Wednesday, January 12, 2011

అతని బుద్ధి మారదు

అతని బుద్ధి మారదు


న మాజీ ప్రేయసిలకు ఝలక్ ఇవ్వడానికి కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏ మాత్రం మొహమాటపడరు. ఇటీవల ఆయన నోటి దురుసుతనానికి సల్మాన్ మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ బలయ్యారు. ఈ మధ్య జరిగిన 17వ వార్షికోత్సవ స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుకలో కత్రినా కైఫ్ ‘బెస్ట్ పాపులర్’ అవార్డ్ గెల్చుకున్నారు. ఈ వేదికపై ఆమె అద్భుతంగా నర్తించారు కూడా. అనంతరం ఇంటి దారి పట్టడానికి బయటికొచ్చిన కత్రినాకు సల్మాన్ తారసపడ్డారు. తన వాన్ డోర్ తెరచుకుని స్టయిల్‌గా కూర్చుని ఉన్న సల్మాన్ మాజీ ప్రేయసిని చూడగానే ఆత్మీయంగా నవ్వారట. ఆ నవ్వు వెనకాల ఏదైనా కుట్ర ఉంటుందని ఊహించని కత్రినా తను కూడా ఓ చిరునవ్వు విసిరారు. సల్మాన్ రెండు చేతులు చాచడంతో కత్రినా ఆయన ఆత్మీయ కౌగిలిలో ఒదిగిపోయారట కూడా. ఆ తర్వాత ఆమె బుగ్గలను సల్మాన్ ముద్దాడటం చాలామందిని షాక్‌కు గురి చేసింది. తాము ఉన్నది బహిరంగ ప్రదేశంలో అన్న స్పృహ కూడా లేకుండా సల్మాన్ అలా చేయడం, కత్రినా కూడా ఆయన సాన్నిహిత్యాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించడం చూసి.. మళ్లీ వీళ్లిద్దరూ ఒకటవ్వడం ఖాయం అనే ఊహలకు తావిచ్చింది. ఈ సీన్ తర్వాత సల్మాన్‌కు టాటా చెప్పి కత్రినా తన వాహనం వైపు అడుగులు వేశారట. మూడు, నాలుగు అడుగులు వేసిన తర్వాత ‘‘ఇప్పుడు నువ్వెవరితో ఉంటున్నావ్?’’ అని సల్మాన్ నోటి నుంచి వచ్చిన మాటలకు కంగు తిని కత్రినా వెనక్కి తిరిగి చూశారని సమాచారం. వెంటనే సల్మాన్ తన బాడీగార్డ్‌ని చూస్తూ ‘‘ఇప్పుడు నువ్వెవరితో ఉంటున్నావ్?’’ అని అడిగారట. ఆ రకంగా ఆ ప్రశ్న కత్రినాని ఉద్దేశించి అడగలేదని సల్మాన్ స్పష్టం చేయబోయారు. కానీ కత్రినా ఏమైనా అమాయకురాలా ఏంటి? ఆ ప్రశ్న తనని ఉద్దేశించే సల్మాన్ అడిగారని అర్థం చేసుకుని మొహం కందగడ్డలా పెట్టుకుని.. అతని బుద్ధి మారదు అనుకుని హడావిడిగా తన వాహనంలోకి ఎక్కారట. తన మాజీ ప్రేయసి మనసు గాయపడిందని తెలుసుకుని సల్మాన్ అక్కడ్నుంచి ఆనందంగా నిష్ర్కమించారని సమాచారం. దీన్నిబట్టి సల్మాన్‌లో ఏ రేంజ్‌లో పైశాచికత్వం ఉందో ఊహించవచ్చు.

No comments:

Post a Comment