Friday, December 24, 2010

ఆమె వెనుక ఎవరో ఉన్నారు

ఆమె వెనుక ఎవరో ఉన్నారు


చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం’ అన్నట్లుగా వుంది ప్రస్తుతం నయనతార పరిస్థితి. ఇన్నాళ్లు ప్రభుదేవాతో ప్రేమాయణం కొనసాగించి ఇప్పుడేమో.. ఆయనతో లవ్‌ఎఫైర్ కారణంగానే కెరీర్‌ను నష్టపోయనంటూ తన అక్కసు వెల్లగక్కుతున్నారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో నయన తన మనసులోని బాధను బయటపెట్టారు. ప్రభుతో ప్రేమ, పెళ్ళి అన్నీ సాఫీగా సాగిపోతాయనుకుంటే ఆ వ్యవహరం కాస్తా వివాదస్పదమై పోయిందని, ఇదంతా ప్రభుదేవా వల్లే జరిగిందని నయనతార చెప్పుకొచ్చారు. అయితే వెంటనే తనకు తానే సర్దిచెప్పుకుంటూ ఇందులో ప్రభుదేవా తప్పు వుందని తాను అనుకోవడం లేదనీ. రాజీకి ఒప్పుకున్న ప్రభుదేవా భార్య, చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించిందనీ ,ఆమె వెనుక ఎవరో వుండి వ్యవహారాన్ని రాద్దాంత చేశారని చెప్పారు ఆ ఇంటర్వ్యూలో నయనతార. ఇదిలా వుంటే ప్రభుదేవా మాత్రం వీటినేమీ పట్టించుకోకుండా ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లలో డైరక్షన్ అవకాశాల కోసం పచార్లు చేస్తున్నాడని సమాచారం. తన వద్ద చాలా కథలు వున్నాయనీ చెబుతూ, ఆ సినిమాలో హీరోయిన్‌గా నయనతార పేరును ప్రపోజ్ చేస్తున్నాడట ప్రభు. ఈ ప్రపోజల్ నచ్చని నిర్మాతలు తర్వాత చూద్దాంలే అని మోహం చాటేస్తుండగా, ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నాడట. సో.. మొత్తం మీద తన వల్ల కెరీర్ నష్టపోయిన నయనతార కెరీర్‌కు మళ్లీ పూర్వవైభవం సంతరించు కునేలా ప్రభుదేవా ప్రయత్నిస్తున్నాడు. అయితే నయన మాత్రం తన క్రేజ్‌తోనే అవకాశాలను తెచ్చుకోవాలనే ఆలోచనలో వున్నారట. ఆమె ప్రస్తుతం తెలుగులో శ్రీరామరాజ్యం చిత్రంలో బాలకృష్ణ సరసన సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment