Tuesday, January 11, 2011

అవన్నీ చెప్పుకోకూడదు

అవన్నీ చెప్పుకోకూడదు


2010లో మీరు సాధించింది ఏమిటి? అని అడిగితే హన్సిక తెల్లమొహం వేస్తోంది. ఆ వెంటనే తేరుకొని 'జీవితం అంటే సినిమాలు ఒక్కటేనా.. ఇంకా చాలానే ఉన్నాయి..' అంటూ సమాధానం దాటేస్తోంది. 'తెలుగులో అంతగా అవకాశాలు రానిమాట నిజం. కానీ తమిళంలో మంచి గుర్తింపు సాధించాను. అక్కడ నాకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను. ఆ విధంగా గతేడాది నాకు గుర్తుండిపోతుంది' అంటోంది. 'తప్పులు చేయడం సహజం. నేను కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకొన్నాను. అవన్నీ చెప్పకూడదు. అయితే మళ్లీ పునరావృతం చేయను. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు ఒప్పుకొన్నాను. తప్పకుండా నాకు గుర్తింపు తెచ్చిపెడతాయి. ఆ సినిమాల సంగతి దర్శక నిర్మాతలే చెబుతారు' అంది. అయితే హన్సిక కేవలం పెద్ద స్టార్లూ... పెద్ద దర్శకుల సినిమాలకే పరిమితం కాదట. 'కథ నచ్చితే- ఎవరి దర్శకత్వంలో అయినా నటించడానికి ఒప్పుకొంటాను. హీరో ఎవరు? అనే విషయానికి కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వను..' అని చెబుతోంది. 2010 నేర్పిన పాఠం ఇదేనా?!  

No comments:

Post a Comment