Wednesday, March 16, 2011

రాజ్’తో స్నేహం కుదిరింది

రాజ్’తో స్నేహం కుదిరింది


సినీ పరిశ్రమ సక్సెస్ చుట్టూ తిరుగుతుందనేది కాదనలేని నిజం. కానీ ఈ రంగుల ప్రపంచంలో జయాపజయాలకు అతీతంగా అవకాశాలను అందిపుచ్చుకున్న వారు చాలా అరుదుగా వుంటారు. ఇలా సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా బిజీ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో విమలారామన్ ఒకరు. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘అబద్ధం’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ తార ఆ తర్వాత ‘ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రంగ ది దొంగ’ వంటి పలు చిత్రాల్లో నటించారు. కాగా నాయికగా ఈ ముద్దుగుమ్మ సరైన విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం సుమంత్ సరసన నటిస్తున్న ‘రాజ్’ చిత్రంపైనే విమలా ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి ప్రధాన నాయికగా నటించారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి విమలా వివరిస్తూ ‘‘నా గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ‘రాజ్’లో చేశాను. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు కూడా ఆస్కారమున్న పాత్ర అది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రియమణితో కలిసి నటించడం ఎంతో సంతోషంగా వుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ‘రాజ్’ చిత్రం మూలంగా నాకో బెస్ట్ ఫ్రెండ్ దొరికింది’’ అంటూ ముసి ముసి నవ్వులు రువ్వుతూ చెప్పారు విమలారామన్. 

కాజల్‌కు నా పక్కన నటించేంత సీన్లేదు: శింబు

కాజల్‌కు నా పక్కన నటించేంత సీన్లేదు: శింబు 


టాలీవుడ్ రసగుల్ల కాజల్ అగర్వాల్‌కు తొలిసారి తిరస్కారం ఎదురైంది. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం దబాంగ్ తమిళ రీమేక్ చిత్రంలో ఆమెను బుక్ చేసేందుకు చిత్ర నిర్మాత ఉత్సాహం చూపించాడట. అయితే హీరో శింబు మాత్రం కాజల్ అగర్వాల్‌కు తన పక్క నటించేంతటి సీన్లేదని, ఆమెను తప్పించాలని సూచించాడట.అదే సమయంలో టాలీవుడ్‌లోకి వచ్చేసరికి పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న గబ్బర్ సింగ్‌లో అవలీలగా ఛాన్సును కొట్టేసిన కాజల్, తమిళంలో మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇదిలావుంటే కాజల్ స్థానంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పేరును సూచించాడట శింబు. ఆ హీరోయిన్లో నచ్చిందేమిటి...? కాజల్‌లో నచ్చనిదేమిటో...? మరోసారి శింబును అడిగి తెలుసుకుందాం. 

Tuesday, March 15, 2011

గుడి కట్టించుకుంటున్న హన్సిక

 గుడి కట్టించుకుంటున్న హన్సిక 

 
కోలీవుడ్‌లో హన్సికపై చిత్రమైన గాసిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. తాను డబ్బులిచ్చి గుడి కట్టించుకుంటోందని, ఇందుకోసం తెగ తంటాలు పడుతోందని హన్సిక గురించి పలు రకాలుగా వార్తలు వెలుగులోకి రావడంతో ఆమె కాస్తంత మనస్తాపానికి లోనయ్యారట. దీనిపై హన్సిక స్పందిస్తూ- ‘‘డబ్బులిచ్చి గుడికట్టించుకునే స్థితిలో నేను లేను.
నాకు ఆ అవసరం కూడా లేదు. ఒకవేళ అలాంటి పని ఎవరైనా చేస్తానంటే ప్రోత్సహించే తత్వం కూడా కాదు నాది. కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు. నాపై వస్తున్న రూమర్లు కూడా అంతే. తమిళంలో నేను చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా... నాకు మంచి పేరునే తెచ్చాయి. అందుకే అవకాశాలు వస్తున్నాయి. నా ఎదుగుదల చూసి ఓర్వలేక చేస్తున్న పనులివన్నీ’’ అన్నారు హన్సిక. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాల గురించి మాట్లాడుతూ- ‘‘తమిళంలో రెండు సినిమాలు, కన్నడంలో మూడు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో కూడా ఓ చిత్రంలో చేయబోతున్నాను. ప్రస్తుతం ఇవే నా సినిమాలు. కెరీర్ మొదలైన నాటి నుంచి నేటి వరకూ ఏనాడూ ఖాళీగా లేను. ఇది ఓ విధంగా నా గెలుపే’’అని ధీమాగా చెప్పారు హన్సిక.

తను నాకు మంచి స్నేహితుడు

తను నాకు మంచి స్నేహితుడు


షూటింగ్ స్పాట్‌లో ఎంత సరదాగా ఉంటాడో... కెమెరా ముందు అంత ప్రొఫెషనల్‌గా మారిపోతాడు. తను రెండో సినిమాతోనే నాకు మంచి స్నేహితుడైపోయాడు’’ అంటున్నారు అందాల తార కాజల్. ఇంతకీ కాజల్‌కు అంత చేరువైన ఆ స్నేహితుడెవరబ్బా...! అనుకుంటున్నారా...? ఇంకెవరు ‘డార్లింగ్’ ప్రభాసే. ప్రస్తుతం ఆయనతో ‘మిస్టర్ ఫెర్‌ఫెక్ట్’లో నటిస్తున్నారు కాజల్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా తాను మాట్లాడుతూ- ‘‘‘మగధీర’ నన్ను స్టార్‌ని చేసినా... ‘డార్లింగ్’ నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. నా మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్రను అందులో చేశాను. ఒక ప్రేక్షకురాలిగా నాకు నచ్చిన సినిమా ‘డార్లింగ్’. ఆ సినిమాలాగే ‘మిస్టర్ పెర్‌ఫెక్ట్’ కూడా ఫీల్‌గుడ్ మూవీ. ‘డార్లింగ్’లో మా పెయిర్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాలో కూడా మా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. తప్పకుండా ఈ సినిమా కూడా మాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ‘మిస్టర్ పెర్‌ఫెక్ట్’’’ అంటున్నారు కాజల్. 

Monday, March 14, 2011

ఆ ముగ్గురు హీరోయిన్లు విప్పేయడానికి రెడీగా ఉన్నారట...

ఆ ముగ్గురు హీరోయిన్లు విప్పేయడానికి రెడీగా ఉన్నారట... 


హిందీ "ధూమ్ 2"లో ఐశ్వర్యారాయ్ వేడిముద్దుల దృశ్యంతోపాటు చాలా పొట్టి దుస్తుల్లో కన్పించి మతిపోగొట్టింది. ఇపుడు అమీర్‌ఖాన్ లీడ్ రోల్ పోషిస్తున్న ధూమ్ 3ని తెరకెక్కించేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లీడ్ రోల్‌ను అమీర్ ఖాన్ పోషిస్తున్నాడు. ఇతగాడి సరసన నటింపజేసేందుకు కత్రినా, ప్రియాంక, దీపికా పదుకునేలను ఆలోచిస్తున్నారట. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో ఎవరు బాగా చూపెట్టేందుకు సిద్ధమైతే వారికి ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారట. కాగా ముగ్గురు కూడా కావల్సినంత ఎక్స్‌పోజింగ్ చేయడానికి తాము సిద్ధమేనని చెపుతున్నారట. టూపీస్ దుస్తుల్లోనే కాదు పొదుపైన బికినీల్లో కనిపించేందుకు సై అంటున్నారట. ప్రియాంక ఓ అడుగు ముందుకేసి ఎలాగైనా ఛాన్స్ దక్కించుకోవాలని అమీర్ ఖాన్‌తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తోందట. మరి దీపికా, కత్రినా ఎటువంటి ప్లాన్లు వేసి అమీర్‌ను పడగొడతారో చూడాలి. 

నేనింకా ప్రేమలో పడలేదు

నేనింకా ప్రేమలో పడలేదు


తానింకా ప్రేమలోనే పడలేదు అంటోంది నిఖిత. తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషలలో హీరోయిన్‌గా నటించిన ఈమె ప్రస్తుతం శాండిల్ ఉడ్‌లో సెటిలైంది. కన్నడ నటుడు దర్శన్‌తో ప్రేమలో పడినట్లు త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అవన్నీ వదంతులేనని నిఖిత కొట్టిపారేస్తోంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ తాను నటిగా చిత్ర రంగంలోకి ప్రవేశించి తొమ్మిదేళ్లు మాత్రమే అయిందన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి స్థానాన్నే సంపాదించుకున్నానని చెప్పారు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అందువల్ల ప్రేమించడానికి టైమ్‌లేదని, ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదని స్పష్టం చేసింది. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం అని తనది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపింది. కాగా తాను కన్నడ నటుడు దర్శన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఇలాంటి వదంతులు ఎవరు? ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని నిఖిత ఆవేదన వ్యక్తం చేసింది.

