40లో చిలిపి చేష్టలు!
హిందీ హాస్య కథానాయకుడు గోవిందా నటిస్తున్న తాజా చిత్రం 'నాటీ ఎట్ 40'. ప్రస్తుతం గోవిందా వయసు 47 సంవత్సరాలు. 40 ఏళ్ల వ్యక్తిగా కనిపించడం కోసం దాదాపు 8 కేజీలు బరువు తగ్గారు. ఆయన సరసన యువికా చౌదరి, సయాలీ భగత్ నాయికలుగా నటిస్తున్నారు. గోవిందా మాట్లాడుతూ ''నా సరసన యువ నాయికలు నటిస్తున్నారు కదా. నేను కూడా కుర్రాడిలా కనిపించడం కోసం కష్టపడ్డాను. వ్యాయామాలు చేసి శరీర బరువును తగ్గించాను. యోగా కూడా నాకు ఉపయోగపడింద''న్నారు. జగ్‌మోహన్ ముంద్రా దర్శకత్వం వహిస్తున్నారు.
No comments:
Post a Comment