Monday, January 31, 2011

ఆ వదంతులు బాధ పెట్టాయి

ఆ వదంతులు బాధ పెట్టాయి


అందాల సుందరి ఐశ్వర్య రాయ్‌పై ఇటీవలి కాలంలో ఆరోపణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్య సింగపూర్‌లో జరిగిన ఓ అవార్డ్ వేడుకలో ఐష్ ప్రవర్తనకు నిర్వాహకులు అవాక్కయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకలో ఐశ్వర్య నృత్య ప్రదర్శన ఇచ్చారు. దీనికోసం రిహార్సల్స్ జరిగినప్పుడు ఆమె చెప్పిన సమయానికి రాకుండా తనకు నచ్చిన టైమ్‌కు వచ్చేవారట. ఇది ఇతర తారలను ఇబ్బందులకు గురి చేసిందని బాలీవుడ్‌లో ఓ వార్త ప్రచారం అవుతోంది. అందాల సుందరి.. క్రేజీ హీరోయిన్.. బచ్చన్ ఇంటి కోడలు..కావడంవల్లే ఐష్ ఇలా ప్రవర్తిస్తున్నారని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు ఐశ్వర్య వరకు వెళ్లాయట. మౌనం వహిస్తే.. ఈ మాటలు నిజమవుతాయని భావించిన ఆమె మాట్లాడుతూ - ‘‘యాక్చువల్‌గా నేను వైరల్ ఫీవర్‌తో అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొనలేని స్థితిలో ఉన్నప్పటికీ నిర్వాహకులను నిరుత్సాహపరచడం ఇష్టంలేక సింగపూర్ వెళ్లాను. ఈ అవార్డ్ ఫంక్షన్ జరిగే వారం రోజుల ముందు నుంచే నాకు ఆరోగ్యం బాగాలేదు. ఈ కారణంగా రిహార్సల్స్‌కు సరిగ్గా వెళ్లలేకపోయేదాన్ని. నాకు ఉపశమనంగా అనిపించిన సమయంలో వెళ్లేదాన్ని. ఆ సమయానికి ఇతర తారల ప్రాక్టీస్ ముగిసేది. దాంతో ఎవరూ ఇబ్బందిపడలేదు. కానీ ఈ విషయాన్ని చిలవలు పలవలు చేశారు. అసలు విషయం తెలియక చాలామంది నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను డాన్స్ ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వెళ్లిన రోజున అసిస్టెంట్ డాన్సర్లను వెళ్లమనేదాన్ని. కొరియోగ్రాఫర్ నుంచి స్టెప్స్ అడిగి తెలుసుకుని మరీ చేసేదాన్ని. చివరికి అవార్డ్ ఫంక్షన్ రోజున నిర్వాహకులు రెడ్ కార్పెట్‌పై ర్యాంప్ వాక్ చేయమని కోరితే ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చేశాను. అయినా నా గురించి లేనిపోని వదంతులు సృష్టించడం బాధగా ఉంది’’ అన్నారు ఐశ్వర్యరాయ్. ఇదిలా ఉంటే అవార్డ్ ఫంక్షన్ నిర్వాహకులు కూడా ఐష్ తమని ఇబ్బందులపాలు చేయలేదని, ఆరోగ్యం బాగాలేకపోయినా ఆమె సహకరించారని, ఆమె పక్కా ప్రొఫెషనల్ అని కితాబులిచ్చేస్తున్నారు. ఐష్ అంటే పడనివాళ్లే ఇలా కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తున్నారని ఆమె శ్రేయోభిలాషులు అంటున్నారు.

బికినీలో బాగున్నాను

బికినీలో బాగున్నాను


చిత్ర పరిశ్రమలో నాయికగా నిలబడిన వాళ్లందరినీ ఓసారి గమనించండి. వాళ్లంతా అందం, అభినయం రెండిటినీ నమ్ముకొన్నవాళ్లే. ఆ రెంటినీ సమన్వయం చేసుకొంటే ఇక తిరుగులేనట్టే. ప్రియమణి కూడా ఇదే సూత్రం అనుసరిస్తోందట. 'ఇక్కడ మన స్థానాన్ని నిర్ణయించేవి మనకొచ్చే పాత్రలే. ఏ సినిమా ఫలితాన్ని ముందే అంచనా వేయలేం. అలాగే ఏ పాత్రకు మంచి పేరొస్తుందో ముందే వూహించి చెప్పడం కష్టమే. 'పెళ్త్లెన కొత్తలో' సినిమాతో గాడిలో పడతాను అని నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు అనుకోలేదు' అని చెబుతోంది ప్రియమణి. 'నువ్వు చీర కడితే బాగుంటావ్‌... అని కొంతమంది చెప్పారు. ఆధునిక వస్త్రాలు కూడా నీకు నప్పుతాయ్‌ అని మరికొంతమంది చెప్పారు. థియేటర్‌కి వచ్చేవాళ్లలో అన్ని వర్గాల ప్రేక్షకులూ ఉంటారు. వస్త్రధారణ విషయంలో వాళ్లందరి అభిరుచినీ దృష్టిలో పెట్టుకోవల్సిందే' అని కొత్త సూత్రం చెప్పింది. 'ద్రోణ' సినిమా కోసం బికినీ వేసినందుకు తనని తాను సమర్థించుకొంది. 'స్విమ్మింగ్‌ పూల్‌లో పాట తీస్తాం అన్నారు. అక్కడ జీన్స్‌, సల్వార్‌ వేసుకొంటే కుదర్దు కదా. అందుకే బికినీ వేయాల్సివచ్చింది. ఆ పాట కూడా బాగా చిత్రీకరించారు. నాకైతే నచ్చింది' అంది. 

Saturday, January 29, 2011

2 నిమిషాలపాటు లిప్ టు లిప్ కిస్సా...

2 నిమిషాలపాటు లిప్ టు లిప్ కిస్సా...
 
 
బాలీవుడ్‌లో కత్తిలాంటి ఆకృతితో సెక్సీ నాభీ నృత్యాలను చేయడంలో ఆరితేరిపోయిన కత్రినాకైఫ్ ఇపుడు మరో హాటెస్ట్ ఫీట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందట. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జిందగి న మిలేగి దుబారా" చిత్రంలో ఓ సన్నివేశం డిమాండ్ మేరకు కత్రినా హీరో హృతిక్ రోషన్ పెదవులను రెండు నిమిషాల పాటు వదలకుండా చుంబించాలట. ఈ విషయాన్ని దర్శకుడు కత్రినాతో చెప్పేసరికి.. "హృతిక్‌తోనే కదా.. ఐతే ఓకే" అనేసిందట. హృతిక్ రోషన్ మాత్రం తేనెలొలికే ఆ రెండు పెదవులను చుంబించడానికి అడ్డు చెపుతాడా ఏంటి...? కత్రినా ఓకే అయితే నేను డబుల్ ఓకే అనేశాడట. అన్నట్లు ఈ సీన్ కోసం కత్రినా తన రెండు పెదవులు మరింత సెక్సీగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటోందట. ముద్దంటే మాటలా మరి... హీటెక్కించొద్దూ. 

అలా ఇమిటేట్ చేస్తే చంపేస్తా

అలా ఇమిటేట్ చేస్తే చంపేస్తా


నా వాకింగ్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తే చంపేస్తా...’’ అంటున్నారు త్రిష. ఇంత ఘాటుగా త్రిష వార్నింగ్ ఇచ్చింది ఎవరికోకాదు. జెస్సీగా కురక్రారు హృదయాల్లో అనతికాలంలోనే స్థానం సంపాదించిన అందాల సమంతకు. ఇది సీరియస్‌గా ఇచ్చిన వార్నింగ్ కాదులెండి! అభిమానం, వాత్సల్యం కలగలుపు చేసుకొని ముద్దు ముద్దు మాటలతో ఇచ్చిన మందలింపు మాత్రమే. త్రిష, సమంత మధ్య తొలినుంచి మంచి అనుబంధం ఉంది. హీరోయిన్ కాకముందు నుంచి సమంత... త్రిష అభిమాని. అనుకోకుండా తమిళ్‌లో త్రిష చేసిన ‘జెస్సీ’ పాత్రతోనే సమంత తెలుగులో స్టార్‌డమ్ సాధించారు. సమంత తన అభిమాని అని తెలిసినప్పట్నుంచీ త్రిష కూడా సమంత విషయంలో ఇష్టం కనబరుస్తూ వచ్చారు. ఇటీవల సమంత గురించి త్రిష మాట్లాడుతూ- ‘‘తను మంచి నటి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె నటన చూస్తుంటే...నన్ను నేనే చూసుకుంటున్నట్టుంటుంది. ముఖ్యంగా తన న డక. నా వాకింగ్ స్టైల్‌ని బాగా ఇమిటేట్ చేస్తుంది తను. ‘నా వాకింగ్ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తే చంపేస్తా’ అని ఓ సారి నవ్వుతూ చెప్పాను. ఏదిఏమైనా... కొత్తగా వచ్చిన హీరోయిన్‌లలో సమంత అంటే నాకు ఇష్టం. తాను నా అభిమాని అన్న విషయం పక్కన పెడితే... ‘ఏ మాయ చేసావె’ చూశాక నేను ఆమె అభిమానిని అయిపోయాను’’ అంటూ సమంతను పొగడ్తలతో ముంచెత్తారు త్రిష.

Friday, January 28, 2011

ఆ హీరోతో కూడా చేస్తే ఓ పనైపోతుంది

ఆ హీరోతో కూడా చేస్తే ఓ పనైపోతుంది


తెలుగుతో పాటు కన్నడంలో కూడా అగ్రతారల్లో ఒకరుగా భాసిల్లుతున్నారు ప్రియమణి. ఈమె ప్రస్తుతం కన్నడంలో మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. కాగా, ఇటీవల అక్కినేని నాగార్జునతో ‘రగడ’ చిత్రంలో రొమాన్స్ చేసిన ఈ తార ఆ చిత్రంలోని ‘అష్టలక్ష్మీ’ పాత్ర తనకెంతో పేరు తెచ్చిపెట్టిందనే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదే విషయం గురించి ఆమె మాట్లాడుతూ ‘‘ నాగ్‌తో ఫుల్‌లెంగ్త్ హీరోయిన్‌గా నటించాలన్న నా కోరిక ‘రగడ’ తో తీరింది. ఆయనతో నటించడం ఎంతో కంపర్టబుల్‌గా వుంటుంది. మళ్ళీ నాగ్‌తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఒకవైపు నాగార్జునతో ‘రగడ’ చేస్తూనే మరో వైపు ఆయన మేనల్లుడు సుమంత్‌తో ‘రాజ్’ చిత్రంలో నటిస్తుంటే ఎంతో థ్రిల్లింగ్ అనిపించేది. ఒకేసారి అక్కినేని కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలతో నటించాను. ఇక బ్యాలెన్స్‌గా వున్న నాగచైతన్యతో కూడా నటిస్తే ఓ పనైపోతుంది’’ అంటూ ముసి ముసిగా నవ్వుతూ తన మనసులోని మాటను వ్యక్తపరిచారు. ప్రియమణి. మీరు ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలోనూ మరో హీరోయిన్‌తో కలిసి నటిస్తున్నారు, అప్పుడు మీ మధ్య కాంపిటీషన్ ఎలా వుంటుందన్న ప్రశ్నకు ఆమె సమధానం చెబుతూ ‘‘ ప్రతి హీరోయిన్‌తోనూ నాకు మంచి సంబంధమే వుంది. ఇక వృత్తి ధర్మ ప్రకారం పోటీ అనేది కామనే. అయితే ఈ కాంపిటిషన్ అనేది హెల్తీ వేలో వుంటుంది’’ అని చెప్పారు ప్రియమణి.
 