Friday, March 11, 2011

హిమాలయాలకు పయనం

హిమాలయాలకు పయనం


సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు పయనమవుతున్న ట్టు తాజా సమాచారం. రజనీకాంత్‌కు ఆధ్యాత్మిక చింతన అధికం అన్న విషయం తెలిసిందే. ఆయన విశ్రాంతి నిలయం హిమాలయాలన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన చిత్ర ప్రారం భం ముందు, చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత రజనీకాంత్ హిమాలయ పయనం తప్పకుండా చేస్తారు. ఎందిరన్ చిత్రం తరువాత మరో ప్రతిష్టాత్మక చిత్రం రాణాకు సిద్ధం అవుతున్నారాయన. ఇందులో రజనీ చాలాకాలం తరువాత త్రిపాత్రాభిన యం చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో గానీ, మే నెల ప్రథమార్థంలో గానీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఏప్రిల్‌లో తమిళనాట శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యం లో రజనీ కొన్ని రోజుల పాటు హిమాలయాల్లో విశ్రాంతి కోసం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆయన హిమాల య పయనానికి మరో కారణం కూడా ఉంది. రజనీ అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రాణ స్నేహితుడొకరు ఈ ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులు ఎంత వరకు వచ్చాయనే విషయాన్ని రజనీ స్వయంగా పరిశీలించాలని భావించినట్లు తెలిసింది.

నా భర్తకు కోపమెక్కువే!

నా భర్తకు కోపమెక్కువే!


తనది శాంత స్వభావమేగానీ తన భర్తకు కొంచెం కోపమెక్కువేనని, ఇద్దరి మనస్తత్వం ఒకేలా ఉండాలని ఎక్కడా లేదని అంటున్నారు నటి భూమిక. భూమికకు, ఆమె భర్త భరత్‌ఠాగూర్‌కు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని, ఇద్దరూ వివాహ రద్దుకు సిద్ధం అవుతున్నారని వార్తలు గుప్పుమంటున్నా యి. వీటిపై భూమిక స్పందించారు. తాను ఒంటరిగా బయట ఊర్లకు గానీ, విదేశాలకు గానీ వెళితే భర్త నుంచి విడిపోయానని అర్థమా అని ప్రశ్నించారు. ఆయనెప్పుడూ తన వెంటనే ఉండటం సాధ్యమా అని, ఇలాంటి నిరాధార వార్తలు ప్రచారం చేయడం భావ్యమా అని ఆవేదన వ్యక్తం చేశారు. భరత్ తన సొత్తును దోచుకున్నట్లు, తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నట్లు తాజాగా పుకార్లు షికార్లు చేస్తున్నాయన్నారు. వాస్తవానికి తన కుటుంబం ఆ మధ్య ఒక కారు ప్రమాదానికి గురైందని తెలిపారు. అప్పుడు గాయపడ్డ తన తల్లి ఇంకా కోలుకోలేదన్నారు. ఆమెను చూసుకుంటూ ముంబ యిలో ఉంటున్నానని వెల్లడించారు. భర్త నుంచి వివాహరద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వదంతులు పుట్టిస్తున్నారన్నారు. భరత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. తాను సొంతంగా నిర్మించిన తెలుగు చిత్రం తకిట తకిట పరాజయం పొందడం వల్లే తమ మధ్య సమస్యలు తలెత్తాయని మరికొందరు అభూత కల్పనలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. తమ చిత్రంతో పాటు విడుదలయిన మరో రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని, వాటి గురించి ఎందుకు మాట్లాడరని భూమిక వాపోయారు.

Wednesday, March 9, 2011

కొత్త గాళ్‌ఫ్రెండ్‌తో జూనియర్ మాల్యా చెట్టాపట్టాల్

కొత్త గాళ్‌ఫ్రెండ్‌తో జూనియర్ మాల్యా చెట్టాపట్టాల్


విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా పేరు చెపితే చాలు... వెంటనే దీపికా పదుకునే గుర్తుకు వస్తుంది. బాలీవుడ్ అంతా వీళ్లద్దరూ మంచి లవ్‌బర్డ్స్ అని కూడా చెప్పుకుంటారు. ఇదిలావుండగా తాజాగా జూనియర్ మాల్యా ఇపుడు మరో అమ్మాయితో చెట్టాపట్టాలేసుక తిరుగుతూ కన్పిస్తున్నాడట.ఇంతకీ ఎవరా అమ్మాయని బాలీవుడ్‌లో ఓ పిల్లజర్నలిస్టూ వెంటాడి వెంటాడి చివరికి కనిపెట్టేశాడట. అలా బయటపడిన విషయం ఏంటయా.. అంటే, సిద్ధార్థ్ వెంట తిరుగుతున్న ఆ కొత్త గాళ్‌ఫ్రెండ్ సోఫియా చౌదరి. ఇద్దరూ కలిసి ఓ సంస్థకు చెందిన ఉత్పత్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారట. మరి ఫోటోగ్రాఫర్లు ఊరుకుంటారా ఏంటీ..? వెంటన తమ కెమేరాలకు పని చెప్పేందుకు ఎగబడ్డారట. అయితే సిద్ధార్థ్, సోఫియాలిద్దరూ ఫోజిలివ్వడానికి ససేమిరా అన్నారట. తామిద్దరం జస్ట్ ఫ్రెండ్స్‌మని దూరదూరంగా జరుగుతూ చెప్పారట. మరి ఫ్రెండ్స్ అయితే కలిసి ఫోజివ్వడానికేంటి ప్రోబ్లమ్ అని పిల్లజర్నలిస్ట్ అమాయకంగా అడిగేసరికి సోఫియా ముఖం కందగడ్డలా మారిపోయిందట. అతడివైపు గుడ్లురుముతూ చూసి అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయిందట. 

