Monday, January 24, 2011

అభిషేక్‌తో నటించను!

అభిషేక్‌తో నటించను!


అందాల తార ఐశ్వర్య రాయ్‌ తాజాగా ఓ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదు. ఇంతకీ అందులో కథానాయకుడు ఎవరో తెలుసా..? స్వయానా ఆమె భర్త అభిషేక్‌ బచ్చన్‌. విపుల్‌ షా దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రమిది. దర్శకుడు విపుల్‌.. ఐష్‌కి కథ వినిపించి నటించమని కోరితే 'ఇందులో నేను నటించను. కత్రినా కైఫ్‌ను నాయికగా తీసుకొంటే బాగుంటుందేమో చూడండ'ని ఉచిత సలహా కూడా ఇచ్చిందట. గతంలోనూ 'దోస్తానా' సమయంలో ఆ సినిమాలో అభిషేక్‌తో కలిసి నటించమని దర్శకనిర్మాతలు కోరితే.. ఆమె తిరస్కరించింది. అదే జాబితాలో 'ఖేలే హమ్‌ జీ జాన్‌ సే', 'గేమ్‌' సినిమాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అభిషేక్‌ సరసన నటించడానికి ఐష్‌ ఎందుకు సుముఖంగా లేదో అర్థం కావడం లేదని బాలీవుడ్‌ జనాలు అనుకుంటున్నారు.  

No comments:

Post a Comment