హద్దుల్లోనే ఉంటాను

హద్దుల్లోనే ఉంటాను


వారసత్వం ఓ గుర్తింపు మాత్రమే. నాన్న పేరునో, అమ్మ పేరునో తగిలించుకొని బండి లాగించేద్దాం అంటే కుదర్దు... జీవితం చివరి మజిలీలో 'నువ్వేంటి?' అని ప్రశ్నించుకొంటే సంతృప్తికరమైన జవాబు దొరకాలి. అది దొరక్కపోతే నువ్వేమీ సాధించలేనట్టే లెక్క... అంటోంది శ్రుతిహాసన్‌. 'అనగనగా ఓ ధీరుడు'లో ప్రియగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అందం, అభినయం రెండూ కలబోసి మెప్పించింది. 'కమల్‌ కుమార్తెగా గర్వపడతారా?' అని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది. ''మా నాన్న గొప్ప నటుడు. ఆయనకు కూతురుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. అలాగే చిన్నపాటి భయం కూడా ఉంది.. ఆయన పేరుకు మచ్చ తీసుకురాకూడదని! అందుకే చిన్న చిన్న హద్దులు నిర్ణయించుకొన్నాను. సినిమా సూత్రాలకు లోబడి గ్లామర్‌ కురిపించాలన్నా... వాటిని ఓసారి గుర్తుచేసుకొంటాను'' అంది. ''ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తున్నాయి. 'దిల్‌ తో బచ్చా హై జీ'లో పాత్ర నాకు అన్నివిధాల సరిపడింది.. సంతృప్తినిచ్చింది. నా పుట్టిన రోజునే ఆ చిత్రం విడుదలవుతోంది. తమిళంలో మురుగన్‌దాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో సూర్యకు జోడీగా కనిపిస్తాను. తెలుగు అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. అభిమానం అంటే ఏమిటో ఇక్కడివారిని చూసి నేర్చుకోవాలి. డాడీ సినిమాలకు ఇక్కడ మంచి ఆదరణ ఉంటుంది. అందుకే తెలుగులో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను. పాత్ర నచ్చితే దర్శకుడు ఎవరైనా సరే... పచ్చజెండా వూపేస్తాను'' అంది. శుక్రవారం శ్రుతి హాసన్‌ జన్మదినం.

Thursday, January 27, 2011

ఆ పద్ధతి మంచిది కాదు

ఆ పద్ధతి మంచిది కాదు


మరో అయిదారేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా’’ అంటున్నారు బొద్దు గుమ్మ నమిత. ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించే సమయం తనకు లేదని ఇటీవల ఓ సందర్భంలో అన్నారామె. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘కెరీర్ పరంగా చాలా సంతృప్తికరంగా ఉన్నాను. కానీ అందరిలాగా స్లిమ్ అవ్వలేకపోతున్నాననే బాధ మాత్రం నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది’’ అన్నారామె. మీరు కూడా సర్జరీని ఆశ్రయించవచ్చుకదా...? అనడిగితే- ‘‘అలాంటి పద్దతిలో తగ్గడం అంటే నాకు ఇష్టం ఉండదు. సహజసిద్ధంగా తగ్గితేనే ఆరోగ్యానికి మంచిది. సర్జరీల ద్వారా ఒళ్లు తగ్గించుకుంటే... భవిష్యత్తులో శారీరకంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది’’ అన్నారామె. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘కథానాయికగా కెరీర్ మొదలై అప్పుడే తొమ్మిదేళ్లు అవుతోంది. పన్నెండేళ్ల క్రితం మిస్ సూరత్‌గా ఎంపికయ్యాను. పదేళ్ల క్రితం మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్ దాకా వచ్చాను. అవన్నీ నా జీవితంలో స్వీట్ మెమరీస్. ఇప్పటికీ కలర్‌ఫుల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానంటే.. అందంతా గాడ్ గిఫ్ట్. మరో ఆరు నెలల్లో కొత్త నమితను చూస్తారు. కఠోరమైన శ్రమ చేసైనా సరే... నాటి అందమైన రూపాన్ని మళ్లీ దక్కించు కుంటాను’’ అని నమ్మకంగా చెబుతున్నారు నమిత.

ఒక్కసారైనా కలుసుకోలేదు!

ఒక్కసారైనా కలుసుకోలేదు!

నా గురించి ఒక్కోసారి వచ్చే వార్తలు విన్నప్పుడూ చదివినప్పుడూ భలే నవ్వొస్తుంది. నాకు సంబంధం లేకుండా చాలా సంగతులు ప్రచారమవుతున్నా పట్టించుకోను. పైగా అవి కొత్త జోకులని సరదాపడుతుంటా అని చెబుతోంది ఢిల్లీ డాల్‌ శ్రియ. అంతగా నవ్వించిన వార్త ఏమిటో ఆమె మాటల్లోనే విందాం... ''దీపా మెహతా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను. ఆ సినిమాకి సల్మాన్‌ రష్దీ రచించిన 'మిడ్‌నైట్‌ చిల్డ్రన్స్‌' నవల ఆధారం. అక్కడి వరకూ అంతా నిజమే. ఆ చిత్రంలో నటించేందుకు అంగీకరించగానే నేను సల్మాన్‌ రష్దీని కలిసి చర్చలు సాగించానంటూ ఏవో రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. అసలు నేను ఆయన్ని ఒక్కసారైనా కలుసుకోలేదు. అందుకు సంబంధించిన విషయాలు మీడియాలో చూడగానే నాకు నవ్వాగలేదు. వీలైతే తప్పకుండా రష్దీని కలుస్తాను''. త్వరలో శ్రియ 'పానీ' అనే చిత్రంలో నటించబోతోంది. ఈ సినిమాకి శేఖర్‌ కపూర్‌ దర్శకత్వం వహిస్తారు. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడు. 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' దర్శకుడు డానీ బోయెల్‌ నిర్మాత.

Wednesday, January 26, 2011

రూమర్స్ వస్తేనే ‘సెలబ్రిటీ’నా?

రూమర్స్ వస్తేనే ‘సెలబ్రిటీ’నా?


నాది చిన్ని ప్రపంచం. తక్కువమంది స్నేహితులు ఉన్నారు. నా సుఖ దుఃఖాలను వాళ్లతోనే పంచుకుంటాను. వీలు కుదిరినప్పుడల్లా వారిని కలుస్తాను. మేమంతా కలిస్తే ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తాం. చెవులు దద్దరిల్లిపోయేట్లు పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తాం’’ అంటున్నారు అసిన్. ఈ కేరళ కుట్టిని కొత్తవాళ్లెవరైనా కలిసినప్పుడు ముందు ‘చాక్లెట్లు’ ఇచ్చి, ఆ తర్వాతే మాట్లాడతారట. దాదాపు ప్రతి రోజూ ఓ చాక్లెట్ బాక్స్ ఆమె దగ్గర ఉంటుంది. ఆ బాక్సులో అన్నీ ఇంపోర్టెడ్ చాక్లెట్సేనట. ఇది మాత్రమే కాదు... అసిన్‌కు మరో అలవాటు కూడా ఉంది. వార్తా పత్రికల్లో తన గురించి వచ్చిన మంచి, చెడుకి చెందిన అన్ని వార్తలను, ఫొటోలను కత్తిరించి ఫైల్ చేస్తారట. అంతకు మించి వదంతులకు ఏ మాత్రం రియాక్ట్ కానంటున్నారామె. రూమర్స్ వస్తే లైమ్‌లైట్‌లో ఉన్నట్లుగా భావించబట్టే రియాక్ట్ అవ్వరా? అని అసిన్‌ని అడిగితే - ‘‘అలా ఏం కాదు. కొంతమంది తారలు పాపులార్టీ కోసం కావాలని తమ గురించి దుష్ర్పచారం చేయించుకుంటారట. నేనా టైప్ కాదు. చేతిలో నాలుగు సినిమాలు ఉంటే ఆటోమేటిక్‌గా లైమ్‌లైట్‌లో ఉంటాం. వదంతులు వస్తేనే సెలబ్రిటీల కింద లెక్క అని కూడా కొంతమంది అంటారు. ఆ మాటలతో నేను ఏకీభవించను’’ అన్నారు. తమిళంలో ఆమె నటించిన ‘కావలన్’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. కొంత గ్యాప్ తర్వాత తమిళంలో అసిన్ చేసిన చిత్రం కావడంతో ఈ సక్సెస్‌కు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ సరసన ఆమె తెలుగు ‘రెడీ’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం మేలో విడుదలవుతుంది.
 

బికినీకి రెడీ

బికినీకి రెడీ

కన్నడంలో ‘జరసందా’ అనే సినిమాలో నటిస్తున్నారు ప్రణీత. ఆ సినిమాలో ఓ రేంజ్‌లో గ్లామర్‌ను ఒలికిస్తున్నారని బెంగళూరు సమాచారం. ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో చేస్తున్నారట ప్రణీత. కన్నడరంగంలో ఈ సినిమా తనకు గొప్ప పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉన్నారీ బెంగళూరు భామ. మళ్లీ తెలుగుతెరపై దర్శనమెప్పుడు అనడిగితే- ‘‘నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. తెలుగులో నేను చేసిన సినిమాలు రెండు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా... ఆనందాన్నే మిగిల్చాయి. మళ్లీ తెలుగులో చేసే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ప్రణీత. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘నేను మోడ్రన్ అమ్మాయిని. నా వ్యక్తిత్వానికి, మనసుకు దగ్గరగా ఉండే పాత్రలు లభిస్తే... ఇష్టంగా చేస్తాను. ప్రస్తుతం కన్నడంలో ‘జరసందా’ చిత్రంలో నా మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్ర చేస్తున్నాను’’ అని చెప్పారు. గ్లామర్‌కి మీరిచ్చే నిర్వచనం ఏమిటి అని అడిగితే -‘‘గ్లామర్ అనేది నా దృష్టిలో మనసుకు సంబంధించింది. పాత్రోచితంగా ఎలా కనిపించాలన్నా నేను అభ్యంతరం పెట్టను. బికినీ వేయడానికి కూడా నేను సిద్ధమే. కథ డిమాండ్ చేస్తే... లిప్ లాక్ సీన్స్‌లో కూడా నటించడానికి అభ్యంతరం చెప్పను’’ అని తెలిపారు ప్రణీత. ఈ ముద్దుగుమ్మ మనోగతం చూస్తుంటే... జయాపజయాలకు అతీతంగా అనతికాలంలోనే అగ్రపథంలోకి చేరుకునే ఛాయలు కనిపిస్తున్నాయి.

