యాంకర్‌కు హీరోయిన్ ఛాన్స్
కోలీవుడ్‌లో పరభాషా హీరోయిన్ల హవా కొనసాగుతోంది. మరోవైపు నూతన తారల రాక కూడా పెరుగుతోంది. మాలీవుడ్‌తో పాటు శాండిల్ ఉడ్ హీరోయిన్ల దృష్టి కోలీవుడ్‌పైనే పడుతోంది. తాజాగా శాండిల్ ఉడ్ యాంకర్‌గా పేరొందిన మలయాళీ భామ ఆయిషా కోలీవుడ్‌లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నారు. రాజసిన్హా దర్శకత్వం వహిస్తున్న ఉనదు విళియిల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ తమిళంలో హీరోయిన్‌గా పరిచయం అవుతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన విద్యాభ్యాసం చెన్నైలోనే జరిగిందని, అందువల్ల భాష సమస్య లేదని అన్నారు. కన్నడ దూరదర్శన్‌లో యాంకర్‌గా, కొన్ని టీవీ సీరియల్స్‌లో నటిగా రాణించానని, ఆ అనుభవంతో హీరోయిన్‌గా తన సత్తా చూపిస్తాన ని అంటున్నారు. మనమ్ మదివిడు అనే మరో చిత్రంలోనూ నటించే అవకాశం వచ్చింద ని తెలిపారు. దీనికి రత్నం దర్శకత్వం వహించనున్నారని వెల్లడించారు.
No comments:
Post a Comment