Friday, January 7, 2011

అవన్నీ గాలి వార్తలు

అవన్నీ గాలి వార్తలు 


నేను ఇలాగే వుండాలని నా అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ళకు నచ్చని విధంగా మారాలనే ఆలోచన నాలో లేదు’’ అంటున్నారు అందాల తార నమిత. అసలు ఈ తార ఏ విషయంలో అలా మాట్లాడాల్సి వచ్చిందోననే కదా మీ సందేహం... నేటి తరం కథానాయికల్లో నమిత కాస్త ముద్దుగా, బొద్దుగా వుంటారు. ఈ విషయంపైనే ఆమెతో ‘అందరూ జీరో సైజ్ ట్రెండ్‌కు పరిగెడుతుంటే మీరు మాత్రం ఇలా బొద్దుగా తయారవుతున్నారు ? బొద్దుగా వుండటం వల్ల మీకేమీ సమస్యలు రావటం లేదా’ అని ప్రశ్నించినప్పుడు ఆమె బదులిస్తూ- ‘‘ఊబకాయం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేమీ నా దరి చేరవు. భారీగా ఒళ్ళు చేసిన నాకు ఈ విషయంలో మినహాయింపు వుంటుంది. ఎందుకంటే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేస్తుంటాను. అయినా భారీతనంగా వుండటం అనేది నా శరీరతత్వం మాత్రమే. అయినా నేను రెగ్యులర్‌గా డాన్స్‌లు, స్విమ్మింగ్ చేస్తుంటాను. ఎప్పటికప్పుడూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాను. ఆరోగ్యం పట్ల నేను చాలా జాగ్రత్తగా వుంటాను. భారీతనం కారణంగా ఆ మధ్య నేను ఒక వారం రోజుల పాటు హాస్పటల్‌లో వున్నానని గాలివార్తలు సృష్టించారు కూడా. ఆ వార్తల్లో అస్సలు నిజం లేదు. అయినా లైపోసక్షన్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటే చిటికెలో సన్నబడిపోతాను. కానీ అంత అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను హెల్త్‌పరంగా చాలా ఫిట్‌గా వున్నాను. అంతేకాదు నన్ను అందరూ ఇలా చూడటానికే ఇష్టపడుతున్నప్పుడు నేను ఎందుకు తగ్గాలి’’ అంటూ చెప్పుకొచ్చారు సూరత్ సుందరి నమిత.

No comments:

Post a Comment