Wednesday, March 16, 2011

రాజ్’తో స్నేహం కుదిరింది

రాజ్’తో స్నేహం కుదిరింది


సినీ పరిశ్రమ సక్సెస్ చుట్టూ తిరుగుతుందనేది కాదనలేని నిజం. కానీ ఈ రంగుల ప్రపంచంలో జయాపజయాలకు అతీతంగా అవకాశాలను అందిపుచ్చుకున్న వారు చాలా అరుదుగా వుంటారు. ఇలా సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా బిజీ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో విమలారామన్ ఒకరు. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘అబద్ధం’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ తార ఆ తర్వాత ‘ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రంగ ది దొంగ’ వంటి పలు చిత్రాల్లో నటించారు. కాగా నాయికగా ఈ ముద్దుగుమ్మ సరైన విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం సుమంత్ సరసన నటిస్తున్న ‘రాజ్’ చిత్రంపైనే విమలా ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి ప్రధాన నాయికగా నటించారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి విమలా వివరిస్తూ ‘‘నా గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ‘రాజ్’లో చేశాను. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనకు కూడా ఆస్కారమున్న పాత్ర అది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రియమణితో కలిసి నటించడం ఎంతో సంతోషంగా వుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ‘రాజ్’ చిత్రం మూలంగా నాకో బెస్ట్ ఫ్రెండ్ దొరికింది’’ అంటూ ముసి ముసి నవ్వులు రువ్వుతూ చెప్పారు విమలారామన్. 

No comments:

Post a Comment