ఊహించని షాక్
స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేం ఫ్రీదా పింటోకి ఇటీవల ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఓ స్వచ్ఛంద సంస్థ మురికివాడల కోసం చేస్తున్న సత్కార్యాల్లో ఫ్రీదా పింటో పాలుపంచుకున్నారు. దీనికోసం ముంబయ్‌లో ఉన్న పలు మురికివాడలకు వెళ్లారు ఫ్రీదా. అయితే అక్కడున్నవారెవ్వరూ ఈవిడగార్ని గుర్తుపట్టలేదట. ‘స్లమ్‌డాగ్...’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాననే ఆనందాన్ని పలు సందర్భాల్లో ఫ్రీదా వ్యక్తపరిచారు. మురికివాడల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. కానీ ఆ వాడలకు చెందినవాళ్లు గుర్తుపట్టకపోవడం ఫ్రీదాను ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఆమె ఆవేదన పడలేదు... ఈ విషయాన్ని ఫ్రీదా చాలా లైట్‌గా తీసుకున్నారు.
No comments:
Post a Comment