Thursday, September 30, 2010

3 వ సంవత్సరం కూడా ముకేష్ అంబానీ యే ఫస్ట్

3 వ సంవత్సరం కూడా ముకేష్ అంబానీ యే ఫస్ట్ 


ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితాలో ఈ సంవత్సరం కూడా ముకేష్ అంబానీ యే ప్రదమ స్తానం లో నిలిచారు. ఈ జాబితాలో 100 మంది ధనవంతుల ఆస్తి మొత్తం 300 బిలియన్ డాలర్లు. ఈ జాబితాలో ముకేష్ అంబానీ 27 బిలియన్ డాలార్స్ తో ప్రదమ స్తానంలో నిలిచారు. స్టీల్ దిగ్గజం లక్ష్మి మిట్టల్ 26.1 బిలియన్ డాలర్స్ తో రెండవ స్తానం లో నిలిచారు. మూడవ స్తానం లో అజీజ్ ప్రేమ్ జీ నిలిచారు.

ఇండియా లో 10 మంది ధనవంతుల జాబితా 

1 . ముకేష్ అంబానీ US $ 27 బిలియన్ 
2 . లక్ష్మి మిట్టల్ US $ 26 బిలియన్
3 . అజీం ప్రేమ్ జీ US $ 17.6 బిలియన్
4 . శశి అండ్ రవి రుయా  US $ 15 బిలియన్
5 . సావిత్రి జిందాల్ US $ 14.4 బిలియన్
6 . అనిల్ అంబానీ US $ 13.3 బిలియన్
7 . గౌతం అదాని US $ 10.7 బిలియన్
8 . కుశాల్ పాల్ సింగ్ US $ 9.2  బిలియన్ 
9 . సునీల్ మిట్టల్ US $ 8.6 బిలియన్
10 . కుమార్ బిర్లా US $ 8.5 బిలియన్

Wednesday, September 29, 2010

పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు

పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు
బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రాకు ఇటీవల ఓ కొత్త అనుభవం ఎదురైందట. దేశంకాని దేశంలో, ఏ మాత్రం పరిచయంలేని ఓ కొత్త వ్యక్తి నుంచి ఆ అనుభవం ఎదురవ్వడం జరిగిందట. ఒక రియాలిటీ షోలో పాల్గొనే నిమిత్తం బ్రెజిల్ వెళ్ళిన ప్రియాంక  ఆ షోలో పాల్గొని తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి ఆమె వెంట పడ్డాడట. ‘‘మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’’ అని ఆ అపరిచిత వ్యక్తి ప్రియాంకను కోరారట. అలా అడిగిన వ్యక్తి ఒక సామాన్యుడు కాదు. మంచి బిజినెస్ మాగ్నెట్ కావడం విశేషం. 

కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు

కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు
 
 
ప్రస్తుతం చాలామంది కురక్రారుకి కలల దేవత సమంత. ఒక్క సినిమాతోనే కురక్రారు మతి పోగొట్టి.. తన మాయలో పడేశారామె. తొలి సినిమా ‘ఏమాయె చేసావె’లో కావ్య నాయికలా అలరించిన సమంత.. మలిచిత్రం ‘బృందావనం’లో మోడరన్ గోపికలా కనిపించనున్నారు. ఆ చిత్రం కోసం ఆమె అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే.. ‘హృదయం’ఫేం మురళి తనయుడు ఆదర్శ్ సరసన తమిళంలో సమంత నటించిన ‘బానా కత్తాడి’ చిత్రం... తెలుగులో ‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్లు’ పేరుతో విడుదల కానుంది.
 

మోసం చేసినందుకే పండును హత్య చేశా

మోసం చేసినందుకే పండును హత్య చేశా


విశాఖలోని స్థల వివాదంలోతనను మోసం చేసినందుకే చలసాని పండును హత్య చేసినట్లు మహేందర్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణ హత్యకు గురైన చలసాని పండు హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న మహేందర్‌రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో అతన్ని మీడియా ముందు హాజరు పరచనున్నారు.

