నన్నెవరూ ఆపలేరు!
అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ రూపొందించిన తొలి చిత్రం 'ధోబీ ఘాట్'. ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రచార కార్యక్రమంలో అమీర్‌ను పక్కనపెట్టారు కిరణ్. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అమీర్ ప్రచారానికి వస్తే... గుర్తింపు మొత్తం ఆయన ఖాతాలోకి వెళ్లిపోతుందని దర్శకురాలు భావించిందట. అందుకే ఆయన్ను రావద్దని కోరింది. కానీ అమీర్ వూరుకుంటారా..? ఈ సినిమాలో ఆయన నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు. అందుకే ఆయన చెబుతూ ''నన్నెవరూ 'ధోబీ ఘాట్' ప్రచారంలో పాల్గొనకుండా ఆపలేరు. ఈ సినిమాలో నటించడం నాకు గర్వంగా ఉంది. 'ధోబీ ఘాట్' నిర్మాతగా.. ఇందులో నటించిన వ్యక్తిగా తొలి నుంచీ సినిమా పూర్తయ్యే వరకూ నా ప్రమేయం తప్పకుండా ఉంటుంద''న్నారు. సమాజంలోని నాలుగు వర్గాల నుంచి వచ్చిన నలుగురు వ్యక్తుల చుట్టూ కథ తిరుగుతుంది. వీరందరూ ఎలా కలుసుకున్నారు..? కథ ఎలాంటి మలుపులు తిరిగింది..? అన్నది తెరమీద చూడాల్సిందే. వచ్చే నెల 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment