నిమజ్జనానికి రూట్ మ్యాప్ తయారు
గణనాదుని నిమజ్జనానికి అదికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జీ హెచ్ ఎం సీ సహా వివిధ ప్రభుత్వవిభాగాలతో సమన్వయం చేస్తూ రూట్ మ్యాప్ తయారుచేసారు. వినాయకుడు విగ్రహాలు ఉన్న లారీలను మాత్రమేహుస్సేన్ సాగరకు వెళ్ళే మార్గాలలో అనుమతిస్తారు. మొజంజాహి మార్కెట్ నుంచి వచ్చే వాహనాలను అబిడ్స్, బసీర్బాగ్ నుంచి లిబెర్టి వరకు అనుమతిస్తారు. అక్కడ నుంచి చిన్న విగ్రహాలను అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ ఫైకీఅనుమతిస్తారు. పంజాగుట్ట, మెహదిపట్నం నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్, సైఫాబాద్, ఇక్బాల్ మినార్, సచివాలయం, తెలుగుతల్లి విగ్రహం మీదుగా బుద్దపుర్నిమ, ఎన్టిఆర్ మార్గ్ కు తరలిస్తారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలను రాణిగంజ్ వద్ద యుటర్న్ తీసుకుని మినిస్టర్ రోడ్ వైపు అనుమతిస్తారు.
No comments:
Post a Comment