అతనితో స్నేహం అపూర్వం
ప్రస్తుతం దీపికాపదుకొనే కోపెన్‌హగన్‌లో ఉన్నారు. షూటింగ్ నిమిత్తం ఆమె అక్కడున్నారు అనుకుంటే పొరపాటే. తన ‘ప్రియ’మిత్రుడు సిద్దార్థ్‌మాల్యాతో ఆమె అక్కడ ఎంజాయ్ చేస్తున్నారట. వారితో పాటు దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే కూడా అక్కడున్నారట. ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా, బాహాటంగా చెప్పే దీపికా... తన ప్రేమ వ్యవహారం గురించి ఇటీవల మాట్లాడుతూ -‘‘సిద్దార్థ్‌తో నా స్నేహం ప్రస్తుతం డేటింగ్ దాకా వచ్చింది. అక్కడ్నుంచి ఇంకెంత దూరం వెళుతుందో నేను చెప్పలేను. తన స్నేహంలో అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నాను’’ అన్నారు. ‘‘ఇంకెంత దూరం వెళుతుందో...’’ అంటే అర్థం ఏంటో తెలుసుకోవచ్చా...? అని దీపికను అడిగితే- ‘‘నేను ఏం మాట్లాడినా... పెడర్థం తీస్తే ఎలా. ఇంకెంత దూరం వెళుతుందో... అంటే.. పెళ్లి దాకా అని అర్థం’’ అని చెప్పారు. ఈ మాటలు విన్న బాలీవుడ్ జనాలు దీపిక, సిద్దార్థ్‌ల వివాహం త్వరలో జరగడం ఖాయం అని చెవులు కొరుక్కుంటున్నారు.
No comments:
Post a Comment