ఆ తృప్తి చాలు!
2010లో బాలీవుడ్ గడప తొక్కింది ప్రియమణి. మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ... వీళ్ల సినిమాల్లో చేస్తున్నాను... అని తెగ మురిసిపోయింది. కానీ కాలం కలిసిరాలేదు. 'రావణ్'లోనూ, 'రక్తచరిత్ర - 2'లోనూ చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలే దక్కాయి. ఆ రెండు సినిమాలూ బాక్సాఫీసును ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. అయినా ప్రియమణి ఏ మాత్రం బెంగపడటం లేదు. ఇవి నా తొలి అడుగులే... ప్రయాణం ఇంకా ఉంది అని ధీమాగా చెబుతోంది. ''ఓ సినిమా ఒప్పుకొన్నప్పుడు నా పాత్ర చిన్నదా? పెద్దదా? అందులో ఎన్ని సన్నివేశాలుంటాయి? ఇవేమీ ఆలోచించను. 'రావణ్' సినిమా ఒప్పుకొంటున్నప్పుడూ అంతే. మణిరత్నం అనే పేరు తప్ప నాకు ఏమీ కనిపించలేదు. 'రక్తచరిత్ర'లో నా పాత్ర నిడివి తక్కువే. కానీ మంచి నటన ప్రదర్శించే అవకాశం దక్కింది. ఆ తృప్తి చాలు. నేనేదో హిందీ సినిమా చేస్తున్నాను... అనే భావన ఎప్పుడూ కలగలేదు. చేసిన రెండు సినిమాల్లోనూ ఎక్కువగా దక్షిణాదికి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులే పనిచేశారు. ఫలితం సంగతి అటుంచితే ఈ రెండు సినిమాల వల్ల నాకు రావలసిన గుర్తింపే వచ్చింది'' అని చెప్పింది ప్రియమణి.
No comments:
Post a Comment