Thursday, December 9, 2010

అనుష్కపై కన్ను

అనుష్కపై కన్ను
 
సకల కళా వల్లభుడి కన్ను అనుష్కపై పడిందంటోంది కోలీవుడ్. అదే నిజమైతే అనుష్క పంట పండినట్లే. ఈ క్రేజీ నటి తమిళంలో విజయ్, సూర్య, శింబు, విక్రమ్, మాధవన్‌తో జత కట్టారు. టాప్ 10లో నెంబర్‌వన్ స్థాయికి చేరుకున్నారు. ఇక కమలహాసన్‌తో నటించే అవకాశం వస్తే ఆమెకంతకంటే అదృష్టం ఏముంటుంది. కాగా ప్రస్తుతం విక్రమ్ జంటగా మదరాసుపట్టణం ఫేమ్ విజయ్ దర్శకత్వంలో నటిస్తున్న అనుష్కపై కమల్ దృష్టి పడిందని సమాచారం. మన్మథన్ అంబు చిత్రాన్ని పూర్తి చేసిన కమలహాసన్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారని తెలిసింది. దీనికి తలైవన్ ఇరుకిండ్రాన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో తనకు జంటగా అనుష్కను ఎంపిక చేయాలనే అభిప్రాయంతో కమల్ ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిలింస్‌తో కలసి భారీస్థాయిలో నిర్మించడానికి ఒక ప్రముఖ హాలీవుడ్ సంస్థ ముందుకొచ్చినట్లు కోలీవుడ్ భోగట్టా.

No comments:

Post a Comment