచాకు పోటీగా దీక్షాసేథ్ ఉంది. 'నాగవల్లి'లో అయితే ఏకంగా ఐదుగురు నాయికలు. వీరిలో ప్రధాన పాత్ర ఎవరికి దక్కింది అనే విషయం దాచిపెట్టారు. ''నాయిక స్థానాన్ని వేరొకరితో పంచుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. అనుష్క లాంటి నటితో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే'' అని చెబుతోంది రిచా.
No comments:
Post a Comment