స్పృహతప్పిన సమీరా
షూటింగ్ స్పాట్‌లో సమీరా రెడ్డి అనూహ్యంగా స్పృహ తప్పి పడిపోవడం యూనిట్ వర్గాలలో కలకలం రేపింది. ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రంలో సమీరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. జి.కె.ఫిలిం కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా చెన్నైలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
శనివారం షూటింగ్‌లో పాల్గొన్న సమీరా రెడ్డి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడ్డారు. వెంటనే ఆమెను యూనిట్ సభ్యులు సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు జ్వరం అధికంగా ఉండడంతో స్పృహ కోల్పోయారని పేర్కొన్నారు. వారం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.
ఫలితంగా షూటింగ్ వాయిదా పడింది. దీనిపై సమీరారెడ్డి సన్నిహితులు తెలుపుతూ హిందీ చిత్రం షూటిం గ్‌తో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో విరామం లేకుండా పాల్గొనడం వల్ల సమీరా అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు.
No comments:
Post a Comment