అతనే నా వాడు
జయం’ చిత్రంతో తెలుగు సదా సినీ పరిశ్రమకు పరిచయమై దాదాపుగా పదేళ్లు దాటిపోతోంది. ఆమె సినీ కెరీర్ వయసే పదేళ్లు అయినప్పుడు ఖచ్చితంగా ఈ తారకి పెళ్ళి వయసు వచ్చిందనే సందేహం మీకు రావడం సహజం. ఖచ్చితంగా మీ అనుమానం కరెక్టే. ఎందుకంటే ఈ అందాల భామ కూడా ఇప్పుడు అదే ఆలోచనలో వున్నారు. ఎలాగూ సినీ రంగంలో అనుకున్నంత గుర్తింపు రాలేదు. అందుకే తొందరలోనే తాళి కట్టించుకోవాలని సదా తహతహలాడుతున్నారు. ‘జయం’ లాంటి విజయం తర్వాత కొంతకాలం క్రేజీ హీరోయిన్‌గా భాసిల్లిన ఈ తార సంచలన దర్శకుడు శంకర్ రూపొందించిన ‘అపరిచితుడు’ చిత్రంలో కూడా నాయికగా నటించే అవకాశాన్ని పొందారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించినా కూడా ఎందుకో నటిగా ఎదగలేకపోయారు సదా. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాలేవీ సెట్స్ మీద లేవు. అందుకే త్వరగా పెళ్ళి చేసుకోవాలనే యోచనలో వున్నారు కాబోలు ఈ తార. ఈ సందర్భంలో సదాను మిమ్మల్ని కట్టుకునే వాడు ఎలా వుండాలి అని ప్రశ్నించగా ‘‘హృతిక్‌రోషన్ అంత అందగాడు అయ్యుండి, షారుక్‌ఖాన్‌కు వున్నంత సెన్సాఫ్ హ్యుమర్ కలిగి వుండి, హాలీవుడ్ కథానాయకుడు ట్రామ్ క్రూజర్‌లా సెక్సప్పీల్ కన్పడాలి ’’ అని సెలవిచ్చారామె. అంటే ముగ్గురిలో వున్న ఆ లక్షణాలు ఒకే వ్యక్తిలో కలగలిపితే అతను సదా కలల రాకుమారుడు అన్నమాట. ఆ కుర్రాడు మరి ఆమెకు ఎప్పుడు దొరుకుతాడో వేచి చూడాలి.
No comments:
Post a Comment