ముద్దుకు అర్థాలెన్నో
గాసిప్స్ అంటే తనకు ఇష్టమని, వాటిమూలంగా ఎంచక్కా ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుందని, అందువలన గాసిప్స్ రాసేవారికి కృతజ్ఞతలని ఇటీవల ఓ సందర్భంలో చెప్పిన బాలీవుడ్ భామ దీపికాపదుకొనే ఆకస్మాత్తుగా మాట మార్చారు. ఇకమీదట తనపై గాసిప్స్ రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్‌లు కూడా ఇచ్చేస్తున్నారు ఈ ‘ఓం శాంతి ఓం’ ఫేం. అనుకోకుండా ఈ మార్పేంటని ఆమెను అడిగితే- ‘‘ప్రతిదానికీ ఓ పరిధి అంటూ ఉంటుంది. నేను రణబీర్‌తో కలిసి తిరిగినా... సిద్దార్థ్ మాల్యాతో పార్టీలకు అటెండ్ అయినా... అదంతా ఫ్రెండ్‌షిప్‌లో భాగమే. కాస్తంత క్లోజ్‌గా ఉన్నంతమాత్రాన వారితో శారీరక సంబంధాలున్నట్టు రాస్తే చూస్తూ ఊరుకోవాలా? నేను అలాంటి అమ్మాయిని కాను. అవకాశాల కోసమో , డబ్బు కోసమో ఎఫైర్లు నడిపేంత నీచ స్థితిలో లేను. ఇంకోసారి ఆ రకంగా వార్తలు రాస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఖబర్దార్’’ అంటూ ఘాటుగానే స్పందించారు దీపిక. ఏమీ లేకుండానే మరి వ్యవహారం ముద్దుల దాకా వెళ్లిందా అనడిగితే- ‘‘ముద్దు అనేది ప్రస్తుతం సాధారణమైన అంశం. ప్రేమికులే కాదు, స్నేహితులు కూడా ముద్దులు పెట్టుకోవచ్చు. ఒక్కో ముద్దుకు ఒక్కో నిర్దిష్టమైన అర్థం ఉంది. అవగాహన లేక మాట్లాడే మాటలవి’’ అని వివరణ ఇచ్చారు దీపిక.
No comments:
Post a Comment