Monday, January 10, 2011

వస్తే... వదులుకోను

వస్తే... వదులుకోను

సినిమాలో నాయిక స్థానాన్ని నిర్ణయించేవి వాణిజ్య అంశాలే. సినిమా అంటే కచ్చితంగా కొన్ని పాటలు, మసాలా సన్నివేశాలు ఉండాలి కాబట్టే... నాయికకి చోటు దక్కుతోంది. ఇవి లేకుండా నాయికని చూళ్లేమా..?! ఈ పరిధుల్ని దాటుకొని నాయిక బయటకు రాలేదా? ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడూ కొంత మంది భామల్ని వేధిస్తుంటాయి. ప్రియమణి కూడా ప్రస్తుతం వీటికి సమాధానాలను అన్వేషిస్తోంది. ''ఎప్పుడూ పాటలకే పరిమితం కావడం నాక్కూడా నచ్చడం లేదు. అయితే 2010లో కొన్ని మంచి పాత్రలు చేశాను. 'గోలీమార్‌'లో చాలా సహజంగా నటించడానికి ప్రయత్నించాను. 'రావణ్‌', 'రక్తచరిత్ర'లో మేకప్‌ అవసరం లేని పాత్రలు పోషించాను. 'రగడ'లోనూ భిన్నమైన పాత్రే. అయితే పూర్తిస్థాయిలో ప్రతినాయిక లక్షణాలున్న పాత్రలో కనిపించాలని ఆశగా ఉంది. అదెలా ఉండాలంటే నరసింహలో రమ్యకృష్ణ చేసిన పాత్రలా ఉండాలి. ఓ నటిగా నా సత్తా ఏమిటో అలాంటి పాత్రల్లోనే తెలుస్తుంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను. అయితే ప్రియమణి మారిపోయింది... గ్లామర్‌ వదిలేసింది.. అని అనుకోవద్దు. అవి మామూలే..'' అని చెప్పుకొచ్చింది.

No comments:

Post a Comment