Tuesday, March 15, 2011

గుడి కట్టించుకుంటున్న హన్సిక

 గుడి కట్టించుకుంటున్న హన్సిక 

 
కోలీవుడ్‌లో హన్సికపై చిత్రమైన గాసిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. తాను డబ్బులిచ్చి గుడి కట్టించుకుంటోందని, ఇందుకోసం తెగ తంటాలు పడుతోందని హన్సిక గురించి పలు రకాలుగా వార్తలు వెలుగులోకి రావడంతో ఆమె కాస్తంత మనస్తాపానికి లోనయ్యారట. దీనిపై హన్సిక స్పందిస్తూ- ‘‘డబ్బులిచ్చి గుడికట్టించుకునే స్థితిలో నేను లేను.
నాకు ఆ అవసరం కూడా లేదు. ఒకవేళ అలాంటి పని ఎవరైనా చేస్తానంటే ప్రోత్సహించే తత్వం కూడా కాదు నాది. కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు. నాపై వస్తున్న రూమర్లు కూడా అంతే. తమిళంలో నేను చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా... నాకు మంచి పేరునే తెచ్చాయి. అందుకే అవకాశాలు వస్తున్నాయి. నా ఎదుగుదల చూసి ఓర్వలేక చేస్తున్న పనులివన్నీ’’ అన్నారు హన్సిక. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాల గురించి మాట్లాడుతూ- ‘‘తమిళంలో రెండు సినిమాలు, కన్నడంలో మూడు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో కూడా ఓ చిత్రంలో చేయబోతున్నాను. ప్రస్తుతం ఇవే నా సినిమాలు. కెరీర్ మొదలైన నాటి నుంచి నేటి వరకూ ఏనాడూ ఖాళీగా లేను. ఇది ఓ విధంగా నా గెలుపే’’అని ధీమాగా చెప్పారు హన్సిక.

No comments:

Post a Comment