రజిని మేకప్ కోసం రూ.3 కోట్లు

రజిని మేకప్ కోసం రూ.3 కోట్లు 


రజినీకాంత్ కథానాయకుడిగా శంకర్ సృష్టించిన సినిమా "రోబో". ఈ సినిమాలో రజిని మేకప్ కోసం 3 కోట్ల రూపాయలు కర్చుచేసారట.విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కి అయిన ఖర్చు 60 కోట్లట. సిని నిర్మాణ వ్యయం లోనే కాకుండా ఎంచుకున్న కథ లోను అనూహ్య మలుపులు ఉన్నాయట.

రేపే అయోధ్య తీర్పు

రేపే అయోధ్య తీర్పు 


అరవై ఏళ్లుగా న్యాయ స్థానాలలో నలుగుతున్న రామ జన్మభూమి-బాబ్రీ మాసేదు స్థల వివాదం ఫై అలహాబాద్ హై కోర్ట్ లుక్నో బెంచ్ గురువారం తీర్పు ఇవ్వనుంది.ఈ స్థలానికి చట్ట బద్ద యజమాని ఎవరో తేల్చి చెప్పనుంది.

Tuesday, September 28, 2010

అయోధ్య తీర్పు వాయీదా ఫై స్టే ఎత్తేసిన సుప్రీం కోర్ట్

అయోధ్య తీర్పు వాయీదా ఫై స్టే ఎత్తేసిన సుప్రీం కోర్ట్ 


అయోధ్య భూవివాదం ఫై అలహాబాద్ హై కోర్ట్ లుక్నో బెంచ్ తీర్పు ఫై ఉన్న స్టే ను సుప్రీం కోర్ట్ ఎత్తివేసింది. ప్రధాన న్యాయమూర్తి కపాడియా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.  

బెజవాడ రౌడీయిజంపై వర్మ సినిమా

 బెజవాడ రౌడీయిజంపై వర్మ సినిమా


ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. వర్మ త్వరలో బెజవాడ రౌడీయిజం కథాంశంగా ‘బెజవాడ రౌడీలు’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్న వర్మ వచ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభించనున్నాడు.

Monday, September 27, 2010

ముంబై వీధుల్లోపియాంక డాన్స్




వెండితెరపై చిట్టిపొట్టి దుస్తులు వేసుకుని కురక్రారు హృదయాలను కొల్లగొట్టే ప్రియాంక చోప్రా ఇటీవల రోడ్డు మీదికొచ్చి ముంబైవాసులను ఆశ్చర్యపరిచారు. గణేశుని నిమజ్జనం రోజున ‘గణపతి బప్పా మోరియా..’ అంటూ నినాదాలు చేస్తూ ప్రియాంక వీధుల్లో నర్తించారు. బాలీవుడ్‌లో పెద్ద కుటుంబం అయిన ‘కపూర్’ ఇంటి వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో ప్రియాంక పాల్గొన్నారు. వినాయకుడిని భారీ ఎత్తున ఊరేగిస్తూ, తీన్ మార్ డాన్స్‌ల మధ్య నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఈ వేడుకలో రణబీర్ కపూర్, కరీనా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ తదితర కపూర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రణబీర్ కపూర్ సరసన ప్రియాంక ‘అంజానా అంజానీ’ చిత్రంలో నటించారు. అప్పట్నుంచి ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

చలసాని పండు పోస్ట్ మార్టం పూర్తి

చలసాని పండు పోస్ట్ మార్టం పూర్తి 


గత రాత్రి యూసఫ్ గూడ లోని తన ఇంట్లో హత్యకు గురైన టీ డి పీ నేత చలసాని వెంకటేశ్వర రావు మృతదేహానికి ఈ రోజు     మద్య హ్నం  గాంధీ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం మృత దేహాన్ని విజయవాడ తరలించారు.

Friday, September 24, 2010

కామన్వెల్త్ గేమ్స్ కోసం లంచం ఇచ్చిన భారత్

కామన్వెల్త్ గేమ్స్ కోసం లంచం ఇచ్చిన భారత్

కామన్వెల్త్ కోసం భారత్ దేశం 72 దేశాలకు లక్ష డాలర్స్ చొప్పున లంచం ఇచ్చినట్లు డైలీ గ్రాప్ పత్రిక పేర్కొంది.