Tuesday, January 25, 2011

నెట్‌లో నగ్న ఫోటోలను పెట్టుకున్న హైదరాబాద్ అమ్మాయి

నెట్‌లో నగ్న ఫోటోలను పెట్టుకున్న హైదరాబాద్ అమ్మాయి 


హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన అమ్మాయి తన నగ్న ఫోజులను నెట్‌లో పెడుతూ సంచలనం సృష్టించింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి.. అంటే హాట్ నటీమణి షెర్లిన్ చోప్రాగా పిలువబడుతున్న మోనాచోప్రా. 1984లో హైదరాబాద్‌లో పుట్టిన ఈమె స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. అయితే అమ్మడికి చదువు వంటబట్టకపోవడంతో వేరే దారి చూసుకుంది.అప్పట్లో ఆమెకు ఆకర్షణీయంగా కనబడిన ప్రపంచం ఫిలిం ఇండస్ట్రీ. హిందీ భాషపై పట్టుండటంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లింది. మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. గుర్తింపు పెద్దగా రాలేదు. ఇక లాభం లేదనుకుని ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫిజిక్, హాట్ ఎసెట్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షెర్లిన్‌కు రెడ్ కార్పెట్ వేశారు. అంతే... ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన హాట్ అప్పియరెన్స్‌తో బాలీవుడ్ కుర్రజనాన్ని గుల్లగుల్ల చేసింది. ఇపుడు షెర్లిన్ అంటే కుర్రకారు గుండెలు హీటెక్కిపోతాయి. 

పెళ్లయితే ఇంటికే పరిమితమవ్వాలా?

పెళ్లయితే ఇంటికే పరిమితమవ్వాలా?


పెళ్లయిన తర్వాత మగాళ్లు ఉద్యోగాలు మానుకుంటున్నారా? మరి ఆడవాళ్లు మాత్రం ఎందుకు మానాలి?’’ అంటున్నారు రవీనా టాండన్. దాదాపు ఆరేళ్ల క్రితం ఆమె పంపిణీదారుడు అనిల్ తడానీని వివాహం చేసుకున్నారు. కానీ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. ప్రస్తుతం ‘డాన్-2’ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రవీనా ఇద్దరు బిడ్డల తల్లి కూడా. ఒకవైపు వారి ఆలనా పాలనా చూసుకుంటూనే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారామె. అలాగే ఈ మధ్య ర్యాంప్ వాక్స్ కూడా చేస్తున్నారు. ఇంటిపట్టున ఉండి బిడ్డల సంరక్షణ చూసుకోకుండా ఇంత బిజీగా ఉండటం అవసరమా? అని ఎవరో రవీనాని అడిగారట. ఆ సందర్భంగానే రవీనా కాస్తంత ఘాటుగా పై విధంగా స్పందించారు. ఆడవాళ్లకి కెరీర్ ఉండకూడదని భావించడం తప్పని, ఉద్యోగం చేయడంవల్ల మహిళలకు ఆత్మస్థయిర్యం మెండుగా ఉంటుందని కూడా ఆమె స్పష్టం చేశారు.


Monday, January 24, 2011

కొలతలు చెప్పడం సంస్కారం కాదు

కొలతలు చెప్పడం సంస్కారం కాదు


36-24-36 అంటూ... కొలతల్ని చెప్పే వారంటే నాకు మంట. ఒకరికి కళ్లు అందంగా ఉంటాయి. ఒకరికి నవ్వు అందంగా ఉంటుంది. ఒకరిలో అమాయకత్వం అందంగా ఉంటుంది. ఆ విధంగా ఆడవారిలో అందాన్ని వెతకాలే తప్ప... కొలతలను చెప్పడం సంస్కారం అనిపించుకోదు’’ అని మండిపడ్డారు అందాల నమిత. విద్యార్థినులపై జరుగుతున్న వేధింపులే అంశంగా ఓ టీవీ చానల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న నమిత పై విధంగా స్పందించారు. కార్యక్రమానంతరం నమిత మాట్లాడుతూ-‘‘వేధింపులు అన్ని రంగాల్లోని మహిళలకూ సహజం. సినీరంగంలో నేను కూడా ఎన్నో రకాలు వేధింపులకు లోనయ్యాను. కానీ వాటికి భయపడలేదు. ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాను. అందుకే ఈ స్థాయికి రాగలిగాను. ఈ విషయంలో ముందు మారాల్సింది మీడియా. నా బొద్దుతనం కూడా వారికి ఓ న్యూసే. సన్నగా మల్లెతీగలా ఉండటమే హీరోయిన్‌కి కావాల్సిన అర్హత అనేలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. బొద్దుగా ఉండి కూడా హీరోయిన్‌గా సక్సెస్ అవ్వొచ్చు అని చెప్పేందుకే నేను లావయ్యాను. అంతేకాదు... మంచి అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నాను. ఎంత లావుగా ఉన్నా నాలోని క్యూట్ లుక్కే నాకు అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. ఏదీ ఏమైనా సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీడియాది. వారు పెడదారిలో వెళితే... సమాజం కూడా పెడదారి పడుతుంది. అందుకే స్ర్తీల విషయంలో కాస్త ఆలోచించి ప్రవర్తిస్తే మంచిది’’ అని హితవుపలికారు నమిత.

అభిషేక్‌తో నటించను!

అభిషేక్‌తో నటించను!


అందాల తార ఐశ్వర్య రాయ్‌ తాజాగా ఓ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదు. ఇంతకీ అందులో కథానాయకుడు ఎవరో తెలుసా..? స్వయానా ఆమె భర్త అభిషేక్‌ బచ్చన్‌. విపుల్‌ షా దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రమిది. దర్శకుడు విపుల్‌.. ఐష్‌కి కథ వినిపించి నటించమని కోరితే 'ఇందులో నేను నటించను. కత్రినా కైఫ్‌ను నాయికగా తీసుకొంటే బాగుంటుందేమో చూడండ'ని ఉచిత సలహా కూడా ఇచ్చిందట. గతంలోనూ 'దోస్తానా' సమయంలో ఆ సినిమాలో అభిషేక్‌తో కలిసి నటించమని దర్శకనిర్మాతలు కోరితే.. ఆమె తిరస్కరించింది. అదే జాబితాలో 'ఖేలే హమ్‌ జీ జాన్‌ సే', 'గేమ్‌' సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అభిషేక్‌ సరసన నటించడానికి ఐష్‌ ఎందుకు సుముఖంగా లేదో అర్థం కావడం లేదని బాలీవుడ్‌ జనాలు అనుకుంటున్నారు.  

Sunday, January 23, 2011

ఈగలు తోలుకుంటున్నాం’ అన్నది అవాస్తవం

ఈగలు తోలుకుంటున్నాం’ అన్నది అవాస్తవం


కన్నబిడ్డల గురించి ఎవరైనా అవాకులు చెవాకులు పేలితే ఎలా ఉంటుందో ‘లాసిస్’ గురించి మాట్లాడుతుంటే నాకలానే ఉంటుంది’’ అంటున్నారు శిల్పాశెట్టి. ‘లాసిస్’ అనేది శిల్పా ఆరంభించిన స్పా పేరు. ఈ స్పా ప్రారంభించి రెండేళ్లయ్యింది. ఇతర వ్యాపారాల్లో నిమగ్నమైన కారణంగా శిల్పా ఈ స్పాను మూసేయనున్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ సందర్భంగానే శిల్పా పైవిధంగా స్పందిస్తున్నారు. మరింత వివరంగా చెబుతూ -‘‘నేను, కిరణ్ బవా (స్పాలో భాగస్వామి) ఎంతో ప్లాన్ చేసి ‘లాసిస్’ను ఆరంభించాం. ఈ స్పా మాకు ముద్దు బిడ్డలాంటిది. బిడ్డల గురించి ఇతరులు లేనిపోనివి మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో మాకు అంతే బాధగా ఉంది. ‘లాసిస్’ మీద నేను, కిరణ్ భారీ ఎత్తున పెట్టుబడి పెట్టాం. అలాంటప్పుడు ఎందుకు మూసేస్తాం. ముంబయ్‌లో మూడు చోట్ల ఈ స్పా పెట్టాం. ‘లాసిస్’ లాభనష్టాల గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. మాకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. వారికి కావల్సిన విధంగా సేవలు అందించడానికి మెరుగైన నిపుణులు ఉన్నారు. ఈ స్పాని మరింత అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈలోపు ఎవరో గిట్టని వాళ్లు ‘శిల్పా ఆరంభించిన స్పా నష్టాల్లో ఉందట. కస్టమర్లు లేరట. ఈగలు తోలుకుంటున్నారట’ అని ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తలు నన్ను చాలా బాధపెట్టాయి. ఇంకా మౌనం వహిస్తే.. ఈ వార్తలు అధికమవుతాయనిపించింది. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా. ‘లాసిస్’ను మూసే ప్రసక్తే లేదు. ఇకనైనా మా స్పా గురించి లేనిపోని వార్తలు సృష్టించవద్దని మనవి చేసుకుంటున్నాను’’ అన్నారు శిల్పా శెట్టి.
 

పెళ్లి వేడుకలో ప్రేమ ఊసులు

పెళ్లి వేడుకలో ప్రేమ ఊసులు


ఇంకెన్నాళ్లు దాస్తారు. అందుకే విజృంభించేశారు’’... జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ గురించి బాలీవుడ్ వర్గాలు అనుకుంటున్న మాటలివి. గత ఎనిమిదేళ్లుగాఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ జెన్నీ, రితేష్ ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఒకానొక సమయంలో అసలు మేమిద్దరం స్నేహితులు కూడా కాదనే టైపులో మాట్లాడారు కూడా. అయితే ఆ మాటలను ఎవరూ నమ్మలేదు. జెన్నీ, రితేష్ మధ్య ‘ఏదో ఉంది’ అనుకున్నారు. ఆ ఊహ ఇటీవల బలపడింది. విషయంలోకి వస్తే.. అక్షయ్‌కుమార్, ట్వింకిల్ ఖన్నా ఇటీవల తమ పదవ పెళ్లి రోజును ఘనంగా జరుపుకున్నారు. ఆ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారిలో జెన్నీ, రితేష్ కూడా ఉన్నారు. ఈ పార్టీలో వేరే స్నేహితులతో కలవకుండా ఈ ఇద్దరూ కబుర్లాడుకున్నారట. అది మాత్రమే కాకుండా చేతిలో చెయ్యేసుకుని, ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటూ డాన్స్ కూడా చేశారట. జెన్నీ, రితేష్ బహిరంగంగా ఈ విధంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి అంటూ పై విధంగా స్పందిస్తున్నారు బాలీవుడ్‌వారు. ఇప్పటివరకూ ఎవరి కంటా కనపడకుండా తిరిగిన వీరిద్దరూ హఠాత్తుగా పబ్లిక్‌గా ఇలా ప్రవర్తించడం వెనుక ఏదో తెగింపు కూడా కనిపిస్తోందని, వీరి వాటం చూస్తే ప్రేమ వ్యవహారాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లేట్లు ఉన్నారని కూడా బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక అక్షయ్, ట్వింకిల్ ఇచ్చిన పార్టీ విషయానికొస్తే.. రుచికరమైన వంటకాలు, ఖరీదు గల మద్యంతో అతిథులకు ఓ రేంజ్‌లో మర్యాదలు జరిపారు. మరో పదేళ్లయినా మేమిద్దరం ఇలాగే అన్యోన్యంగా ఉంటామని ఈ సందర్భంగా అక్షయ్, ట్వింకిల్ పేర్కొన్నారు.

