పవన్‌కల్యాణ్ దర్శకత్వం
ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్ మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నారా? అవుననే అంటున్నాయి తెలుగు సినీవర్గాలు. ఆయన ఈసారి స్టార్ట్, కెమెరా, యాక్షన్... అని చెప్పేది కెమెరా వెనక నుంచి కాదు. ముందు నుంచి! ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమాలో పవన్‌కల్యాణ్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన దర్శకుడిగా కనిపించబోతున్నారు. ఆంగ్లంతోపాటు, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ పాత్రను గోప్యంగా ఉంచారు. ఇందులో ఆయన సినీ దర్శకుడి పాత్రను పోషిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన చిత్రాలు రూపొందించిన యువ దర్శకుడి పాత్ర అది. ఈ చిత్రంలో బాలనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రీస్తు కాలంతో పాటు, సమకాలీన అంశాలను కథలో మేళవించి తెరకెక్కిస్తున్నారు. రచయిత జె.కె.భారవి, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, పవన్‌కల్యాణ్ మధ్య ఇటీవల కథామేళవింపుపై చర్చలు జరిగాయి. ఇందులో చురుగ్గా పాల్గొన్న పవన్... తన పాత్రపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిసింది. ఇందులో ఆయన సరసన ఓ ప్రముఖ కథానాయిక నటిస్తుంది. ఇటలీ, మొరాకో, ఇజ్రాయెల్‌ల్లో చిత్రీకరణ జరుపుతారు. హాలీవుడ్‌కు చెందిన ప్రొడక్షన్ డిజైనర్ స్టీఫెన్ ఎమ్.ఆర్టలానీ, మేకప్ నిపుణుడు క్రిస్టినా టిన్స్‌లే ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూరుస్తారు. నిర్మాత: కొండా కృష్ణంరాజు.
No comments:
Post a Comment