Tuesday, January 25, 2011

పెళ్లయితే ఇంటికే పరిమితమవ్వాలా?

పెళ్లయితే ఇంటికే పరిమితమవ్వాలా?


పెళ్లయిన తర్వాత మగాళ్లు ఉద్యోగాలు మానుకుంటున్నారా? మరి ఆడవాళ్లు మాత్రం ఎందుకు మానాలి?’’ అంటున్నారు రవీనా టాండన్. దాదాపు ఆరేళ్ల క్రితం ఆమె పంపిణీదారుడు అనిల్ తడానీని వివాహం చేసుకున్నారు. కానీ సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు. ప్రస్తుతం ‘డాన్-2’ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. రవీనా ఇద్దరు బిడ్డల తల్లి కూడా. ఒకవైపు వారి ఆలనా పాలనా చూసుకుంటూనే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారామె. అలాగే ఈ మధ్య ర్యాంప్ వాక్స్ కూడా చేస్తున్నారు. ఇంటిపట్టున ఉండి బిడ్డల సంరక్షణ చూసుకోకుండా ఇంత బిజీగా ఉండటం అవసరమా? అని ఎవరో రవీనాని అడిగారట. ఆ సందర్భంగానే రవీనా కాస్తంత ఘాటుగా పై విధంగా స్పందించారు. ఆడవాళ్లకి కెరీర్ ఉండకూడదని భావించడం తప్పని, ఉద్యోగం చేయడంవల్ల మహిళలకు ఆత్మస్థయిర్యం మెండుగా ఉంటుందని కూడా ఆమె స్పష్టం చేశారు.


No comments:

Post a Comment