Friday, March 11, 2011

హిమాలయాలకు పయనం

హిమాలయాలకు పయనం


సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు పయనమవుతున్న ట్టు తాజా సమాచారం. రజనీకాంత్‌కు ఆధ్యాత్మిక చింతన అధికం అన్న విషయం తెలిసిందే. ఆయన విశ్రాంతి నిలయం హిమాలయాలన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన చిత్ర ప్రారం భం ముందు, చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత రజనీకాంత్ హిమాలయ పయనం తప్పకుండా చేస్తారు. ఎందిరన్ చిత్రం తరువాత మరో ప్రతిష్టాత్మక చిత్రం రాణాకు సిద్ధం అవుతున్నారాయన. ఇందులో రజనీ చాలాకాలం తరువాత త్రిపాత్రాభిన యం చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో గానీ, మే నెల ప్రథమార్థంలో గానీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఏప్రిల్‌లో తమిళనాట శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యం లో రజనీ కొన్ని రోజుల పాటు హిమాలయాల్లో విశ్రాంతి కోసం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆయన హిమాల య పయనానికి మరో కారణం కూడా ఉంది. రజనీ అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రాణ స్నేహితుడొకరు ఈ ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ పనులు ఎంత వరకు వచ్చాయనే విషయాన్ని రజనీ స్వయంగా పరిశీలించాలని భావించినట్లు తెలిసింది.

No comments:

Post a Comment