హ్యాండిచ్చి మంచి పని చేశాడు
ఇటీవల జెనీలియా ఓ ప్రైవేటు టాక్సీలో షూటింగ్‌కి అటెండ్ అయ్యారు. ప్రైవేటు టాక్సీలో దిగిన జెనీలియాను చూసి షూటింగ్‌స్పాట్‌లో ఉన్నవారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక జెన్నీని తీసుకొచ్చిన టాక్సీ డ్రైవర్ పరిస్థితి అయితే.. వర్ణించనవసరంలేదు. అందాల హాసిని తన కారులో ఆశీనురాలైంది అంటే ఆ సగటు మనిషి హృదయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవ్వకుండా ఉంటుందా...! అసలు జెన్నీకి ఇలా ప్రైవేటు టాక్సీలో రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనే విషయానికొస్తే... సమయాన్ని వృధా చేయడం అంటే జెన్నీకి ఇష్టం ఉండదు. ఒకరోజు షూటింగ్‌కి రెడీ అయ్యి.. ఇంటి లాన్‌లోకి వచ్చారామె. అక్కడ కారు లేదు, డ్రైవరూ లేడు. కాసేపు డ్రైవర్ కోసం వెయిట్ చేశారు జెన్నీ. ఎంతసేపటికీ అతను రాలేదు. అప్పుడర్థమైంది తనకు డ్రైవర్ హ్యాండిచ్చాడని. ఇక లేట్ చేయడం మంచిది కాదు అనుకున్నారు జెనీలియా.వెంటనే బయటికొచ్చి ఓ ప్రైవేటు టాక్సీని మాట్లాడుకొని షూటింగ్‌కి వచ్చేశారు. అదీ విషయం. ఆ సంగతి గురించి జెన్నీ వివరిస్తూ- ‘‘డ్రైవర్ హ్యాండిచ్చినందుకు బాధ పడటంలేదు. ఎందుకంటే... అతను హ్యాండివ్వడం వల్ల ఒకప్పటి మధురానుభూతులు మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. టాక్సీలో వెళుతున్నప్పుడు చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ట్రైన్స్‌లోనూ, రిక్షాల్లోనూ స్కూలుకి వెళ్లిన రోజులు, అమ్మతో పాటు మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చిన రోజులు... గుర్తొచ్చాయి. హీరోయిన్ అయిన తర్వాత పబ్లిక్ వెహికల్‌లో తిరగడం కుదర్లేదు. డ్రైవర్ హ్యాండివ్వడం వల్ల ఆ అవకాశం దొరికింది’’ అంటూ తనదైన శైలిలో స్మైల్ ఇచ్చారు
No comments:
Post a Comment