Saturday, January 22, 2011

గోపీతో రొమాంటిక్ ఫీల్... ఓహ్: "టాలీవుడ్ కత్రినా"


గోపీతో రొమాంటిక్ ఫీల్... ఓహ్: "టాలీవుడ్ కత్రినా"
నిన్నగాక మొన్నొచ్చిన పొడుగు పిల్ల దీక్షాసేథ్ అనుష్క, ఇలియానా వంటివారిని దాటుకుంటూ యమస్పీడుతో ఆఫర్లు దక్కించుకుంటూ వెళ్లిపోతోంది. అంతేకాదండోయ్... తన సెక్సీ ఫిగర్‌ను కావలసినంత గ్లామర్‌గా చూపిస్తూ టాలీవుడ్ కత్రినా అనే ఇమేజ్ ను తెచ్చేసుకుంది. తాజాగా ఆమె గోపీచంద్ సరసన వాంటెడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో గోపీతో నటించిన అనుభవాన్ని చెపుతూ... షూటింగ్‌లో అన్ని విషయాలు చాలా చక్కగా నేర్పాడని గోపీచంద్‌కు కితాబిస్తోంది‌. సోలో హీరోయిన్‌గా ఆయన పక్కన నటించడం చాలా థ్రిల్‌గా ఉందనీ, ఇటువంటి అవకాశం తక్కువ కావలంలోనే రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది.గోపీచంద్‌తో నటిస్తుంటే రొమాంటిక్‌ ఫీలింగ్‌ కల్గిందని డైరెక్టుగా చెప్పింది. వెంటనే.. నాలుక్కరుచుకుని... సన్నివేశంలో రొమాంటిక్‌గా ఫీలవ్వాలి గనుక తను చెప్పినట్లే ఫీలై నటించాననీ అంది. అనుష్కలో కూడా గోపీ అలాంటి ఫీలింగ్ కల్గించి గతంలో నటింపజేశాడన్న సంగతి దీక్షకు తెలుసో లేదో మరి. 

ఏంటీ కమిలినీ... అలా నగ్నంగా కనిపించావ్..?

ఏంటీ కమిలినీ... అలా నగ్నంగా కనిపించావ్..? 


ఆనంద్‌ చిత్రంలో పక్కా సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా నటించి అటు పెద్దల్ని, ఇటు యువతను ఆకట్టుకున్న కమలినీ ముఖర్జీకి ఆ తర్వాత అనుకున్న ఆఫర్లు రాలేదు. తాజాగా నాగవల్లిలో నాట్యకారిణిగా చేసింది. డాన్స్‌ బాగానే వేసిందని ప్రేక్షకులు కితాబిచ్చారు. టాలీవుడ్ లో ఇలా ఉంటే మొన్నీమధ్య ఓ మలయాళ సినిమాలో నటించింది. అందులో నగ్నంగా కన్పించే సన్నివేశంలో చేసిందని భోగట్టా. ఇలా నగ్నంగా నటించడంపై ఆమె అభిమానులు ఆమెకు లెటర్స్‌ రాశారట. దీనికి ఆమె స్పందిస్తూ.. ఒకనాడు నేను ఫలానా డ్రెస్‌ వేస్తే బాగుందన్నారు. మీరే ఇలా అంటే ఎలా? మలయాళంలో ఆ సన్నివేశం ఎలా వచ్చిందో... ఏమిటో తెలుసుకోవాలికదా... బాడీ నాదే... కానీ... దాన్ని మార్ఫింగ్‌తో మాయ చేశారని తెలివిగా చెప్పింది. నేను చేయలేదని మాత్రం అనలేదు. దీన్నిబట్టి మనం ఏమనుకోవాలి...?

Friday, January 21, 2011

ఆమె తలపొగరు నచ్చింది

ఆమె తలపొగరు నచ్చింది


అ’ అంటే అసూయ’ ‘ఆ’ అంటే ఆడది... అని కొందరు అంటుంటారు. ఆ మాట కరెక్ట్ కాదని తన మాటలద్వారా నిరూపించారు ‘మిరపకాయ్’ భామ రిచా గంగోపాథ్యాయ. సినీ పరిశ్రమ అంటేనే పోటీ వాతావరణానికి నిలయం. కథానాయికల విషయానికొస్తే... అది ఇంకాస్త ఎక్కువ. బాలీవుడ్‌లో అయితే... ఒకరినొకరు తిట్టుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ రిచా గంగోపాథ్యాయని మాత్రం అలాంటి హీరోయిన్లకు మినహాయింపు అని చెప్పాలి. సాటి హీరోయిన్‌ని, అదికూడా తనతో పాటు ‘మిరపకాయ్’లో కలిసి నటించిన దీక్షాసేథ్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు రిచా. ‘మిరపకాయ్’లో తనకంటే దీక్షాసేథ్ బాగా చేసిందని, ఆ పాత్ర ద్వారా చక్కని ఈజ్‌ని ప్రదర్శించిందని అంటున్నారామె. ఆ వివరాల్లోకెళ్తే- రవితేజ ‘మిరపకాయ్’ చిత్రంలో రిచా గంగోపాథ్యాయ, దీక్షాసేత్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా తన కెరీర్‌లో మైలురాయిలా నిలిచిందని రిచా చెబుతూ అదే సందర్భంలో దీక్షాసేథ్‌ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు రిచా.ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘స్వతహాగా దీక్ష చాలా నెమ్మదస్తురాలు. మంచి అమ్మాయి కూడా. కానీ తన మనస్తత్వానికి విరుద్ధంగా ‘మిరపకాయ్’లో హెడ్‌వెయిట్ (తలపొగరు) ఉన్న అమ్మాయిగా చేసింది. అంతేకాదు... ఆ పాత్రను అద్భుతంగా పండించింది కూడా. అందుకే ఆమెను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నేను స్వతహాగా ఎన్‌ఆర్‌ఐని. ఇండియన్ కల్చర్ గురించి వినడమే ఎక్కువకానీ.. ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు తక్కువ. అలాంటి నేను ‘మిరపకాయ్’లో సంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా చేశాను. నేను పెరిగిన వాతావరణానికి పూర్తి భిన్నమైన పాత్ర ఇది. అందరూ బాగా చేశానని అంటున్నారు. నిర్మాత, దర్శకుడు, రవితేజలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అన్నారు రిచాగంగోపాధ్యాయ.

అంత వ్యామోహం లేదు

అంత వ్యామోహం లేదు


గువల్ని కట్టిపడేసే మంత్రం... షాపింగ్‌. కాటుక కోసమని వెళ్లి- క్రెడిట్‌ కార్డు మొత్తం ఖాళీ చేస్తారు. గంటల తరబడి షాపింగ్‌ మాల్స్‌లోనే గడుపుతుంటారు. కానీ నేను అలా కాదు... అంటోంది శ్రియ. 'విదేశాల్లో షూటింగ్‌ అంటే సరదాగా ఉంటుంది. కొత్త ప్రదేశాల్ని చుట్టిరావచ్చు. అక్కడ షాపింగ్‌ కూడా చేస్తా. అయితే ఏం కావాలో అవే కొంటాను. పనికిరాని వస్తువులతో బ్యాగు నింపుకోను. షాపింగ్‌పై అంత వ్యామోహం లేదు' అంటోంది ఈ ఢిల్లీ బొమ్మ. అంతే కాదు.. 'డబ్బుని వృథాగా ఖర్చు చేయకూడదు. మీ దగ్గర మరీ ఎక్కువగా ఉంటే లేనివాళ్లకు సహాయం చేయండి' అని చెబుతోంది. మరి మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి? అని అడిగితే 'నేను ఢిల్లీలో చదువుకొంటున్నప్పుడు మా కాలేజీ ఎదురుగా ఓ అంధుల పాఠశాల ఉండేది. తీరిగ్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్లేదాన్ని. చూపు లేకపోయినా వాళ్లెలా నడుస్తారు? ఎలా ఆడుకొంటారు? ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్తగా గమనించేదాన్ని. వాళ్లకోసం ఏమైనా చేయాలి అని అప్పుడే అనుకొన్నా. వారి కోసం శ్రీ స్పా ప్రారంభిస్తున్నాను'' అని చెప్పింది.

Thursday, January 20, 2011

అలా అన్పించకపోతే నేను ఫెయిల్ అయినట్లే

అలా అన్పించకపోతే నేను ఫెయిల్ అయినట్లే


నన్నెవరైనా సెక్సీ అన్నారో... నాకు ఒళ్లు మండుకొస్తుంది’’ అని జెనీలియా గతంలో స్టేట్‌మెంట్ ఇచ్చిన సంగతి విదితమే. ఇప్పుడా స్టేట్‌మెంట్‌ను ఆమె వాపస్ తీసుకుంటున్నారట. దానికి కారణం బాలీవుడ్‌లో ఆమె చేస్తున్న ఓ చిత్రం. ఆ సినిమా ఏమిటి? అనుకుంటున్నారా!. తెలుగులో వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన ‘ఘర్షణ’ బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. తెలుగులో అసిన్ చేసిన పాత్రను బాలీవుడ్‌లో జెన్నీ చేస్తున్నారు. ఆ సినిమా కారణంగా ఆమె తన స్టేట్‌మెంట్‌ను వెంటనే వాపస్ తీసుకున్నారు. వెనక్కు తగ్గడం అంటే.. అందాల ఆరబోతకు సిద్ధం అయినట్టేగా అని జెన్నీని అడిగితే- ‘‘పాత్ర స్వభావాన్ని బట్టి నడుచుకోవడమే నటన. కొన్ని పాత్రలు చేసేటప్పుడు కాస్తంత స్పైసీగా కనిపించాల్సి వస్తుంది. ఆ సమయంలో చూసే వారికి సెక్సీగా అనిపించకపోతే నటిగా నేను ఫెయిల్ అయినట్టే. ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే... నేను పర్టిక్యులర్‌గా ఒక సినిమా కారణంగా అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఒక నటిగా నాకు నేను రియలైజ్ అయి ఇలా చెబుతున్నా’’ అని చెప్పారు జెన్నీ. అంటే ప్రస్తుతం చేస్తున్న జాన్ అబ్రహం సినిమాలో కూడా సెక్సీగా కనిపించబోతున్నారా? అనంటే- ‘‘అది డిగ్నిఫైడ్‌గా ఉండే పాత్ర. తొలిసారి లెక్చరర్‌గా కనిపిస్తున్నాను. ఎప్పుడైతే ఈ సినిమా చేయడానికి అంగీకారం తెలిపానో... అప్పట్నుంచే నా ప్రవర్తనలోనూ, బాడీ లాంగ్వేజ్‌లోనూ మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాను. ఇప్పటి వరకూ అల్లరి చిల్లరి పాత్రల్లో చేసిన జెనీలియా ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు.. సహజంగా జాన్ అబ్రహం సినిమాల్లో రొమాన్స్ పాళ్లు కాస్తంత అధికంగా ఉండే మాట వాస్తవమే. ఈ సినిమాలో కూడా రొమాన్స్ ఉంటుంది. కథరీత్యా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. దాంతో తప్పలేదు. కాకపోతే... అది లిమిట్‌గా ఉంటుంది. ఒక పోలీస్ అధికారి, ఒక అధ్యాపకురాలి మధ్య రొమాన్స్ ఎంతవరకు ఉంటే బావుంటుందో... అంతవరకే ఉంటుంది’’ అని బదులిచ్చారు జెనీలియా.

