ఆ ఇంటికోడల్ని అయితే అంతకన్నా ఆనందంలేదు
‘డర్టీ పిక్చర్’లో హాట్ హాట్‌గా నటిస్తూ బిజీగా ఉన్న కేరళ కుట్టి విద్యాబాలన్‌కి ఉన్నట్టుండి పెళ్లిమీద గాలిమళ్లింది. ఖాళీ దొరికితే చాలు...పెళ్లి గురించే మాట్లాడుతున్నారామె. ఇటీవల తనను చేసుకోబోయేవాడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఆమె మాట్లాడుతూ- ‘‘కేరళ అమ్మాయిని అయినంత మాత్రాన కేరళ అబ్బాయి మాత్రమే పెళ్లాడతాను అనుకుంటే పొరపాటే. నా మనసుకు నచ్చిన వరుడు ఏ భాషవాడైనా సరే ఇష్టపడి తాళి కట్టించుకుంటా.
మరో విషయం ఏంటంటే.. నాకు బెంగాలీ సంప్రదాయమంటే ఇష్టం. అలాగని నా భర్త బెంగాలీ అవ్వనవసరం లేదు. ఆ సంప్రదాయం తెలిసిన వాడైతే చాలు. అందగాడు కాకపోయినా.... జాలి గుణం, ప్రేమించే తత్వం, ముందుచూపు వుంటే చాలు పెళ్లాడేస్తా’’ అని చెప్పారు. బెంగాలీ సంప్రదాయాన్ని ఇష్టపడటానికి కారణం బెంగాలీ కుర్రాడితో ప్రేమ కాదు కదా.? అనడిగితే- అలాంటిదేమీ లేదు. ఒక నటిగా అన్ని సంప్రదాయాలను తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందులో బెంగాలీ సంప్రదాయం నన్ను ఆకట్టుకుంది. మీరన్నట్టు బెంగాలీ ఇంటి కోడల్ని అయితే అంతకంటే ఆనందం ఏముంది’’ అంటూ గలగలా నవ్వేశారు విద్యాబాలన్. ఇంతకీ బెంగాల్‌పై విద్యాబాలన్ చూపిస్తున్న ప్రేమకు ఆంతర్యం ఏమై ఉంటుంది అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
No comments:
Post a Comment