Thursday, September 23, 2010

అయోధ్య తీర్పు ఫై వారం రోజుల పాటు సుప్రేం స్టే

అయోధ్య తీర్పు ఫై వారం రోజుల పాటు సుప్రేం స్టే
వివాదాస్పద అయోధ్య ఫై అలహాబాద్ హైకోర్ట్ తీర్పును వారం రోజుల పాటు సుప్రేంకోర్ట్ స్టే విదించింది.

అమెరికాలో రజిని హవా


అమెరికాలో రజిని హవా

రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం "రోబో" వచ్చే నెల 1 న విడుదుల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదుల కానున్న ఈచిత్రం అమెరికాలో హవా సృష్టిస్తుంది. ముందస్తుగా టికెట్ల అమ్మకాన్ని ప్రారంబించారు. మొదలైన పది నిమిషాలలోనేటికెట్లన్నీ అమ్ముడైనాయ్.

వచ్చే నెల 8 న బృందావనం



ఎన్.టీ.ఆర్, కాజల్, సమంతా హీరో, హీరొయిన్ లుగా నటిస్తున్న చిత్రం బృందావనం. వచ్చే నెల 8 విడుదుల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో దిల్ రాజు విషయాన్ని ప్రకటించారు. వంశీ పైడపల్లి దర్సకత్వం వహించారు.

ఓ రేంజ్ లవ్ స్టొరీ ఆరెంజ్



ఆరెంజ్ రేంజ్ లవ్ స్టొరీ అంటున్నారు రామ్ చెరణ్. ఆయన జెనీలియా జంటగా నటిస్తున్న చిత్రం. దాదాపు పూర్తికావచ్చిన చిత్రం నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వచ్చే నెల 6 పాటలు రిలీజ్ అని సమాచారం.

Wednesday, September 22, 2010

అదుపులో మధుమేహం

అదుపులో మధుమేహం
తాజా ఆకుకూరలు. ముక్యంపాలకురను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల టైపు 2 మదుమేహం అదుపులో ఉంటుంది. సుమారు రెండు లక్షల మంది ఫై నిర్వహించిన అధ్యయనం ప్రకారం. మనం తెసుకునే ఆహారంలో మిగిలిన కూరగాయలతో పాటు.. ఆకుకూరల శాతం ఎక్కువగా ఉండాలి. దీనివల్ల మధుమేహం వచ్చే అస్కారాని దాదాపు పద్నాలుగు శాతం తగించవచ్చు



Tuesday, September 21, 2010

ఒద్దండి నాకు పడదు!

ఒద్దండి నాకు పడదు!

మల్లిక కిరణ్

నాకు కిరణ్ కి క్రితం ఏడాది పె జరిగింది. ఇద్దరం అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తూండడం వల్ల పెళ్లికి నెల రోజులు సెలవ పెట్టిఇండియా వెళ్లాం. అసలు నెల ఎలా గడిచిందొ తెలీలేదు. పెళ్లి అలా జరిగిందనిపించి, నేను, కిరణ్ తిరిగి ప్రయాణం కట్టాం. ఏడాది గడిచింది. మళ్లీ ఇండియా వెళ్లే టైమొచ్చింది. అత్తవారిల్లు హైదరాబాదులొ ఉన్నా మావయ్యగారు, అంటే కిరణ్వాళ్ల నాన్నగారు, మమ్మల్ని అమాలాపురం రమన్నారు. “అసలు నీతొ ఉన్నటే లేదంట్టున్నారమ్మా అందరు.