ధోనీ అవుట్ అయితే అప్‌సెట్

ధోనీ అవుట్ అయితే అప్‌సెట్


బాలీవుడ్‌లోకి ప్రవేశించిన తర్వాత అసిన్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇక ఆమె తొలి హిందీ సినిమా ‘గజిని’ హిట్ అవ్వడంతో ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో చేరిన ఈ తార కేవలం సినీతారలతోనే కాదు ఇతర రంగాల వ్యక్తులతో కూడా పరిచయాలు పెంచుకున్నారు. ఈ కోవలోనే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీతో అసిన్ స్నేహం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు వాణిజ్య ప్రకటనల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారి, చివరికి ఎఫైర్‌గా పరిణమించిందనే గుసగుసలు కూడా అప్పట్లో వినిపించాయి. ఆ విషయం అలా వుంచితే మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ అంటే అసిన్‌కు చాలా ఇష్టమట. ఓ వైపు తను షూటింగ్‌లో వున్నా తను చేయాల్సిన సన్నివేశాల మీద కంటే ఎక్కువ శ్రద్ధ ధోని బ్యాటింగ్ మీదే వుంటుంది. అతని బ్యాటింగ్ స్కోర్ గురించి పదే పదే, ప్రతి ఓవర్‌కు ఓసారి ఫోన్‌లో వాకబు చేయనిదే ఆమె మనసు కుదుటపడదట. ఇదంతా అసిన్‌కు క్రికెట్ అంటే ఇష్టంతో అలా చేసిందేమో అనుకుంటే మీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే మ్యాచ్‌లో ధోని అవుటయ్యాడని తెలిసిన మరుక్షణమే ఈ తార ఆట గురించి పట్టించుకోకుండా కొంత సేపటి వరకు బాధగా వుండిపోతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె అంతరార్థం ఇప్పుడైనా మీకు అర్థమైందా?

Wednesday, January 19, 2011

ఎయిర్ హోస్టస్‌పై నోరు పారేసుకున్న కత్రినా కైఫ్

ఎయిర్ హోస్టస్‌పై నోరు పారేసుకున్న కత్రినా కైఫ్


నేనెవరో తెలుసా? నన్ను టచ్ చేస్తావా? నీకెంత ధైర్యం’’ అంటూ ఇటీవల కత్రినా కైఫ్ ఓ ‘విమానవతి’ (ఎయిర్ హోస్టస్‌ై)పె విరుచుకుపడ్డారు. కత్రినా నుంచి అలాంటి మాటలు ఊహించని సదరు ఎయిర్ హోస్టస్ కంగు తిన్నారట. తన తప్పేం లేకపోయినా కత్రినాకు క్షమాపణలు చెప్పి ఆమె తప్పుకున్నారట. విషయంలోకి వస్తే.. ఇటీవల కత్రినా ఓ విమానంలో ప్రయాణం చేశారు. విమానం టేకాఫ్ సమయం దగ్గర పడటంతో సదరు విమానవతి కత్రినా దగ్గరకొచ్చి ‘మేడమ్... సీట్ బెల్ట్ పెట్టుకోండి’ అని వినయంగా చెప్పారట. కానీ కత్రినా ఆ మాటలు విననట్లు నటించారట. దాంతో ఆ విమానవతి తన పనిలో నిమగ్నమయ్యారు. ఇక విమానం టేకాఫ్ అయ్యే సమయం మరింత దగ్గరపడటంతో మరోసారి కత్రినాకు చెబుదామని ఆమె దగ్గరకు వెళ్లారట ఎయిర్ హోస్టస్. కత్రినా నిద్రలోకి జారుకున్న విషయాన్ని గమనించి ఆమెను తట్టి లేపారట. అంతే.. కళ్లు తెరిచిన కత్రినా పై విధంగా తన ఆగ్రహాన్ని వ్యక్తపరిచారట. ఇంత చిన్న విషయానికి ఆమె అలా నోరు పారేసుకోవడంతో ఎయిర్ హోస్టస్ బాధపడిపోయి.. చుట్టుపక్కలవాళ్లు తననే చూస్తుండటంతో అవమానంగా ఫీలై కత్రినాకు సారీ చెప్పి అక్కడ్నుంచి తప్పుకున్నారట. కత్రినా సున్నిత మనస్కురాలని బాలీవుడ్ వర్గాలు అంటాయి. అయితే ఈ మధ్య ఆమె ప్రవర్తనలో మార్పొచ్చిందట. అందుకు నిదర్శనంగా ఈ సంఘటనని చెప్పుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. అయితే కత్రినా మేనేజర్ మాత్రం ‘‘విమానంలో అలాంటి సంఘటన జరగలేదు. అసలు కత్రినా నిద్రేపోలేదు’’ అని అందర్నీ నమ్మించడానికి ట్రై చేస్తున్నారు.

ఆ విషయం నాన్నకు చెప్పేస్తా

ఆ విషయం నాన్నకు చెప్పేస్తా


అనగనగా... ఓ ధీరుడు’ ప్రచార చిత్రాల్లోని శ్రుతిహాసన్ని చూస్తుంటే యువ రాణిలా .... షేక్స్పియర్ కథల్లోని కావ్యనాయిక గుర్తొస్తోంది. ఈ సినిమాతో శ్రుతి టాప్ హీరోయిన్ కావడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇదిలా వుండగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సిద్దార్థ్తో తన బంధం బలపడిందని వస్తున్న పలు వార్తలపై శ్రుతి స్పందిస్తూ- ‘‘అవన్నీ ఊహాగానాలు మాత్రమే. సిద్దార్థ్ మంచి నటుడు. ఒక నటిగా తనతో చేయడం సవాల్గా తీసుకున్నాను. ఇందులో నా పాత్ర పేరు ప్రియ. ఈ పాత్ర పోషణలో సిద్దార్థ్ సహకారం మరచిపోలేను. తోటి కళాకారుడిగా అతణ్ని గౌరవిస్తాను. అంతవరకే. మా నాన్నకు నాపై ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మాత్రం నేను ఎప్పుడూ వమ్ము కానీయను. నేను బికినీ ధరించినా, హీరోలతో క్లోజ్గా మూవ్ అయినా... అవన్నీ పాత్రల్లో భాగాలు మాత్రమే. బయట నేను అందరి లాంటి అమ్మాయినే. ఒకవేళ నేను ఎవర్నయినా ఇష్టపడితే... మరో ఆలోచన చేయకుండా డెరైక్ట్గా నా అభిప్రాయాన్ని నాన్నకు చెప్పేస్తాను. ప్రస్తుతం అటు దక్షిణాదిన, ఇటు ఉత్తరాదిన లెక్కకు మించిన అవకాశాలు నన్ను వరిస్తున్నాయి. వాటిల్లో ఏ సినిమా చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాను. ఈ బిజీలో ఇక ప్రేమకు సమయం ఎక్కడుంటుంది చెప్పండి..?’’ అని అన్నారు శ్రుతి. 

Friday, January 14, 2011

40లో చిలిపి చేష్టలు!

40లో చిలిపి చేష్టలు!


హిందీ హాస్య కథానాయకుడు గోవిందా నటిస్తున్న తాజా చిత్రం 'నాటీ ఎట్‌ 40'. ప్రస్తుతం గోవిందా వయసు 47 సంవత్సరాలు. 40 ఏళ్ల వ్యక్తిగా కనిపించడం కోసం దాదాపు 8 కేజీలు బరువు తగ్గారు. ఆయన సరసన యువికా చౌదరి, సయాలీ భగత్‌ నాయికలుగా నటిస్తున్నారు. గోవిందా మాట్లాడుతూ ''నా సరసన యువ నాయికలు నటిస్తున్నారు కదా. నేను కూడా కుర్రాడిలా కనిపించడం కోసం కష్టపడ్డాను. వ్యాయామాలు చేసి శరీర బరువును తగ్గించాను. యోగా కూడా నాకు ఉపయోగపడింద''న్నారు. జగ్‌మోహన్‌ ముంద్రా దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈజిప్టులో పెళ్లి

ఈజిప్టులో పెళ్లి


జిప్టుకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న బాలీవుడ్‌ శృంగార నాయిక సెలీనా జైట్లీ తన పెళ్లిని కూడా అక్కడే చేసుకోవాలని అనుకుంటోంది. ఈ విషయాన్ని ఆమే వెల్లడించింది. ఇటీవల దుబాయ్‌కి చెందిన పీటర్‌ హాగ్‌తో నిశ్చితార్థం చేసుకొన్న సెలీనా పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని సెలవిస్తోంది. మరో ఏడాది వేచి చూడాలని ఆమె నిర్ణయించుకొంది. సెలీనా మాట్లాడుతూ ''పీటర్‌, నేనూ ఉంగరాలు మార్చుకొన్నాం.. దాన్ని మా సంప్రదాయంలో నిశ్చితార్థం అనరు. దుర్గా పూజ సందర్భంగా తల్లిదండ్రుల సమక్షంలో.. వారి ఆశీస్సులతో ఉంగరాల్ని మార్చుకొన్నాం. నా సోదరుడు విక్రాంత్‌ పెళ్లి ముందు జరగాలి. మార్చి లేదా ఏప్రిల్‌లో అతని వివాహం అవుతుంది. బహుశా ఈ ఏడాది ఆఖరున మా పెళ్లి ఈజిప్టులో ఉండొచ్చు. పీటర్‌ హాగ్‌ తొమ్మిదేళ్లుగా దుబాయ్‌లో హోటల్‌ వ్యాపారం చేస్తున్నారు. మన మీడియా వేగానికి ఇంకా ఆయన అలవాటు పడలేదు. ప్రస్తుతం నా చేతిలో సినిమాలు, వాణిజ్య ప్రకటనలు ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంద''ని వివరించింది.

Thursday, January 13, 2011

అంజలిపై చెయ్యేసిన పోకిరోళ్లు

అంజలిపై చెయ్యేసిన పోకిరోళ్లు


వర్ధమాన నటి, అంగాడి తెరు ఫేమ్ అంజలిని పోకిరి కుర్రాళ్లు చేయి పట్టి లాగారట. అక్కడే ఉన్న దర్శకుడు గౌరవ్ వారిని చితకబాదారట. యువ నిర్మాత దయానిధి అళగిరి, వివేక్ రత్నవేల్ సంయుక్తంగా నైన్ క్లౌడ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం తూంగానగరం. విమల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా చేస్తున్నారు. హీరో స్నేహితుడిగా దర్శకుడు గౌరవ్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కొన్ని రోజులుగా మదురైలో జరుగుతోంది.
మదురై బస్టాండ్ వద్ద విమల్, అంజలి, 500 మంది సహాయ నటీనటులలో కీలక సన్నివేశాన్ని ఇటీవల చిత్రీకరించారు. షూటింగ్ చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్నారు. అందు లో కొందరు పోకిరి కుర్రాళ్లు అంజలి చేయి పట్టి లాగి అల్లరి చేశారు. దర్శకుడు గౌరవ్ వారి చెంప చెళ్లుమనిపించి అక్కడి నుంచి తరిమేశారు. దెబ్బలు తిన్న కుర్రాళ్లు తాము లోకల్ అని, ఇంతకింత అనుభవిస్తావని గౌరవ్ను హెచ్చరించారట. దర్శకుడు కల్పించుకుని తానూ మదురై వాడినేనని సమాధానమిచ్చారట. పోలీసులకు సమాచారం అందించడం తో వారు అక్కడ భద్రత ఏర్పాటు చేశారట.

అతనితో స్నేహం అపూర్వం

అతనితో స్నేహం అపూర్వం


ప్రస్తుతం దీపికాపదుకొనే కోపెన్‌హగన్‌లో ఉన్నారు. షూటింగ్ నిమిత్తం ఆమె అక్కడున్నారు అనుకుంటే పొరపాటే. తన ‘ప్రియ’మిత్రుడు సిద్దార్థ్‌మాల్యాతో ఆమె అక్కడ ఎంజాయ్ చేస్తున్నారట. వారితో పాటు దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే కూడా అక్కడున్నారట. ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా, బాహాటంగా చెప్పే దీపికా... తన ప్రేమ వ్యవహారం గురించి ఇటీవల మాట్లాడుతూ -‘‘సిద్దార్థ్‌తో నా స్నేహం ప్రస్తుతం డేటింగ్ దాకా వచ్చింది. అక్కడ్నుంచి ఇంకెంత దూరం వెళుతుందో నేను చెప్పలేను. తన స్నేహంలో అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నాను’’ అన్నారు. ‘‘ఇంకెంత దూరం వెళుతుందో...’’ అంటే అర్థం ఏంటో తెలుసుకోవచ్చా...? అని దీపికను అడిగితే- ‘‘నేను ఏం మాట్లాడినా... పెడర్థం తీస్తే ఎలా. ఇంకెంత దూరం వెళుతుందో... అంటే.. పెళ్లి దాకా అని అర్థం’’ అని చెప్పారు. ఈ మాటలు విన్న బాలీవుడ్ జనాలు దీపిక, సిద్దార్థ్‌ల వివాహం త్వరలో జరగడం ఖాయం అని చెవులు కొరుక్కుంటున్నారు. 

Wednesday, January 12, 2011

ఆ పొరపాటు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నా

ఆ పొరపాటు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నా


ఈ చిత్రంలో చేస్తున్నప్పుడు నా స్టూడెంట్ లైఫ్ గుర్తొచ్చింది. ఈ ఏడాది నా కెరీర్‌కి ఈ చిత్రం బాగా హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అంటున్నారు శ్రీయ. జీవా సరసన ఆమె నటించిన తమిళ చిత్రం ‘రౌదిరం’. ఈ చిత్రంలో శ్రీయ ‘లా స్టూడెంట్’గా యాక్ట్ చేశారు. ఆ పాత్ర గురించే ఆమె పై విధంగా స్పందించారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చెబుతూ - ‘‘కొన్ని పాత్రలు చాలాకాలం గుర్తుండిపోతాయి. ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర అలా గుర్తుండిపోతుంది. ఇదొక ప్రయోజనాత్మక సినిమా. వార్తా పత్రికల్లో మనం చదివే సంఘటనల గురించి ఈ చిత్రంలో చర్చించడం జరిగింది. సామాజిక స్పృహ ఉన్న సినిమా కావడంతో ఎంతో ఇష్టపడి చేశాను. అలాగే ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మెండుగా ఉన్నాయి’’ అన్నారు. కొత్త సంవత్సం గురించి చెబుతూ - ‘‘వారం రోజుల క్రితం వరకు ‘2010’ అని రాసి.. ఇప్పుడు హఠాత్తుగా ‘2011’ అని రాయడం మర్చిపోతున్నాను. ఈ మధ్య ఎవరికో ఓ వార్త రాస్తూ.. తేదీ వేసి, సంవత్సరం మాత్రం 2010 అని రాశాను. దాంతో నువ్వింకా ఓ సంవత్సరం వెనకే ఉన్నావని ఆటపట్టించారు. 2011 అని అలవాటు పడటానికి ఇంకొన్నాళ్లు పడుతుంది. మళ్లీ 2011 ముగిసిన తర్వాత 12 అప్పుడు ఇదే సమస్య నెలకొంటుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నాకిలా పొరపాటు జరగడం కామన్ అయ్యింది. అఫ్‌కోర్స్ నాలా చాలామంది ఉండి ఉంటారని అనుకుంటున్నాను. గత ఏడాది గురించి చెప్పాలంటే కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా చాలా ఆనందంగా సాగింది. ఈ ఏడాది రెట్టింపు ఆనందాన్నిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ప్రస్తుతం శ్రీయ ఇంగ్లిష్ చిత్రం ‘మిడ్ నైట్ చిల్డ్రన్’, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందనున్న ‘పానీ’ చిత్రాలు కమిట్ అయ్యారు. ఈ నెలలోనే ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ షూటింగ్ ఆరంభమవుతుంది. ‘పానీ’ షూటింగ్ ఫిబవరిలో ప్రారంభం అవుతుంది. మలయాళంలో ఆమె నటిస్తున్న ‘కాసనోవా’ షూటింగ్ ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

అతని బుద్ధి మారదు

అతని బుద్ధి మారదు


న మాజీ ప్రేయసిలకు ఝలక్ ఇవ్వడానికి కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏ మాత్రం మొహమాటపడరు. ఇటీవల ఆయన నోటి దురుసుతనానికి సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ బలయ్యారు. ఈ మధ్య జరిగిన 17వ వార్షికోత్సవ స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుకలో కత్రినా కైఫ్ ‘బెస్ట్ పాపులర్’ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ వేదికపై ఆమె అద్భుతంగా నర్తించారు కూడా. అనంతరం ఇంటి దారి పట్టడానికి బయటికొచ్చిన కత్రినాకు సల్మాన్ తారసపడ్డారు. తన వాన్ డోర్ తెరచుకుని స్టయిల్‌గా కూర్చుని ఉన్న సల్మాన్ మాజీ ప్రేయసిని చూడగానే ఆత్మీయంగా నవ్వారట. ఆ నవ్వు వెనకాల ఏదైనా కుట్ర ఉంటుందని ఊహించని కత్రినా తను కూడా ఓ చిరునవ్వు విసిరారు. సల్మాన్ రెండు చేతులు చాచడంతో కత్రినా ఆయన ఆత్మీయ కౌగిలిలో ఒదిగిపోయారట కూడా. ఆ తర్వాత ఆమె బుగ్గలను సల్మాన్ ముద్దాడటం చాలామందిని షాక్‌కు గురి చేసింది. తాము ఉన్నది బహిరంగ ప్రదేశంలో అన్న స్పృహ కూడా లేకుండా సల్మాన్ అలా చేయడం, కత్రినా కూడా ఆయన సాన్నిహిత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించడం చూసి.. మళ్లీ వీళ్లిద్దరూ ఒకటవ్వడం ఖాయం అనే ఊహలకు తావిచ్చింది. ఈ సీన్ తర్వాత సల్మాన్‌కు టాటా చెప్పి కత్రినా తన వాహనం వైపు అడుగులు వేశారట. మూడు, నాలుగు అడుగులు వేసిన తర్వాత ‘‘ఇప్పుడు నువ్వెవరితో ఉంటున్నావ్?’’ అని సల్మాన్ నోటి నుంచి వచ్చిన మాటలకు కంగు తిని కత్రినా వెనక్కి తిరిగి చూశారని సమాచారం. వెంటనే సల్మాన్ తన బాడీగార్డ్‌ని చూస్తూ ‘‘ఇప్పుడు నువ్వెవరితో ఉంటున్నావ్?’’ అని అడిగారట. ఆ రకంగా ఆ ప్రశ్న కత్రినాని ఉద్దేశించి అడగలేదని సల్మాన్ స్పష్టం చేయబోయారు. కానీ కత్రినా ఏమైనా అమాయకురాలా ఏంటి? ఆ ప్రశ్న తనని ఉద్దేశించే సల్మాన్ అడిగారని అర్థం చేసుకుని మొహం కందగడ్డలా పెట్టుకుని.. అతని బుద్ధి మారదు అనుకుని హడావిడిగా తన వాహనంలోకి ఎక్కారట. తన మాజీ ప్రేయసి మనసు గాయపడిందని తెలుసుకుని సల్మాన్ అక్కడ్నుంచి ఆనందంగా నిష్ర్కమించారని సమాచారం. దీన్నిబట్టి సల్మాన్‌లో ఏ రేంజ్‌లో పైశాచికత్వం ఉందో ఊహించవచ్చు.

Tuesday, January 11, 2011

అవన్నీ చెప్పుకోకూడదు

అవన్నీ చెప్పుకోకూడదు


2010లో మీరు సాధించింది ఏమిటి? అని అడిగితే హన్సిక తెల్లమొహం వేస్తోంది. ఆ వెంటనే తేరుకొని 'జీవితం అంటే సినిమాలు ఒక్కటేనా.. ఇంకా చాలానే ఉన్నాయి..' అంటూ సమాధానం దాటేస్తోంది. 'తెలుగులో అంతగా అవకాశాలు రానిమాట నిజం. కానీ తమిళంలో మంచి గుర్తింపు సాధించాను. అక్కడ నాకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను. ఆ విధంగా గతేడాది నాకు గుర్తుండిపోతుంది' అంటోంది. 'తప్పులు చేయడం సహజం. నేను కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొన్నాను. అవన్నీ చెప్పకూడదు. అయితే మళ్లీ పునరావృతం చేయను. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకొన్నాను. తప్పకుండా నాకు గుర్తింపు తెచ్చిపెడతాయి. ఆ సినిమాల సంగతి దర్శక నిర్మాతలే చెబుతారు' అంది. అయితే హన్సిక కేవలం పెద్ద స్టార్లూ... పెద్ద దర్శకుల సినిమాలకే పరిమితం కాదట. 'కథ నచ్చితే- ఎవరి దర్శకత్వంలో అయినా నటించడానికి ఒప్పుకొంటాను. హీరో ఎవరు? అనే విషయానికి కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వను..' అని చెబుతోంది. 2010 నేర్పిన పాఠం ఇదేనా?!  

లిప్ కిస్ నుంచి బికినీ వరకూ...

లిప్ కిస్ నుంచి బికినీ వరకూ...


ఆరెంజ్’ చిత్రంలో జెనీలియాతో పాటు అందర్నీ అలరించిన మరో క్యూట్‌గాళ్ షాజన్ పదంసి. తన క్యూట్ లుక్స్‌తో అందర్నీ అలరించిన ఈ తార ఎన్నో ఆశలతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. కానీ తొలి చిత్రం ఊహించని షాక్ ఇవ్వడంతో పదంసి నిరాశపడినా... ‘ఆరెంజ్’ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఓరచూపులను ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేకపోతున్నారు. సరైన సినిమా ఒకటి పడితే టాలీవుడ్‌లో షాజన్ కెరీర్‌కు ఢోకా వుండదనే కామెంట్స్ అప్పట్లో వినిపించినప్పటికీ తెలుగులో ఇంకో అవకాశం ఇప్పటి దాకా రాలేదు ఈ తారకి. ఇదే విషయాన్ని షాజన్ పదంసి ముందు ప్రస్తావించినప్పుడు- ‘‘ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా వున్నాను. తెలుగు నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ నాకు నచ్చిన కథలు, పాత్రలు ఇప్పటి వరకు ఎవ్వరూ నా దగ్గరికి తీసుకు రాలేదు. హిందీ సినిమాల నుంచి ఖాళీ దొరికినప్పుడు తెలుగు సినిమాల గురించి ఆలోచిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ఎక్స్‌పోజింగ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించినప్పుడు- ‘‘ఎక్స్‌పోజింగ్ విషయంలో నాకు ఎలాంటి నిబంధనలు లేవు. లిప్‌కిస్ నుంచీ టూ పీస్ బికినీ వరకూ, ఆ మాటకొస్తే సెమీ న్యూడ్.. కూడా నటనలో భాగమే కదా. కమర్షియల్ యాంగిల్ కోసమైతే నేను ఒప్పుకోను కానీ, సినిమాలో సన్నివేశం డిమాండ్ చేస్తే అభ్యంతరం లేదు’’ అని ముక్కుసూటిగా చెప్పారు షాజన్. సో.. ఎటువంటి ఎక్స్‌పోజింగ్‌కైనా సిద్ధమని చెప్పిన షాజన్‌కు త్వరలో తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని ఆశిద్దాం.

Monday, January 10, 2011

చొక్కా విప్పను

చొక్కా విప్పను

న హీరోల చేత చొక్కాలు విప్పించి సిక్స్‌ప్యాక్‌లు చూపించాలని మా తమ్ముడు శిరీష్‌ ఆరాటపడుతున్నాడు. శ్రియ కూడా 'నువ్‌ చొక్కా విప్పితే బాగుంటావు..' అంటోంది. అయితే నేను మాత్రం చొక్కా విప్పను'' అన్నారు యువ కథానాయకుడు అల్లు అర్జున్‌. ఆయన ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సౌత్‌స్కోప్‌ 2011 క్యాలెండర్‌ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ''మన దక్షిణాది సినిమాల స్థాయిని చూపించడానికి సౌత్‌స్కోప్‌ ఒక వేదికగా నిలవడం సంతోషంగా ఉంద''న్నారు. ''ఇలాంటి క్యాలెండర్‌లో సాధారణంగా అమ్మాయిలకే చోటుంటుంది. ఈసారి మాలాంటి హీరోలకూ స్థానం దక్కడం ఆనందంగా ఉంద''న్నారు నాగచైతన్య. ఈ కార్యక్రమంలో శ్రియ, శ్రుతి హాసన్‌, రానా, అల్లు శిరీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

వస్తే... వదులుకోను

వస్తే... వదులుకోను

సినిమాలో నాయిక స్థానాన్ని నిర్ణయించేవి వాణిజ్య అంశాలే. సినిమా అంటే కచ్చితంగా కొన్ని పాటలు, మసాలా సన్నివేశాలు ఉండాలి కాబట్టే... నాయికకి చోటు దక్కుతోంది. ఇవి లేకుండా నాయికని చూళ్లేమా..?! ఈ పరిధుల్ని దాటుకొని నాయిక బయటకు రాలేదా? ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడూ కొంత మంది భామల్ని వేధిస్తుంటాయి. ప్రియమణి కూడా ప్రస్తుతం వీటికి సమాధానాలను అన్వేషిస్తోంది. ''ఎప్పుడూ పాటలకే పరిమితం కావడం నాక్కూడా నచ్చడం లేదు. అయితే 2010లో కొన్ని మంచి పాత్రలు చేశాను. 'గోలీమార్‌'లో చాలా సహజంగా నటించడానికి ప్రయత్నించాను. 'రావణ్‌', 'రక్తచరిత్ర'లో మేకప్‌ అవసరం లేని పాత్రలు పోషించాను. 'రగడ'లోనూ భిన్నమైన పాత్రే. అయితే పూర్తిస్థాయిలో ప్రతినాయిక లక్షణాలున్న పాత్రలో కనిపించాలని ఆశగా ఉంది. అదెలా ఉండాలంటే నరసింహలో రమ్యకృష్ణ చేసిన పాత్రలా ఉండాలి. ఓ నటిగా నా సత్తా ఏమిటో అలాంటి పాత్రల్లోనే తెలుస్తుంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను. అయితే ప్రియమణి మారిపోయింది... గ్లామర్‌ వదిలేసింది.. అని అనుకోవద్దు. అవి మామూలే..'' అని చెప్పుకొచ్చింది.

Sunday, January 9, 2011

ప్రభు దేవా, నయనతారల వివాహ వేదిక?

ప్రభు దేవా, నయనతారల వివాహ వేదిక?


సంచలన ప్రేమ జంట ప్రభుదేవా, నయనతారల వివాహానికి చెన్నై వేదిక కానుంది. విల్లు చిత్రం షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ మొలకెత్తింది. వీరి ప్రేమను ప్రభుదేవా భార్య రమలత్ వ్యతిరేకించినా చివరకు విడాకులకు సమ్మతించారు. దీంతో ప్రభుదేవా, నయనతారల వివాహానికి ఆటంకం తొలగింది. దీంతో వీరు వివాహం చేసుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. వివాహాన్ని హైదరాబాద్‌లో జరుపుకోవాలని ప్రభుదేవా నిర్ణయించారు. అయితే చెన్నైలోనే చేసుకోవాలని నయన పట్టుబట్టడంతో చెన్నై చేసుకోనున్నట్లు సమాచారం. పెళ్లి జూలైలో జరగనుందని వినికిడి. ఈ లోపు నయనతార ఇప్పటి వరకు ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తరువాత నటించేది లేనిది ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

మాల్యా ముందే సిద్ధార్థ్‌‌కు "కిస్" ఇచ్చిన దీపికా పదుకొనే!

మాల్యా ముందే సిద్ధార్థ్‌‌కు "కిస్" ఇచ్చిన దీపికా పదుకొనే! 


ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్య కుమారుడు సిద్ధార్థ్.. రొమాన్స్‌లో తన తండ్రిని మించిపోయాడు. అంతే కాదు.. అందమైన అమ్మాయిలను ఎలా బుట్టలో వేసుకోవాలో కూడా సీనియర్ మాల్యాకు ఈ జూనియర్ మాల్యా పాఠాలు నేర్పే అవకాశం ఉంది.బాలీవుడ్ సెక్సీ స్టార్ దీపికా పదుకునేతో ప్రేమాయణం సాగిస్తున్న సిద్ధార్థ్.. ఆమె అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అయితే.. దీపికా కూడా సిద్ధార్థ ఊహించని గిఫ్ట్ ఇచ్చిందనుకోండి. 16 కోట్ల విలువ చేసే ఓ హైటెక్ అపార్ట్‌మెంట్‌ను దీపికాకు సిద్ధార్థ బహుమతిగా ఇచ్చాడట.సిద్ధార్థ్ ఇచ్చిన పాష్ గిఫ్ట్‌కు దీపికా కూడా ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. జనవరి 5న దీపికా పుట్టినరోజు కావడంతో ఆమెను సిద్ధార్థ్ జనవరి ఒకటోతేదీన డెన్మార్క్‌లోని కోపెన్హగెన్‌కు తీసుకువెళ్లాడు. దీంతో దీపికా షాక్ గురై ఆశ్చర్యం.. ఆనందాలలో మునిగిపోయింది. ఎందుకంటే అది తాను పుట్టిన ప్రదేశమట. దీంతో ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ మాల్యాకు సీనియర్ మాల్యా చూస్తుండగానే... "ఉమ్మా" ఇచ్చేసిందిట. 

Friday, January 7, 2011

అవన్నీ గాలి వార్తలు

అవన్నీ గాలి వార్తలు 


నేను ఇలాగే వుండాలని నా అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ళకు నచ్చని విధంగా మారాలనే ఆలోచన నాలో లేదు’’ అంటున్నారు అందాల తార నమిత. అసలు ఈ తార ఏ విషయంలో అలా మాట్లాడాల్సి వచ్చిందోననే కదా మీ సందేహం... నేటి తరం కథానాయికల్లో నమిత కాస్త ముద్దుగా, బొద్దుగా వుంటారు. ఈ విషయంపైనే ఆమెతో ‘అందరూ జీరో సైజ్ ట్రెండ్‌కు పరిగెడుతుంటే మీరు మాత్రం ఇలా బొద్దుగా తయారవుతున్నారు ? బొద్దుగా వుండటం వల్ల మీకేమీ సమస్యలు రావటం లేదా’ అని ప్రశ్నించినప్పుడు ఆమె బదులిస్తూ- ‘‘ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేమీ నా దరి చేరవు. భారీగా ఒళ్ళు చేసిన నాకు ఈ విషయంలో మినహాయింపు వుంటుంది. ఎందుకంటే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేస్తుంటాను. అయినా భారీతనంగా వుండటం అనేది నా శరీరతత్వం మాత్రమే. అయినా నేను రెగ్యులర్‌గా డాన్స్‌లు, స్విమ్మింగ్ చేస్తుంటాను. ఎప్పటికప్పుడూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాను. ఆరోగ్యం పట్ల నేను చాలా జాగ్రత్తగా వుంటాను. భారీతనం కారణంగా ఆ మధ్య నేను ఒక వారం రోజుల పాటు హాస్పటల్‌లో వున్నానని గాలివార్తలు సృష్టించారు కూడా. ఆ వార్తల్లో అస్సలు నిజం లేదు. అయినా లైపోసక్షన్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటే చిటికెలో సన్నబడిపోతాను. కానీ అంత అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను హెల్త్‌పరంగా చాలా ఫిట్‌గా వున్నాను. అంతేకాదు నన్ను అందరూ ఇలా చూడటానికే ఇష్టపడుతున్నప్పుడు నేను ఎందుకు తగ్గాలి’’ అంటూ చెప్పుకొచ్చారు సూరత్ సుందరి నమిత.

తాప్సీ నా చెల్లెలు లాంటిది

తాప్సీ నా చెల్లెలు లాంటిది


తెల్లపిల్ల తాప్సీ గురించి మోహన్ బాబు తనయుడు మంచు విష్ణును అభిప్రాయం అడిగితే అవాక్కయ్యే సమాధానం ఇచ్చేశాడు. తాప్సీ తన సొంత చెల్లెలు లాంటిదని చెప్పాడు. విష్ణు చెప్పిన మాటలు విని అక్కడివారంతా ముక్కున వేలేసుకున్నారట. వస్తాడు నా రాజు చిత్రంలో తాప్సీతో వేడి వేడి సన్నివేశాల్లో నటించడమే కాక వేడి ముద్దులు కురిపించిన మంచు విష్ణు, తాప్సీని తన చెల్లెలితో పోల్చడం ఏమిటని వింతగా చూశారట. కానీ వారి మాటలేమీ పట్టించుకోని విష్ణు... తాప్సీ తమ కుటుంబంతో బాగా కలిసిపోయిందనీ, తన మటుకు తాను ఆమెను చెల్లెల్లా ట్రీట్ చేస్తానని చెప్పేశాడు. మరి తమ్ముడు మంచు మనోజ్ ఎటువంటి బంధం ఉందని చెపుతాడో...? 

Thursday, January 6, 2011

'రోబో'ని అధిగమించాలి

'రోబో'ని అధిగమించాలి

షారుఖ్‌ఖాన్‌ నిత్యం 'రోబో' గురించి తలచుకొంటూనే ఉన్నారు. ఇప్పుడాయన లక్ష్యం ఒక్కటే రజనీకాంత్‌ చిత్రాన్ని మించేలా తన 'రా.వన్‌'ని తీర్చిదిద్దాలి. అయితే 'రోబో'తో పోలికలు తీసుకువస్తారనే భయం షారుఖ్‌కి ఉందని బాలీవుడ్‌ చిత్రవర్గాలు చెబుతున్నాయి. అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో 'రా.వన్‌' రూపొందుతోంది. ఈ సినిమాని రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ద్వారా షారుఖ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ.150కోట్లు పైగానే ఉంటుందని ఓ అంచనా. ఇటీవలే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 'రోబో'లో చిట్టి పాత్రను మైమరపించేలా తమ జి.వన్‌ ఉంటాడని మాత్రం చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కథ ఇది. తొలి భారతీయ సూపర్‌మేన్‌ సినిమాగా 'రా.వన్‌' నిలుస్తుందని షారుఖ్‌ గతంలోనే వెల్లడించారు. ''ఇది ప్రధానంగా చిన్నారి ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాను. వారినే కాదు అన్ని వయసులవాళ్లకీ ఈ కథ నచ్చుతుంది. మన సూపర్‌మేన్‌ ఎలా ఉంటాడో ప్రపంచదేశాలకు చూపించబోతున్నాం'' అని ఆయన చెబుతున్నారు. సాంకేతికంగా అత్యున్నత విలువలతో ఇది తెరకెక్కుతోంది. లండన్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రించారు. ఈ సినిమా కథ, కథనాల విషయంలో తన స్నేహితుడు కరణ్‌ జోహర్‌ సలహాలు తీసుకున్నారు షారుఖ్‌. ఇందులో కరీనా కపూర్‌ కథానాయకిగా నటించింది. సంగీతం: ఇళయరాజా, విశాల్‌-శేఖర్‌.

దటీజ్‌ పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌!

దటీజ్‌ పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌! 


అసలే ఇండస్ట్రీ బంద్‌లో ఉంది. ఎప్పుడు షూటింగ్‌లు జరుగుతాయో తెలియని పరిస్థితి. హీరోల రెమ్యునరేషన్‌ తగ్గించుకునేలా నిర్మాతలు వారికి ఎలా చెప్పాలని కిందామీద పడుతున్నారు. హీరోలకు ఎడాపెడా రెమ్యునరేషన్‌ పెంచేసింది నిర్మాతలే అనేది నగ్నసత్యం. ఇటువంటి స్థితిలో హీరోలు కూడా ఓ మెట్టు దిగి వచ్చే స్థితిలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరికొంతమంది హీరోలు డిమాండ్‌ సప్లయి మీద ఆధారపడి ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఇటీవలే ఓ ఉదంతం జరిగింది. ఓ నిర్మాత పవన్‌కళ్యాణ్‌ వద్దకు వెళ్ళి తాను 7కోట్లు ఇస్తానని డేట్స్‌ కావాలని అడిగాడట. దీంతో పవన్‌కళ్యాణ్‌ సీరియస్‌ అయి... ఇంత బంద్‌ జరుగుతున్నా నా దగ్గరకువచ్చి మీరిలా అడగడం భావ్యంకాదని కాస్త సున్నితంగా మందలించారట. దీంతో మరొకరితో ఫోన్‌చేయించినా ఫలితం లేకపోయింది. 

Wednesday, January 5, 2011

నేను ఏంజెలీనా కాను

నేను ఏంజెలీనా కాను


లానా తరహా పాత్రలైతే చేస్తాను.. అనే షరతులు పెట్టడం నాకు ఇష్టం లేదు' అని చెబుతోంది సమంత. 'ఏ మాయ చేసావె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ 'దూకుడు'గానే ఉంది. ఎన్టీఆర్‌తో 'బృందావనం'లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు మహేష్‌తో 'దూకుడు'లో నటిస్తోంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి రూపొందిస్తున్న 'ఈగ'తో పాటు.. గౌతమ్‌ మీనన్‌ 'ఎర్రగులాబీలు'లో కూడా మెరవబోతోది. సమంత మాట్లాడుతూ ''అన్ని రకాల పాత్రలు పోషించాలని ఉంది. అలాగని మరీ ఏంజెలీనా జోలీ 'టాంబ్‌ రైడర్‌'లో పోషించిన పాత్ర అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే అందులో యాక్షన్‌ సన్నివేశాలు మామూలుగా ఉండవు. వావ్‌ఁ అనిపిస్తాయి. నేనేమీ ఏంజెలీనా జోలీని కాను కదా. ప్రయత్న లోపం లేకుండా కష్టపడే మనస్తత్వం నాది. విభిన్నమైన పాత్రల్ని పోషించి మరింత పేరు సంపాదించాలి'' అని మనసులోని కోరికను బయటపెట్టింది.

టెక్కులు తెలియవు!

టెక్కులు తెలియవు!


నాయికలు తెరపైనే అందంగా కనిపిస్తారు. బయట అంత బాగుండరట. మేకప్‌ లేకుంటే వాళ్లూ మనలాగే ఉంటారు. సినిమా తారలు జనంలోకి వచ్చినప్పుడు టెక్కు చూపిస్తారట - మన కథానాయికల గురించి జనసామాన్యం ఇలాగే మాట్లాడుకొంటూ ఉంటారు. ''అందరి విషయంలోనూ ఆ మాటలు నిజం కాకపోవచ్చు. నా వరకూ నేను చాలా సాదాసీదాగా ఉంటాను'' అంటోంది జెనీలియా. ''కెమెరా ముందు ఉన్నంతసేపే నటిని అనే భావన ఎప్పుడూ నాలో ఉంటుంది. నేనేదో పెద్ద స్టార్‌నని టెక్కుగా ఉండటం, లేనీపోని అహంభావాన్ని ప్రదర్శించడం నాకు చేతకావు. చాలా చిత్రాల్లో నావి అల్లరిపిల్ల పాత్రలే. నిజ జీవితంలోనూ నేను అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ, సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. ఈ పద్ధతి నాకు క్రీడారంగం వల్లే అలవడింది. నేను చదువుకొనే రోజుల్లో పలు ఆటలపోటీలకు వెళ్లాను. అప్పుడు అందరం కలిసిమెలసి ఉండటం, సర్దుకుపోవడం జరిగేది. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు. ఎప్పటికీ పోదు'' అని చెప్పుకొచ్చింది. 

Tuesday, January 4, 2011

నేను మొదటిసారి ఏడ్చింది అప్పుడే

నేను మొదటిసారి ఏడ్చింది అప్పుడే


నాకు ఇష్టమైన అంకె ‘ఒకటి’. ఏ రంగంలో ఉన్నా... నంబర్‌వన్‌గా ఉండటానికే ఇష్టపడతా. ఆ స్థానం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ఈ స్థాయికి చేరుకునే క్రమంలో నాకు ఎదురైన పరిస్థితులను తెలియజేయాలంటే... ఓ పుస్తకాన్ని రాయొచ్చు’’ అంటున్నారు విశ్వసుందరి ఐశ్వర్యరాయ్. తన మనోగతాన్ని వ్యక్తపరుస్తూ ఇటీవల ఐష్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ -‘‘మా స్కూల్ పేరు ‘ఆర్య విద్యాభవన్’. టెన్త్ క్లాస్ దాకా అక్కడే చదివాను. నైన్త్ క్లాస్ వరకూ మా స్కూల్లో నేనే ఫస్ట్. అందుకే టీచర్లందరూ నన్నెంతో ప్రేమగా చూసేవారు. అప్పట్నుంచే ‘నంబర్‌వన్’ అంటే నాకిష్టం. కానీ టెన్త్ క్లాస్‌లో మాత్రం నాకు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే నేను... టెన్త్‌లో మాత్రం ఏడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో మానసికంగా కృంగిపోయాను. నా లైఫ్‌లో కన్నీరు పెట్టుకున్న తొలి సందర్భమది. తర్వాత ఇంటర్‌లో ‘రెండవ’ స్థానానికి పరిమితమయ్యా. అప్పుడు కూడా చాలా బాధ కలిగింది. తర్వాత మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నా. అందరూ కిరీటం తప్పకుండా నాదే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సుస్మితాసేన్ మిస్ ఇండియాగా ఎంపికయ్యారు. ఇలా వరుసగా తగిలిన దెబ్బలు నాలో కసిని పెంచాయి. అలాగే నంబర్‌వన్ అనే స్థానంపై ఇష్టాన్ని కూడా పెంచాయి. అదే కసితో మిస్‌వరల్డ్‌లో పోటీల్లో పాల్గొన్నాను. అందరినీ అధిగమించి, నంబర్‌వన్‌గా నిలబడగలిగాను. ఇప్పుడు కూడా బాలీవుడ్‌లో నంబర్‌వన్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ అని ఎవరయినా అంటే... నాకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది’’ అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య.

గోవాలో నిశ్చితార్థం!

గోవాలో నిశ్చితార్థం!


పస్తుతం బాలీవుడ్ వార్తల్లో నిలుస్తున్న జంటల్లో షాహిద్ కపూర్, ప్రియాంక చోప్రా జంట ఒకటి. ఈ ప్రేమికులు కొత్త సంవత్సరాన్ని గోవాలో జరుపుకున్నారట. నూతన సంవత్సరం తొలి రోజుని ఎప్పటికీ గుర్తుంచుకునేలా గడపాలనుకున్న ఈ జంట ‘ఉంగరాలు’ మార్చుకున్నారని వినికిడి. ఈ ఉంగరాల మార్పిడి వ్యవహారాన్ని ఈ జంట రహస్యంగా ఉంచాలనుకున్నారు. కానీ గోవా తీరం దాటి ముంబయ్‌కి చేరిపోయింది. ఇంకేముంది? ఇది కచ్చితంగా వివాహ నిశ్చితార్థమే అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షాహిద్, ప్రియాంకలు ఖండించడంలేదు. దాంతో మౌనం అర్ధాంగీకారం అని చెప్పుకుంటున్నారు. 

Monday, January 3, 2011

మగాళ్లు నా ఎద సౌందర్యం గురించే మాట్లాడుతారు

మగాళ్లు నా ఎద సౌందర్యం గురించే మాట్లాడుతారు


బాలీవుడ్ సెక్సీ సైరన్ మల్లికా శరావత్ బోల్డ్‌గా మాట్లాడటం మామూలే. తాజాగా మరో వ్యాఖ్య చేసి వార్తలకెక్కింది. మగాళ్లంతా తన ఎద సౌందర్యాన్ని గురించి మాట్లాడుకోవడం తను చాలా సందర్భాల్లో గమనించానని చెపుతోంది. వారలా మాట్లాడుకోవడంపై తను ఏమీ అనుకోననీ, అందంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని ఆ మగాళ్లను వెనకేసుకొస్తోంది. హిస్ చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లాపడటంతో విచారంగా ఉన్న సెక్సిణి మల్లికను తాజాగా మరో బిగ్ ఆఫర్ వరించిందిట. ఆ చిత్రంలో అందాలను బాగా ప్రదర్శించగలిగే పాత్ర దొరికిందట. అందువల్లనో ఏమో గానీ ఇప్పటి నుంచే మగాళ్లు - తన ఎద సౌందర్యపు అందాలు... అంశంపై బాకా ఊదటం మొదలెట్టింది.

పంచుకొంటే తప్పేంటి?

పంచుకొంటే తప్పేంటి?


థానాయికలకి ప్రాంతీయ భాషల్లో ఎన్ని అవకాశాలొచ్చినా... చూపు ఎప్పుడూ బాలీవుడ్‌ వైపే ఉంటుంది. ఇక్కడ స్టార్‌గా వెలిగిపోతున్నా... అక్కడ ద్వితీయ నాయిక అన్నా ఆనందపడతారు. ఇప్పుడు ఇలియానా కూడా హిందీ కలలే కంటోంది. 'బర్ఫీ' సినిమాలో రణబీర్‌ కపూర్‌తో ఆడిపాడబోతోంది. అయితే అక్కడ దక్కింది రెండో నాయిక పాత్రే. 'అయితే ఏంటి? రెండో నాయిక అయినా... నాదీ మంచి పాత్రే. ప్రియాంకా చోప్రాతో కలసి నటించే అవకాశం రావడం అంటే మాటలా..?' అంటూ సంతోషంగా చెబుతోంది. 'ఇద్దరు నాయికల సినిమాలు బాలీవుడ్‌లో సాధారణమే. అయినా నాయిక స్థానాన్ని మరొకరితో పంచుకోవడం నామోషీగా భావించను. ఈ సినిమాలో రెండు పాత్రలూ ప్రత్యేకమైనవే. ప్రియాంక అనుభవం నాక్కూడా పనికొస్తుంది. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. అందుకు ఈ సినిమా ఓ అవకాశంలా భావిస్తాను' అని సర్దిచెప్పుకొంటోంది.