యాంకర్‌కు హీరోయిన్ ఛాన్స్

యాంకర్‌కు హీరోయిన్ ఛాన్స్

కోలీవుడ్‌లో పరభాషా హీరోయిన్ల హవా కొనసాగుతోంది. మరోవైపు నూతన తారల రాక కూడా పెరుగుతోంది. మాలీవుడ్‌తో పాటు శాండిల్ ఉడ్ హీరోయిన్ల దృష్టి కోలీవుడ్‌పైనే పడుతోంది. తాజాగా శాండిల్ ఉడ్ యాంకర్‌గా పేరొందిన మలయాళీ భామ ఆయిషా కోలీవుడ్‌లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నారు. రాజసిన్హా దర్శకత్వం వహిస్తున్న ఉనదు విళియిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ తమిళంలో హీరోయిన్‌గా పరిచయం అవుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన విద్యాభ్యాసం చెన్నైలోనే జరిగిందని, అందువల్ల భాష సమస్య లేదని అన్నారు. కన్నడ దూరదర్శన్‌లో యాంకర్‌గా, కొన్ని టీవీ సీరియల్స్‌లో నటిగా రాణించానని, ఆ అనుభవంతో హీరోయిన్‌గా తన సత్తా చూపిస్తాన ని అంటున్నారు. మనమ్ మదివిడు అనే మరో చిత్రంలోనూ నటించే అవకాశం వచ్చింద ని తెలిపారు. దీనికి రత్నం దర్శకత్వం వహించనున్నారని వెల్లడించారు.

Tuesday, March 8, 2011

సైఫ్ నన్ను బికినీలో చూసేందుకు తెగ ఇష్టపడతాడు

సైఫ్ నన్ను బికినీలో చూసేందుకు తెగ ఇష్టపడతాడు 


బేర్ బ్యాక్‌తో నటించి బాలీవుడ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన బాలీవుడ్ నటి కరీనాకపూర్ తన బాయ్‌ఫ్రెండ్ సైఫ్ అలీఖాన్ ఇష్టాలు ఎలాంటివో మనసు విప్పి చెప్పింది. తనను బికినీలో చూసేందుకు సైఫ్ తెగ ఇష్టపడతాడని సిగ్గులు చిలకరిస్తూ చెప్పింది. తనను అందరూ సేక్సీ నటి అంటుంటే చాలా సంతోషంగా ఉంటుందనీ, అయితే వెండితెరపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బికినీ వేయకూడదని నిర్ణయించుకున్నాని చెపుతోంది ఈ బ్యూటీ. సైఫ్ అలీఖాన్ మాత్రం తనను బికినీలో చూసేందుకు ఆరాటపడతాని అంటోంది. నిజానికి అలా నటిస్తే అతడికి ఎలాంటి అభ్యంతరమూ లేదని వక్కాణిస్తోంది. మరింకేం.. బికినీ వేసుకుని నటించవచ్చు కదా... అని అడిగితే... బికినీ ధరించడమంటూ జరిగితే అది సైఫ్ కోసమే వేస్తాను తప్పించి వెండితెరపై ఎట్టి పరిస్థితుల్లోనూ వేయనని చెపుతోంది. బికినీ బదులు బ్యాక్‌లెస్ బ్యూటీగా టాప్‌లెస్ ఫోజిచ్చి సంచలనం సృష్టించిన కరీనా... బికినీ వేయనని చెప్పడంపై కొంతమంది కిసుక్కున నవ్వుతున్నారు. 

