Thursday, January 20, 2011

ధోనీ అవుట్ అయితే అప్‌సెట్

ధోనీ అవుట్ అయితే అప్‌సెట్


బాలీవుడ్‌లోకి ప్రవేశించిన తర్వాత అసిన్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఇక ఆమె తొలి హిందీ సినిమా ‘గజిని’ హిట్ అవ్వడంతో ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో చేరిన ఈ తార కేవలం సినీతారలతోనే కాదు ఇతర రంగాల వ్యక్తులతో కూడా పరిచయాలు పెంచుకున్నారు. ఈ కోవలోనే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీతో అసిన్ స్నేహం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి రెండు వాణిజ్య ప్రకటనల్లో కలిసి నటించిన ఈ ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారి, చివరికి ఎఫైర్‌గా పరిణమించిందనే గుసగుసలు కూడా అప్పట్లో వినిపించాయి. ఆ విషయం అలా వుంచితే మహేంద్రసింగ్ ధోనీ బ్యాటింగ్ అంటే అసిన్‌కు చాలా ఇష్టమట. ఓ వైపు తను షూటింగ్‌లో వున్నా తను చేయాల్సిన సన్నివేశాల మీద కంటే ఎక్కువ శ్రద్ధ ధోని బ్యాటింగ్ మీదే వుంటుంది. అతని బ్యాటింగ్ స్కోర్ గురించి పదే పదే, ప్రతి ఓవర్‌కు ఓసారి ఫోన్‌లో వాకబు చేయనిదే ఆమె మనసు కుదుటపడదట. ఇదంతా అసిన్‌కు క్రికెట్ అంటే ఇష్టంతో అలా చేసిందేమో అనుకుంటే మీ పొరపాటే అవుతుంది. ఎందుకంటే మ్యాచ్‌లో ధోని అవుటయ్యాడని తెలిసిన మరుక్షణమే ఈ తార ఆట గురించి పట్టించుకోకుండా కొంత సేపటి వరకు బాధగా వుండిపోతుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమె అంతరార్థం ఇప్పుడైనా మీకు అర్థమైందా?

No comments:

Post a Comment