Wednesday, January 26, 2011

రూమర్స్ వస్తేనే ‘సెలబ్రిటీ’నా?

రూమర్స్ వస్తేనే ‘సెలబ్రిటీ’నా?


నాది చిన్ని ప్రపంచం. తక్కువమంది స్నేహితులు ఉన్నారు. నా సుఖ దుఃఖాలను వాళ్లతోనే పంచుకుంటాను. వీలు కుదిరినప్పుడల్లా వారిని కలుస్తాను. మేమంతా కలిస్తే ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తాం. చెవులు దద్దరిల్లిపోయేట్లు పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తాం’’ అంటున్నారు అసిన్. ఈ కేరళ కుట్టిని కొత్తవాళ్లెవరైనా కలిసినప్పుడు ముందు ‘చాక్లెట్లు’ ఇచ్చి, ఆ తర్వాతే మాట్లాడతారట. దాదాపు ప్రతి రోజూ ఓ చాక్లెట్ బాక్స్ ఆమె దగ్గర ఉంటుంది. ఆ బాక్సులో అన్నీ ఇంపోర్టెడ్ చాక్లెట్సేనట. ఇది మాత్రమే కాదు... అసిన్‌కు మరో అలవాటు కూడా ఉంది. వార్తా పత్రికల్లో తన గురించి వచ్చిన మంచి, చెడుకి చెందిన అన్ని వార్తలను, ఫొటోలను కత్తిరించి ఫైల్ చేస్తారట. అంతకు మించి వదంతులకు ఏ మాత్రం రియాక్ట్ కానంటున్నారామె. రూమర్స్ వస్తే లైమ్‌లైట్‌లో ఉన్నట్లుగా భావించబట్టే రియాక్ట్ అవ్వరా? అని అసిన్‌ని అడిగితే - ‘‘అలా ఏం కాదు. కొంతమంది తారలు పాపులార్టీ కోసం కావాలని తమ గురించి దుష్ర్పచారం చేయించుకుంటారట. నేనా టైప్ కాదు. చేతిలో నాలుగు సినిమాలు ఉంటే ఆటోమేటిక్‌గా లైమ్‌లైట్‌లో ఉంటాం. వదంతులు వస్తేనే సెలబ్రిటీల కింద లెక్క అని కూడా కొంతమంది అంటారు. ఆ మాటలతో నేను ఏకీభవించను’’ అన్నారు. తమిళంలో ఆమె నటించిన ‘కావలన్’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. కొంత గ్యాప్ తర్వాత తమిళంలో అసిన్ చేసిన చిత్రం కావడంతో ఈ సక్సెస్‌కు తన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ సరసన ఆమె తెలుగు ‘రెడీ’ హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం మేలో విడుదలవుతుంది.
 

No comments:

Post a Comment