ఎవర్నయినా వాళ్లు సెక్సీగా చూపించగలరు

ఎవర్నయినా వాళ్లు సెక్సీగా చూపించగలరు


సింగం, వేటైకారన్ సినిమాలతో తమిళతంబీల హృదయాలను కూడా కొల్లగొట్టేశారు అనుష్క. ‘సింగం’ తెలుగులో ‘యుముడు’గా విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలో ‘వేట్టైకారన్’ కూడా ‘పులి వేట’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ స్టిల్స్‌లో అనుష్క గ్లామర్ సినిమాపై అంచనాలు పెంచేసే రేంజ్‌లో ఉంది. తమిళ సినిమాల్లో అనుష్క మోతాదును మించి అందాలను అరబోస్తున్నారని, తెలుగు కంటే తమిళ సినిమాపైనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఇటీవల వచ్చిన కొన్ని కథనాలపై అనుష్క స్పందిస్తూ - ‘‘అందంతా వారి భ్రమ. నేకెక్కడా పరిధి దాటి అందాల ప్రదర్శన చేయలేదు. చేయను కూడా. తమిళ దర్శకులు ఎవర్నయినా సెక్సీగా చూపించగలరు. ఆ క్రెడిట్ అంతా వారిదే. సింగం, వేట్టైకారన్ సినిమాల్లో నా గ్లామర్‌కి ఎన్నో ప్రశంసలందాయి. చాలా ఆనందం అనిపించింది. గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిది’’ అని చెప్పారు అనుష్క. ‘రాణీ రుద్రమ’గా కనిపించబోతున్నట్టు వస్తున్న వార్తల విషయంలో స్పందిస్తూ-‘‘అలాంటి గొప్ప పాత్ర చేసే అవకాశం వస్తే వదులుకోను. దానికి కాలమే సమాధానం చెబుతుంది’’ అన్నారు. ప్రస్తుతం నాగ్ ‘ఢమరుకం’, ప్రభాస్ ‘రెబల్’ చిత్రాల్లో నటిస్తున్నారు అనుష్క. ఇవిగాక తమిళంలో వానం, పితా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

Monday, March 7, 2011

నడుముకి పైన కావాలంటే చూపిస్తా... నడుముకి కింద మాత్రం...

నడుముకి పైన కావాలంటే చూపిస్తా... నడుముకి కింద మాత్రం... 


మల్లికా శరావత్ అకస్మాత్తుగా సిగ్గుల మొగ్గయిపోయింది. తాజా చిత్రం "ధమాల్ 2"లో అందాలను ఆరబోయమని దర్శకుడు అడిగితే కండిషన్లు పెట్టిందట. సన్నివేశాన్ననుసరించి మల్లిక పలుచటి బికినీలో పై నుంచి కింది వరకూ కనిపించాల్సి ఉందట. అదే విషయాన్ని దర్శకుడు మల్లికకు చెప్పి అలా నటించమని అడిగాడట. ఏమైందో తెలియదు కానీ... మల్లిక అందుకు ససేమిరా అన్నదట. అంతగా కావాలంటే నడుముకి పైగాన్ని ఎంతైనా చూపిస్తాను కానీ నడుము కింది భాగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించనని తెగేసి చెప్పిందట. దాంతో ఏం చేయాలో తెలియని దర్శకుడు కనీసం "హిస్"లో చూపించినట్లుగా బాడీ డబుల్ ఆఫ్షన్‌కైనా అంగీకరించమని అడిగాడట. నడుము పైగాన్ని ఏమైనా చేసుకో... కానీ నడుము కింద భాగాన్ని మాత్రం చూపించను అని గట్టిగా చెప్పేసిందట. మల్లిక కండిషన్ ప్రకారం దర్శకుడు నడుము పైగాన్ని బికినీ దుస్తుల్లో సుమారు మూడు నాలుగు రోజులపాటు చిత్రీకరించాడట. మరి నడుము కింద భాగాన్ని ఎలా మేనేజ్ చేస్తారు సార్... అని ఓ అసిస్టెంట్ అడిగితే.. మల్లిక కాలి బొటన వేలి దగ్గర్నుంచి పై వరకూ అంతా చూపిస్తానని సదరు దర్శకుడు ధీమాగా చెప్పాడట. 

ఆ ఇంటికోడల్ని అయితే అంతకన్నా ఆనందంలేదు

ఆ ఇంటికోడల్ని అయితే అంతకన్నా ఆనందంలేదు


‘డర్టీ పిక్చర్’లో హాట్ హాట్‌గా నటిస్తూ బిజీగా ఉన్న కేరళ కుట్టి విద్యాబాలన్‌కి ఉన్నట్టుండి పెళ్లిమీద గాలిమళ్లింది. ఖాళీ దొరికితే చాలు...పెళ్లి గురించే మాట్లాడుతున్నారామె. ఇటీవల తనను చేసుకోబోయేవాడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘కేరళ అమ్మాయిని అయినంత మాత్రాన కేరళ అబ్బాయి మాత్రమే పెళ్లాడతాను అనుకుంటే పొరపాటే. నా మనసుకు నచ్చిన వరుడు ఏ భాషవాడైనా సరే ఇష్టపడి తాళి కట్టించుకుంటా.
మరో విషయం ఏంటంటే.. నాకు బెంగాలీ సంప్రదాయమంటే ఇష్టం. అలాగని నా భర్త బెంగాలీ అవ్వనవసరం లేదు. ఆ సంప్రదాయం తెలిసిన వాడైతే చాలు. అందగాడు కాకపోయినా.... జాలి గుణం, ప్రేమించే తత్వం, ముందుచూపు వుంటే చాలు పెళ్లాడేస్తా’’ అని చెప్పారు. బెంగాలీ సంప్రదాయాన్ని ఇష్టపడటానికి కారణం బెంగాలీ కుర్రాడితో ప్రేమ కాదు కదా.? అనడిగితే- అలాంటిదేమీ లేదు. ఒక నటిగా అన్ని సంప్రదాయాలను తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందులో బెంగాలీ సంప్రదాయం నన్ను ఆకట్టుకుంది. మీరన్నట్టు బెంగాలీ ఇంటి కోడల్ని అయితే అంతకంటే ఆనందం ఏముంది’’ అంటూ గలగలా నవ్వేశారు విద్యాబాలన్. ఇంతకీ బెంగాల్‌పై విద్యాబాలన్ చూపిస్తున్న ప్రేమకు ఆంతర్యం ఏమై ఉంటుంది అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

