Wednesday, January 12, 2011

ఆ పొరపాటు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నా

ఆ పొరపాటు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నా


ఈ చిత్రంలో చేస్తున్నప్పుడు నా స్టూడెంట్ లైఫ్ గుర్తొచ్చింది. ఈ ఏడాది నా కెరీర్‌కి ఈ చిత్రం బాగా హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అంటున్నారు శ్రీయ. జీవా సరసన ఆమె నటించిన తమిళ చిత్రం ‘రౌదిరం’. ఈ చిత్రంలో శ్రీయ ‘లా స్టూడెంట్’గా యాక్ట్ చేశారు. ఆ పాత్ర గురించే ఆమె పై విధంగా స్పందించారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చెబుతూ - ‘‘కొన్ని పాత్రలు చాలాకాలం గుర్తుండిపోతాయి. ఈ చిత్రంలో నేను చేసిన పాత్ర అలా గుర్తుండిపోతుంది. ఇదొక ప్రయోజనాత్మక సినిమా. వార్తా పత్రికల్లో మనం చదివే సంఘటనల గురించి ఈ చిత్రంలో చర్చించడం జరిగింది. సామాజిక స్పృహ ఉన్న సినిమా కావడంతో ఎంతో ఇష్టపడి చేశాను. అలాగే ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మెండుగా ఉన్నాయి’’ అన్నారు. కొత్త సంవత్సం గురించి చెబుతూ - ‘‘వారం రోజుల క్రితం వరకు ‘2010’ అని రాసి.. ఇప్పుడు హఠాత్తుగా ‘2011’ అని రాయడం మర్చిపోతున్నాను. ఈ మధ్య ఎవరికో ఓ వార్త రాస్తూ.. తేదీ వేసి, సంవత్సరం మాత్రం 2010 అని రాశాను. దాంతో నువ్వింకా ఓ సంవత్సరం వెనకే ఉన్నావని ఆటపట్టించారు. 2011 అని అలవాటు పడటానికి ఇంకొన్నాళ్లు పడుతుంది. మళ్లీ 2011 ముగిసిన తర్వాత 12 అప్పుడు ఇదే సమస్య నెలకొంటుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నాకిలా పొరపాటు జరగడం కామన్ అయ్యింది. అఫ్‌కోర్స్ నాలా చాలామంది ఉండి ఉంటారని అనుకుంటున్నాను. గత ఏడాది గురించి చెప్పాలంటే కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా చాలా ఆనందంగా సాగింది. ఈ ఏడాది రెట్టింపు ఆనందాన్నిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ప్రస్తుతం శ్రీయ ఇంగ్లిష్ చిత్రం ‘మిడ్ నైట్ చిల్డ్రన్’, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందనున్న ‘పానీ’ చిత్రాలు కమిట్ అయ్యారు. ఈ నెలలోనే ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ షూటింగ్ ఆరంభమవుతుంది. ‘పానీ’ షూటింగ్ ఫిబవరిలో ప్రారంభం అవుతుంది. మలయాళంలో ఆమె నటిస్తున్న ‘కాసనోవా’ షూటింగ్ ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

No comments:

Post a Comment