Tuesday, September 21, 2010

ఒద్దండి నాకు పడదు!

ఒద్దండి నాకు పడదు!

మల్లిక కిరణ్

నాకు కిరణ్ కి క్రితం ఏడాది పె జరిగింది. ఇద్దరం అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తూండడం వల్ల పెళ్లికి నెల రోజులు సెలవ పెట్టిఇండియా వెళ్లాం. అసలు నెల ఎలా గడిచిందొ తెలీలేదు. పెళ్లి అలా జరిగిందనిపించి, నేను, కిరణ్ తిరిగి ప్రయాణం కట్టాం. ఏడాది గడిచింది. మళ్లీ ఇండియా వెళ్లే టైమొచ్చింది. అత్తవారిల్లు హైదరాబాదులొ ఉన్నా మావయ్యగారు, అంటే కిరణ్వాళ్ల నాన్నగారు, మమ్మల్ని అమాలాపురం రమన్నారు. “అసలు నీతొ ఉన్నటే లేదంట్టున్నారమ్మా అందరు.

అమాలాపురంలొ నా తమ్ముడుంటాడు. మా అమ్మావాళ్లు కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారిప్పుడు. మీరొస్తె మనం కూడాఅక్కడకే వెళ్లి ఉందాం. సరాదాగా అందరం కలిసి ఉండొచ్చు. పైగా మీరొచ్చినప్పుడు ఉగాది కూడా ఒస్తోంది. బాగుంటుంది.” అన్నారు మావయ్యగారు.
అసలు నేనెప్పుడూ అమాలాపురం చూడలేదు. కిరణ్ చిన్నప్పుడు అక్కడే ఉన్నానని, చాలా బాగుంటుందని ఇదివరకెచెప్పడంతొ నేను సరే అన్నాను.
పెళ్లయ్యాక మొదటి సారి అత్తగారింట్లొ ఉండబోతున్నాన్న ఆలోచన నాకు ఆందోళన కలిగించింది. “అసలే అందరూ కొత్త. అక్కడ అందరికి నా ఎల్లర్జీలు అర్థం అవుతాయొ అవ్వవో”, అడిగాను కిరణ్ ని. “ఏం కాదులె. నాలుగు రోజులు ఎక్కువమాట్లాడకుండ ఎవరైనా ఏదైనా పెడితే తినేసెయ్. అది పడదు ఇది పడదు అని వాళ్లని భయపెట్టకుఅన్నాడు కిరణ్ . “హి! హి!” అని పళ్లికిలించాను. మనసులో మాత్రం, అలా ఎలా తినేస్తాను, నాకు పడదని నా అత్తగారి వాళ్లకి తెలియాలికదా ఎప్పటికైనా. కిరణ్ ఇలాగే అంటాడు. నేనే ఆలోచిస్తా ఏం చేయాలో అనుకున్నా.
24 గంటలు ఫ్లైట్ ప్రయాణం చేసాక హైదరాబాదొచ్చాం.

సోర్సు:http://teluguone.com/vinodam/?p=26864

2 comments:

  1. Hi who's this can u send u r email to me.I receive a link from u.I am also webmaster.

    Give u r email.

    ReplyDelete
  2. Hi This is seetharam.ramt23@gmail.com

    ReplyDelete