Friday, March 4, 2011

స్పృహతప్పిన సమీరా

స్పృహతప్పిన సమీరా


షూటింగ్ స్పాట్‌లో సమీరా రెడ్డి అనూహ్యంగా స్పృహ తప్పి పడిపోవడం యూనిట్ వర్గాలలో కలకలం రేపింది. ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో సమీరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. జి.కె.ఫిలిం కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
శనివారం షూటింగ్‌లో పాల్గొన్న సమీరా రెడ్డి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడ్డారు. వెంటనే ఆమెను యూనిట్ సభ్యులు సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు జ్వరం అధికంగా ఉండడంతో స్పృహ కోల్పోయారని పేర్కొన్నారు. వారం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.
ఫలితంగా షూటింగ్ వాయిదా పడింది. దీనిపై సమీరారెడ్డి సన్నిహితులు తెలుపుతూ హిందీ చిత్రం షూటిం గ్‌తో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో విరామం లేకుండా పాల్గొనడం వల్ల సమీరా అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు.

నా లైఫ్‌లో అతనికి ప్రత్యేక స్థానం

నా లైఫ్‌లో అతనికి ప్రత్యేక స్థానం


నా వయసెంత అనుకున్నారు?... జస్ట్ ఇరవెరైండే. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ వెండితెరపై నన్ను చూస్తుంటే బోర్ కొడుతోందా ఏంటి?’’ అంటున్నారు ఛార్మి. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఈ పంజాబీ బ్యూటీ తన మనసు విప్పి కొన్ని విషయాలు చెప్పారు. ఆ మాటల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ గురించిన ప్రస్తావన వచ్చింది. దేవీతో ఛార్మికి ఎఫైర్ ఉందనే వార్త ఒకానొక సమయంలో భారీ ఎత్తున ప్రచారమైంది. ఆ తర్వాత అది సద్దుమణిగినప్పటికీ ఈ ఇద్దరి మధ్య ‘సమ్‌థింగ్’ ఉందనే సందేహం మాత్రం పలువురిలో అలాగే ఉంది. ఆ ప్రస్తావనలో దేవీతో తనుకున్న అనుబంధం గురించి ఛార్మి చెబుతూ - ‘‘దేవీకి, నాకు మధ్య మంచి అవగాహన ఉంది. మేం ఒకరినొకరం బాగా అర్ధం చేసుకున్నాం. దేవీ చాలా జోవియల్ పర్సన్. నాకు అత్యంత ఆప్త మిత్రుడు. నాక్కావల్సినంత సపోర్ట్ ఇస్తాడు. నా జీవితంలో దేవీకి ప్రత్యేకమైన స్థానం ఉంది’’ అన్నారు. అయితే దేవీలో మీకు మంచి జీవిత భాగస్వామి కనిపిస్తున్నాడా? అనే ప్రశ్నను ఛార్మి ముందుంచినప్పుడు.. ఆమె పై విధంగా స్పందించారు. ఆ విషయమై ఆమె మరింత వివరంగా చెబుతూ - ‘‘పెళ్లనేది పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యత గురించి నేనింకా ఆలోచించలేదు. నటిగా నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది’’ అన్నారు.

Thursday, March 3, 2011

నాగచైతన్యకోసం నిత్యామీనన్ బూట్లలో సమంత కాళ్లు..?!!

నాగచైతన్యకోసం నిత్యామీనన్ బూట్లలో సమంత కాళ్లు..?!! 


