Thursday, December 2, 2010

'మిస్టర్ పర్ఫెక్ట్'

 'మిస్టర్ పర్ఫెక్ట్'

 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రానికి 'మిస్టర్ పర్ఫెక్ట్' అనే పేరును ఖరారు చేశారు. దశరథ్.కె. దర్శకుడు. నిర్మాత దిల్‌రాజు చిత్ర విశేషాలను చెబుతూ " ఈ ఏడాది మా సంస్థ నుంచి 'రామ రామ కృష్ణ కృష్ణ', 'బృందావనం' విడుదలయ్యాయి.ఒకటి అబవ్ యావరేజ్, మరోటి సక్సెస్ సినిమాగా నిలిచి సంతృప్తిని మిగిల్చాయి. మా సంస్థ నిర్మిస్తున్న 12వ చిత్రానికి ప్రభాస్ కథానాయకుడు. ఈ సినిమాకు 'మిస్టర్ పర్ఫెక్ట్' అనే పేరును ఖరారు చేశాం. ఈ టైటిల్‌ను మాకిచ్చిన మహేష్‌బాబు, సురేందర్‌రెడ్డి, ఆర్.ఆర్.మూవీ వెంకట్‌కు కృతజ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 15తో పూర్తవుతుంది.సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో పాటల్ని కూడా విడుదల చేస్తాం. ఎక్కడో చర్చల్లో వచ్చిన పాయింట్ ఆధారంగా రెండేళ్ళు కష్టపడి తయారు చేసిన కథ ఇది. ప్రభాస్ మీద కొత్త స్టైల్‌ను ప్రయత్నించాం. 'మిస్టర్ పర్ఫెక్ట్' అంటే ఏమిటో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫ్యామిలీ, యూత్‌కు నచ్చే అన్ని అంశాలుంటాయి.
మూడు ఫైట్లు కూడా ఉన్నాయి. 'బొమ్మరిల్లు' తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మా బ్యానర్‌లో సంగీతాన్నందించిన సినిమా ఇది'' అని అన్నారు. కాజల్, తాప్సి నాయికలు. ప్రకాష్‌రాజ్, కె.విశ్వనాథ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షిండే, రఘుబాబు, కాశీ విశ్వనాథ్, మాస్టర్ భరత్, బెనర్జీ, రాజా రవీంద్ర, సమీర్, ప్రభాస్ శ్రీను, దువ్వాసి మోహన్, కౌశల్, భగవాన్, తులసి, ప్రగతి, రజిత, సుదీప, ఉషాశ్రీ, అనితానాథ్, సంధ్యా ఝనక్, ప్రభావతి తదితరులు ఇతర పాత్రధారులు.ఈ చిత్రానికి మూలకథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే: పి.హరి, పాటలు: సిరివెన్నెల, అనంత్‌శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి, బాలాజి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: విజయ్.కె.చక్రవర్తి, కళ: రవీందర్, కూర్పు: మార్తాండ్.కె.వెంకటేష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, కథ, దర్శకత్వం: దశరథ్.కె. 

No comments:

Post a Comment