బికినీలో బాగున్నాను
చిత్ర పరిశ్రమలో నాయికగా నిలబడిన వాళ్లందరినీ ఓసారి గమనించండి. వాళ్లంతా అందం, అభినయం రెండిటినీ నమ్ముకొన్నవాళ్లే. ఆ రెంటినీ సమన్వయం చేసుకొంటే ఇక తిరుగులేనట్టే. ప్రియమణి కూడా ఇదే సూత్రం అనుసరిస్తోందట. 'ఇక్కడ మన స్థానాన్ని నిర్ణయించేవి మనకొచ్చే పాత్రలే. ఏ సినిమా ఫలితాన్ని ముందే అంచనా వేయలేం. అలాగే ఏ పాత్రకు మంచి పేరొస్తుందో ముందే వూహించి చెప్పడం కష్టమే. 'పెళ్త్లెన కొత్తలో' సినిమాతో గాడిలో పడతాను అని నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు అనుకోలేదు' అని చెబుతోంది ప్రియమణి. 'నువ్వు చీర కడితే బాగుంటావ్... అని కొంతమంది చెప్పారు. ఆధునిక వస్త్రాలు కూడా నీకు నప్పుతాయ్ అని మరికొంతమంది చెప్పారు. థియేటర్‌కి వచ్చేవాళ్లలో అన్ని వర్గాల ప్రేక్షకులూ ఉంటారు. వస్త్రధారణ విషయంలో వాళ్లందరి అభిరుచినీ దృష్టిలో పెట్టుకోవల్సిందే' అని కొత్త సూత్రం చెప్పింది. 'ద్రోణ' సినిమా కోసం బికినీ వేసినందుకు తనని తాను సమర్థించుకొంది. 'స్విమ్మింగ్ పూల్‌లో పాట తీస్తాం అన్నారు. అక్కడ జీన్స్, సల్వార్ వేసుకొంటే కుదర్దు కదా. అందుకే బికినీ వేయాల్సివచ్చింది. ఆ పాట కూడా బాగా చిత్రీకరించారు. నాకైతే నచ్చింది' అంది.
No comments:
Post a Comment