అసిన్, త్రిషలా కాకూడదని...
దక్షిణాది కథానాయికల్లో ఎవరినైనా బాలీవుడ్‌లో నటించే అవకాశం వరించిందటే ఎగిరి గంతేసి ఆ చిత్రాన్ని ఒప్పుకుంటారు. నేటి కథానాయికల్లో చాలా మంది బాలీవుడ్‌లో తమకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ‘బర్ఫీ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన గోవా సుందరి ఆ చిత్రంలో రెండో కథానాయికగా నటిస్తున్నారు. హిందీ చిత్రసీమలోకి ప్రవేశించాలని కలలు కనే వారి జాబితా నుంచి అందాల భామ అనుష్కకు మినహాయింపు ఇవ్వొచ్చు. ఇటీవలే ఓ క్రేజీ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయ్యే అవకాశం వచ్చినా ఈ తార సున్నితంగా ఆ ఆఫర్‌ని తిరస్కరించారు. సూర్య, అనుష్క తమిళంలో నటించిన ‘సింగం’ (తెలుగులో యముడు పేరుతో అనువదించారు) చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు రోహిత్‌శెట్టి హిందీలో కూడా అనుష్కనే కథానాయికగా నటించమని రిక్వెస్ట్ చేశాడట. కానీ ప్రస్తుతం తను తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా బిజీగా వుండటంతో దక్షిణాది సినీ పరిశ్రమతో తనకు చాలా కంఫర్టబుల్‌గా వుందని, ప్రస్తుతం తనకు బాలీవుడ్‌లో ప్రవేశించే ఆలోచన లేదని చెప్పారట అనుష్క. అయితే తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా భాసిల్లుతున్న తను బాలీవుడ్‌లోకి ప్రవేశించి అసిన్, త్రిష తరహాలో ఫెయిల్యూర్స్ చవి చూడటం ఇష్టం లేకనే ఆమె బాలీవుడ్‌లోకి ప్రవేశించడం లేదని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment