Wednesday, January 19, 2011

ఆ విషయం నాన్నకు చెప్పేస్తా

ఆ విషయం నాన్నకు చెప్పేస్తా


అనగనగా... ఓ ధీరుడు’ ప్రచార చిత్రాల్లోని శ్రుతిహాసన్ని చూస్తుంటే యువ రాణిలా .... షేక్స్పియర్ కథల్లోని కావ్యనాయిక గుర్తొస్తోంది. ఈ సినిమాతో శ్రుతి టాప్ హీరోయిన్ కావడం ఖాయమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇదిలా వుండగా ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సిద్దార్థ్తో తన బంధం బలపడిందని వస్తున్న పలు వార్తలపై శ్రుతి స్పందిస్తూ- ‘‘అవన్నీ ఊహాగానాలు మాత్రమే. సిద్దార్థ్ మంచి నటుడు. ఒక నటిగా తనతో చేయడం సవాల్గా తీసుకున్నాను. ఇందులో నా పాత్ర పేరు ప్రియ. ఈ పాత్ర పోషణలో సిద్దార్థ్ సహకారం మరచిపోలేను. తోటి కళాకారుడిగా అతణ్ని గౌరవిస్తాను. అంతవరకే. మా నాన్నకు నాపై ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మాత్రం నేను ఎప్పుడూ వమ్ము కానీయను. నేను బికినీ ధరించినా, హీరోలతో క్లోజ్గా మూవ్ అయినా... అవన్నీ పాత్రల్లో భాగాలు మాత్రమే. బయట నేను అందరి లాంటి అమ్మాయినే. ఒకవేళ నేను ఎవర్నయినా ఇష్టపడితే... మరో ఆలోచన చేయకుండా డెరైక్ట్గా నా అభిప్రాయాన్ని నాన్నకు చెప్పేస్తాను. ప్రస్తుతం అటు దక్షిణాదిన, ఇటు ఉత్తరాదిన లెక్కకు మించిన అవకాశాలు నన్ను వరిస్తున్నాయి. వాటిల్లో ఏ సినిమా చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాను. ఈ బిజీలో ఇక ప్రేమకు సమయం ఎక్కడుంటుంది చెప్పండి..?’’ అని అన్నారు శ్రుతి. 

No comments:

Post a Comment