Tuesday, December 7, 2010

సీన్ రివర్స్ అయ్యింది!

 సీన్ రివర్స్ అయ్యింది!


సినీ పరిశ్రమలో కథానాయికల మధ్య పోటీ అనేది సర్వసాధారణం. ఆ పోటీ కాస్త ముదిరితే కథానాయికల మధ్య కోల్డ్‌వార్‌కు దారి తీస్తుంటుంది. అలాంటి వాతావరణమే నయనతార, త్రిషల మధ్య వుందని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తుంటాయి. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఇరువురి సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ఈ తారల కోల్డ్‌వార్‌కు మరింత ఆజ్యం పోసే విధంగా ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. వివరాల్లోకి వెళితే... ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో ‘సావిత్రి’ పేరుతో త్వరలో ఓ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది. మొదట్లో ఈ చిత్రంలో దర్శకుడు త్రిషను నాయికగా ఎంపిక చేశారు. కాగా ఇప్పుడు త్రిష స్థానంలో నయనతార పేరును పరిశీలిస్తున్నారని తెలిసింది. గతంలో నయనతార ‘లక్ష్మీ, తులసి’ చిత్రాల్లో వెంకటేష్‌తో జత కట్టారు. అయితే ప్రభుదేవాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న నయనతార గత కొద్ది కాలంగా సినిమాలు అంగీకరించడం లేదు.కానీ ఇప్పుడు ఆమె వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకే బాలకృష్ణతో కలిసి ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ చిత్రంలో ఆమె సీత పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా నయనతార. అయితే తను చేయాలనుకున్న పాత్రపై నయన దృష్టి పెట్టడం త్రిషకు అస్సలు మింగుడుపడటం లేదట. గతంలో తమిళంలో నయనతార చేయవలసిన కొన్ని పాత్రలను త్రిష చేజిక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ‘సావిత్రి’లో కనుక నయనతార కమిట్ అయితే సీన్ రివర్స్ అయ్యిందని చెప్పొచ్చు.

No comments:

Post a Comment