సెక్సీ పెదవుల సుందరి సమంత మరోసారి నాగచైతన్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్లు ఫిలింనగర్ న్యూస్. "ఏ మాయ చేసావె" చిత్రంతో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఇద్దర్నీ కలిపి తన చిత్రంలో నటింపజేసేందుకు నిర్మాత కె. అచ్చిరెడ్డి ఉత్సుకత చూపిస్తున్నట్లు తెలిసింది. అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి "ఆటోనగర్ సూర్య" అనే పేరును కూడా ఖరారు చేశారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన తొలుత నిత్యామీనన్ నటింపజేయాలని అనుకున్నారు. కానీ హఠాత్తుగా మధ్యలో సమంత పేరు తెరపైకి వచ్చింది. మరి నిత్యామీనన్‌ను తొలగించి ఆమె స్థానంలో సమంతను నటింపజేస్తున్నారా...? లేదంటే నిత్యతో సహా సమంత కూడా నటిస్తోందా...అన్నది తేలాల్సిన విషయం. అయితే చైతు సరసన నటించడానికి తొలుత సమంత తల అడ్డంగా ఊపినట్లు సమాచారం. ఎందుకనో... నాగచైతన్య కంటే తను పెద్దదానిలా కనిపిస్తుందనా...? 

పెళ్లాం కొంగుచాటు మొగుడిగా అభిషేక్ బచ్చన్

పెళ్లాం కొంగుచాటు మొగుడిగా అభిషేక్ బచ్చన్ 


అభిషేక్ బచ్చన్ ఇటీవలి కాలంలో తెగ ఉడుక్కుంటున్నాడట. ఎందుకూ...? అనంటే... దానికి రకరకాల రీజన్లు చెపుతున్నారు బాలీవుడ్ సినీజనం. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత ఐష్ ఫేమ్ తగ్గిపోతుందనుకుంటే అంతకు రెట్టింపు స్థాయిలో దూసుకపోతోంది. ఆమెకు ఆఫర్లపై ఆఫర్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. అవకాశాలు వస్తే భర్తగా అభిషేక్ ఆనందించాల్సింది పోయి డీలా పడుతున్నాడట. పైగా ఐష్ వెంట ఎక్కడికి వెళ్లినా అతడిని కరివేపాకులా చూస్తున్నారట. ఇటీవల గుజారిష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే అక్కడ అందరూ ఐష్‌ను వీవీవీఐపీగా చూస్తూ ఆమెనే ప్రశ్నలు అడిగారట. ప్రక్కనే ఉన్న అభిషేక్ బచ్చన్‌ను కనీసం ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడంతో అభికి కోపమొచ్చి ఫంక్షన్ మధ్యలోనే లేచెళ్లిపోయాడట. మరోవైపు ఐశ్వర్యారాయ్‌కు వరుస ఆఫర్లు వస్తుంటే, అభిషేక్ మాత్రం అవకాశాలు లేక చేతులు ముడుచుకుని ఇంట్లో ఖాళీగా కూచుంటున్నాడట. భార్య ఫేమ్ రోజురోజుకీ పెరుగిపోతుంటే తన ఇమేజ్ మాత్రం రోజురోజుకూ మరుగుజ్జులా మారిపోతుండటాన్ని అభిషేక్ జీర్ణించుకోలేకపోతున్నాడట. దీంతో ఆమెకు కాస్త దూరంగా ఉంటున్నట్లు భోగట్టా. 

Wednesday, March 2, 2011

ముద్దుకు అర్థాలెన్నో

ముద్దుకు అర్థాలెన్నో


గాసిప్స్ అంటే తనకు ఇష్టమని, వాటిమూలంగా ఎంచక్కా ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుందని, అందువలన గాసిప్స్ రాసేవారికి కృతజ్ఞతలని ఇటీవల ఓ సందర్భంలో చెప్పిన బాలీవుడ్ భామ దీపికాపదుకొనే ఆకస్మాత్తుగా మాట మార్చారు. ఇకమీదట తనపై గాసిప్స్ రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్‌లు కూడా ఇచ్చేస్తున్నారు ఈ ‘ఓం శాంతి ఓం’ ఫేం. అనుకోకుండా ఈ మార్పేంటని ఆమెను అడిగితే- ‘‘ప్రతిదానికీ ఓ పరిధి అంటూ ఉంటుంది. నేను రణబీర్‌తో కలిసి తిరిగినా... సిద్దార్థ్ మాల్యాతో పార్టీలకు అటెండ్ అయినా... అదంతా ఫ్రెండ్‌షిప్‌లో భాగమే. కాస్తంత క్లోజ్‌గా ఉన్నంతమాత్రాన వారితో శారీరక సంబంధాలున్నట్టు రాస్తే చూస్తూ ఊరుకోవాలా? నేను అలాంటి అమ్మాయిని కాను. అవకాశాల కోసమో , డబ్బు కోసమో ఎఫైర్లు నడిపేంత నీచ స్థితిలో లేను. ఇంకోసారి ఆ రకంగా వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఖబర్దార్’’ అంటూ ఘాటుగానే స్పందించారు దీపిక. ఏమీ లేకుండానే మరి వ్యవహారం ముద్దుల దాకా వెళ్లిందా అనడిగితే- ‘‘ముద్దు అనేది ప్రస్తుతం సాధారణమైన అంశం. ప్రేమికులే కాదు, స్నేహితులు కూడా ముద్దులు పెట్టుకోవచ్చు. ఒక్కో ముద్దుకు ఒక్కో నిర్దిష్టమైన అర్థం ఉంది. అవగాహన లేక మాట్లాడే మాటలవి’’ అని వివరణ ఇచ్చారు దీపిక.