అమాలాపురంలొ నా తమ్ముడుంటాడు. మా అమ్మావాళ్లు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారిప్పుడు. మీరొస్తె మనం కూడాఅక్కడకే వెళ్లి ఉందాం. సరాదాగా అందరం కలిసి ఉండొచ్చు. పైగా మీరొచ్చినప్పుడు ఉగాది కూడా ఒస్తోంది. బాగుంటుంది.” అన్నారు మావయ్యగారు.
అసలు నేనెప్పుడూ అమాలాపురం చూడలేదు. కిరణ్ చిన్నప్పుడు అక్కడే ఉన్నానని, చాలా బాగుంటుందని ఇదివరకెచెప్పడంతొ నేను సరే అన్నాను.
పెళ్లయ్యాక మొదటి సారి అత్తగారింట్లొ ఉండబోతున్నాన్న ఆలోచన నాకు ఆందోళన కలిగించింది. “అసలే అందరూ కొత్త. అక్కడ అందరికి నా ఎల్లర్జీలు అర్థం అవుతాయొ అవ్వవో”, అడిగాను కిరణ్ ని. “ఏం కాదులె. నాలుగు రోజులు ఎక్కువమాట్లాడకుండ ఎవరైనా ఏదైనా పెడితే తినేసెయ్. అది పడదు ఇది పడదు అని వాళ్లని భయపెట్టకుఅన్నాడు కిరణ్ . “హి! హి!” అని పళ్లికిలించాను. మనసులో మాత్రం, అలా ఎలా తినేస్తాను, నాకు పడదని నా అత్తగారి వాళ్లకి తెలియాలికదా ఎప్పటికైనా. కిరణ్ ఇలాగే అంటాడు. నేనే ఆలోచిస్తా ఏం చేయాలో అనుకున్నా.
24 గంటలు ఫ్లైట్ ప్రయాణం చేసాక హైదరాబాదొచ్చాం.

సోర్సు:http://teluguone.com/vinodam/?p=26864

నిమజ్జనానికి రూట్ మ్యాప్ తయారు

నిమజ్జనానికి రూట్ మ్యాప్ తయారు


గణనాదుని నిమజ్జనానికి అదికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జీ హెచ్ ఎం సీ సహా వివిధ ప్రభుత్వవిభాగాలతో సమన్వయం చేస్తూ రూట్ మ్యాప్ తయారుచేసారు. వినాయకుడు విగ్రహాలు ఉన్న లారీలను మాత్రమేహుస్సేన్ సాగరకు వెళ్ళే మార్గాలలో అనుమతిస్తారు. మొజంజాహి మార్కెట్ నుంచి వచ్చే వాహనాలను అబిడ్స్, బసీర్బాగ్ నుంచి లిబెర్టి వరకు అనుమతిస్తారు. అక్కడ నుంచి చిన్న విగ్రహాలను అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ ఫైకీఅనుమతిస్తారు. పంజాగుట్ట, మెహదిపట్నం నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్, సైఫాబాద్, ఇక్బాల్ మినార్, సచివాలయం, తెలుగుతల్లి విగ్రహం మీదుగా బుద్దపుర్నిమ, ఎన్టిఆర్ మార్గ్ కు తరలిస్తారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ వద్ద యుటర్న్ తీసుకుని మినిస్టర్ రోడ్ వైపు అనుమతిస్తారు.


ఆమె పెదవి విప్పదెం



తమ మద్య ఎఫ్ఫైర్ గురుంచి ,ప్రభుదేవా ఎంతగా మీడియా ముందుకొస్తున్నా,ప్రభుదేవాతో పెళ్లి గురుంచి నయనతారనోటివెంట ఇప్పటిదాకా ఒక్క పలుకూ రాలేదు .ఇందుకు కారణం ఏమై ఉంటుందోగాని,సౌత్ స్కోపే అవార్డ్స్ ఫంక్షన్లోనయనతారను విషయమై అడగటానికి చాలామంది పోటిపడ్డారు.అయినాసరే,ఎక్కడా ఎవరికీ నయనతార ఛాన్స్ఇవ్వలేదు.ఎంచక్కా కాబోయే భర్తతో నయనతార అవార్డ్స్ ఫంక్షన్ ని ఎంజాయ్ చేసింది.
ప్రభుదేవా ఇంకా తన తొలి బార్యకు వీడాకులు ఇవ్వలేదు గనుక, ఇప్పుడే పెదవి విప్పి, వివాదాలకేక్కడం కన్నా, కాస్తసంయమనం పాటించటమే బెటరని నయనతార బావిస్తోందిట.