Tuesday, March 8, 2011

ఎవర్నయినా వాళ్లు సెక్సీగా చూపించగలరు

ఎవర్నయినా వాళ్లు సెక్సీగా చూపించగలరు


సింగం, వేటైకారన్ సినిమాలతో తమిళతంబీల హృదయాలను కూడా కొల్లగొట్టేశారు అనుష్క. ‘సింగం’ తెలుగులో ‘యుముడు’గా విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. త్వరలో ‘వేట్టైకారన్’ కూడా ‘పులి వేట’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ స్టిల్స్‌లో అనుష్క గ్లామర్ సినిమాపై అంచనాలు పెంచేసే రేంజ్‌లో ఉంది. తమిళ సినిమాల్లో అనుష్క మోతాదును మించి అందాలను అరబోస్తున్నారని, తెలుగు కంటే తమిళ సినిమాపైనే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఇటీవల వచ్చిన కొన్ని కథనాలపై అనుష్క స్పందిస్తూ - ‘‘అందంతా వారి భ్రమ. నేకెక్కడా పరిధి దాటి అందాల ప్రదర్శన చేయలేదు. చేయను కూడా. తమిళ దర్శకులు ఎవర్నయినా సెక్సీగా చూపించగలరు. ఆ క్రెడిట్ అంతా వారిదే. సింగం, వేట్టైకారన్ సినిమాల్లో నా గ్లామర్‌కి ఎన్నో ప్రశంసలందాయి. చాలా ఆనందం అనిపించింది. గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిది’’ అని చెప్పారు అనుష్క. ‘రాణీ రుద్రమ’గా కనిపించబోతున్నట్టు వస్తున్న వార్తల విషయంలో స్పందిస్తూ-‘‘అలాంటి గొప్ప పాత్ర చేసే అవకాశం వస్తే వదులుకోను. దానికి కాలమే సమాధానం చెబుతుంది’’ అన్నారు. ప్రస్తుతం నాగ్ ‘ఢమరుకం’, ప్రభాస్ ‘రెబల్’ చిత్రాల్లో నటిస్తున్నారు అనుష్క. ఇవిగాక తమిళంలో వానం, పితా చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

No comments:

Post a Comment