'రోబో'ని అధిగమించాలి
షారుఖ్‌ఖాన్ నిత్యం 'రోబో' గురించి తలచుకొంటూనే ఉన్నారు. ఇప్పుడాయన లక్ష్యం ఒక్కటే రజనీకాంత్ చిత్రాన్ని మించేలా తన 'రా.వన్'ని తీర్చిదిద్దాలి. అయితే 'రోబో'తో పోలికలు తీసుకువస్తారనే భయం షారుఖ్‌కి ఉందని బాలీవుడ్ చిత్రవర్గాలు చెబుతున్నాయి. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో 'రా.వన్' రూపొందుతోంది. ఈ సినిమాని రెడ్‌చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ద్వారా షారుఖ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం రూ.150కోట్లు పైగానే ఉంటుందని ఓ అంచనా. ఇటీవలే ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. 'రోబో'లో చిట్టి పాత్రను మైమరపించేలా తమ జి.వన్ ఉంటాడని మాత్రం చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కథ ఇది. తొలి భారతీయ సూపర్‌మేన్ సినిమాగా 'రా.వన్' నిలుస్తుందని షారుఖ్ గతంలోనే వెల్లడించారు. ''ఇది ప్రధానంగా చిన్నారి ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాను. వారినే కాదు అన్ని వయసులవాళ్లకీ ఈ కథ నచ్చుతుంది. మన సూపర్‌మేన్ ఎలా ఉంటాడో ప్రపంచదేశాలకు చూపించబోతున్నాం'' అని ఆయన చెబుతున్నారు. సాంకేతికంగా అత్యున్నత విలువలతో ఇది తెరకెక్కుతోంది. లండన్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రించారు. ఈ సినిమా కథ, కథనాల విషయంలో తన స్నేహితుడు కరణ్ జోహర్ సలహాలు తీసుకున్నారు షారుఖ్. ఇందులో కరీనా కపూర్ కథానాయకిగా నటించింది. సంగీతం: ఇళయరాజా, విశాల్-శేఖర్.
No comments:
Post a Comment