తను నాకు మంచి స్నేహితుడు
షూటింగ్ స్పాట్‌లో ఎంత సరదాగా ఉంటాడో... కెమెరా ముందు అంత ప్రొఫెషనల్‌గా మారిపోతాడు. తను రెండో సినిమాతోనే నాకు మంచి స్నేహితుడైపోయాడు’’ అంటున్నారు అందాల తార కాజల్. ఇంతకీ కాజల్‌కు అంత చేరువైన ఆ స్నేహితుడెవరబ్బా...! అనుకుంటున్నారా...? ఇంకెవరు ‘డార్లింగ్’ ప్రభాసే. ప్రస్తుతం ఆయనతో ‘మిస్టర్ ఫెర్‌ఫెక్ట్’లో నటిస్తున్నారు కాజల్. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా తాను మాట్లాడుతూ- ‘‘‘మగధీర’ నన్ను స్టార్‌ని చేసినా... ‘డార్లింగ్’ నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. నా మనస్తత్వానికి దగ్గరగా ఉండే పాత్రను అందులో చేశాను. ఒక ప్రేక్షకురాలిగా నాకు నచ్చిన సినిమా ‘డార్లింగ్’. ఆ సినిమాలాగే ‘మిస్టర్ పెర్‌ఫెక్ట్’ కూడా ఫీల్‌గుడ్ మూవీ. ‘డార్లింగ్’లో మా పెయిర్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాలో కూడా మా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. తప్పకుండా ఈ సినిమా కూడా మాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ‘మిస్టర్ పెర్‌ఫెక్ట్’’’ అంటున్నారు కాజల్.
No comments:
Post a Comment