Monday, March 14, 2011

నేనింకా ప్రేమలో పడలేదు

నేనింకా ప్రేమలో పడలేదు


తానింకా ప్రేమలోనే పడలేదు అంటోంది నిఖిత. తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషలలో హీరోయిన్‌గా నటించిన ఈమె ప్రస్తుతం శాండిల్ ఉడ్‌లో సెటిలైంది. కన్నడ నటుడు దర్శన్‌తో ప్రేమలో పడినట్లు త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అవన్నీ వదంతులేనని నిఖిత కొట్టిపారేస్తోంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ తాను నటిగా చిత్ర రంగంలోకి ప్రవేశించి తొమ్మిదేళ్లు మాత్రమే అయిందన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి స్థానాన్నే సంపాదించుకున్నానని చెప్పారు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అందువల్ల ప్రేమించడానికి టైమ్‌లేదని, ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదని స్పష్టం చేసింది. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం అని తనది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా? అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపింది. కాగా తాను కన్నడ నటుడు దర్శన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం మనస్తాపానికి గురిచేసిందన్నారు. ఇలాంటి వదంతులు ఎవరు? ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని నిఖిత ఆవేదన వ్యక్తం చేసింది.

No comments:

Post a Comment