వర్మ పెళ్లి

వర్మ పెళ్లి


పారితోషికాల్లేవు... సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లోంచి వాటాలిస్తా అంటూ ప్రకటించి 'దొంగలముఠా' తీశారు రామ్‌గోపాల్‌ వర్మ. త్వరలో ఆయన 'పెళ్లి' చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఆయనతోపాటు పూరి జగన్నాథ్‌, హరీష్‌ శంకర్‌లూ దర్శకత్వం వహిస్తారు. మూడు వేర్వేరు కథల ప్రభావంతో మరో కథ ఎలా మొదలవుతుందా అనే అంశం ఈ పెళ్లిలో ఉంటుంది. పెళ్లి చేసుకున్న మూడు జంటల చుట్టూ కథ నడుస్తుంది. వారి కథల్ని వర్మ, పూరి, హరీష్‌లు వాళ్ల శైలిలో చూపిస్తారు. ఈ చిత్రంలో నటీనటులు ఎవరనేది బయటకు తెలియనీయరు. తెర మీదే చూడాలి అంటున్నారు వర్మ.

Tuesday, March 1, 2011

ఇలియానాకు జూనియర్ ఎన్టీఆర్ చిట్కాలు

ఇలియానాకు జూనియర్ ఎన్టీఆర్ చిట్కాలు


బక్కపలచని భామ ఇలియానా గంటలతరబడి జూనియర్ ఎన్టీఆర్‌తో తెగ డిస్కషన్స్ చేస్తోందట. అదేమని అడిగితే... చేసేవన్నీ మీకు చెప్పాలా అంటూ రుసరుసలాడుతోందట. రానాతో కలిసి నటిస్తున్న "నేను - నా రాక్షసి" సినిమాకంటే ఎన్టీఆర్ శక్తి చిత్రం ముందు విడుదలయ్యేటట్లు ఉండటంతో ఇలియానా హైరానా పడుతోందట. ఆ చిత్రంలో తన పాత్ర ఎలా వచ్చిందో తెలుసుకోవడమే కాక, చిత్రంలో ఇంకా గ్లామరస్‌గా కన్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందట. పనిలోపనిగా తనకు మంచి సలహాలివ్వాలని జూనియర్ ఎన్టీఆర్‌ను తరచూ కలిసి అడుగుతోందట. జూనియర్ అమ్మడికి అవసరమైన మెళకువలు చెపుతున్నాడట. మరి శక్తిలో ఇలియానా ఎటువంటి శక్తి చూపెడుతుందో వేచి చూడాలి. 

ఎవరి కోసమో పెళ్లి చేసుకోకండి

ఎవరి కోసమో పెళ్లి చేసుకోకండి


బాలీవుడ్ అందాల తార మనీ షా కొయిరాలకు నటిగా మంచి పేరు ఉంది. ఆమె ఉత్తరాదిలోనే కాదు దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లోనూ మంచి స్థానం సంపాదించుకున్నారు. అయితే వ్యక్తిగతంగా ఆమెపై పలు వదంతులు ప్రచారమవుతున్నాయి. ఆమె భర్తతో వివాహ రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన సొంత జీవితం గురించి అంటీ అంటనట్లు మాట్లాడే మనీషా వివా హ వ్యవస్థనే దుయ్యపట్టే పనిలో పడ్డారు. వివాహ సంప్రదాయం గురించి అందరూ చాలా ఎక్కువ గా మాట్లాడుతున్నారని, అయితే కొంతమంది జీవితాల్లో అది అంత గొప్పగా లేదని అన్నారు. వయసు మించిపోతుందనే భయంతోనో, ఇతరులు ఏమనుకుంటారో అనే చింతతోనో, చివరి దశలో తోడుకోసమో వివాహం చేసుకోవద్దని, అన్ని విధాలా నచ్చితేనే దానికి సిద్ధపడాలని పెద్ద ఉపోద్ఘాతమే ఇస్తున్నారు. వివాహం చేసుకోకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న వారిలో తన స్నేహితులు చాలా మంది ఉన్నారన్నారు. ఇక తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను భర్త సామ్రాట్‌తో కలిసే జీవిస్తున్నానని వెల్లడించారు.