చొక్కా విప్పను
మన హీరోల చేత చొక్కాలు విప్పించి సిక్స్‌ప్యాక్‌లు చూపించాలని మా తమ్ముడు శిరీష్ ఆరాటపడుతున్నాడు. శ్రియ కూడా 'నువ్ చొక్కా విప్పితే బాగుంటావు..' అంటోంది. అయితే నేను మాత్రం చొక్కా విప్పను'' అన్నారు యువ కథానాయకుడు అల్లు అర్జున్. ఆయన ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సౌత్‌స్కోప్ 2011 క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ''మన దక్షిణాది సినిమాల స్థాయిని చూపించడానికి సౌత్‌స్కోప్ ఒక వేదికగా నిలవడం సంతోషంగా ఉంద''న్నారు. ''ఇలాంటి క్యాలెండర్‌లో సాధారణంగా అమ్మాయిలకే చోటుంటుంది. ఈసారి మాలాంటి హీరోలకూ స్థానం దక్కడం ఆనందంగా ఉంద''న్నారు నాగచైతన్య. ఈ కార్యక్రమంలో శ్రియ, శ్రుతి హాసన్, రానా, అల్లు శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment