Sunday, October 31, 2010

'ద్రోహం' చేసిందెవరు?

'ద్రోహం' చేసిందెవరు?


జయప్రద పిక్చర్స్ సంస్థ తెలుగులోకి అనువదిస్తున్న చిత్రం 'ద్రోహం'. మురుగాస్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఫైనల్ సౌండ్ మిక్సింగ్ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ "ఇది నాయిక ప్రాధాన్యత ఉన్న సినిమా. అందమైన అమ్మాయి కనిపిస్తే వయసుతో నిమిత్తం లేకుండా అందరూ పరిచయాలు పెంచుకోవాలనుకోవడం పరిపాటే. అలా ఓ సొగసరి వెంటపడిన యువకుడికి ఆమె ఎలా బుద్ధి చెప్పింది? అతని బారి నుంచి ఎలా తప్పించుకుంది? అనేది ఆసక్తికరం. శృంగార నేపథ్యంలో సాగే సినిమా ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ తొలి వారంలో తొలి కాపీ సిద్ధమవుతుంది. సెన్సార్‌ను పూర్తి చేసి వచ్చేనెల రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. మోహన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి రాజ్ కథానాయకుడు. రామ్‌జీ, నిళల్‌గళ్ రవి ఇతర పాత్రధారులు. మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, పాటలు: వెలిదండ్ల, సంగీతం: రాజేష్, కూర్పు: సురేంద్రనాథ్‌రెడ్డి, నిర్మాణం: జయప్రద పిక్చర్స్. 

మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనంటే చేయను..?

మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయనంటే చేయను..? 

"ఏ మాయ చేసావె" ఫేమ్ సమంత సినిమా ఆఫర్లతో బిజీబిజీ అయింది. తాజాగా ఆమె జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం చిత్రంలో నటించింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ సమంతను సతాయించాడని ఫిలిమ్‌నగర్ కథనం. షూటింగ్ చేసే సమయంలో ఎక్కువసేపు సమంతతోనే గడిపేవాడట ఎన్టీఆర్.ఈ సతాయింపుతో బెంబేలెత్తిపోయి, ఈ విషయాన్ని నిర్మాతతో చెప్పిందట. "ఆయనంతే.. చాలా సరదాగా ఉంటాడ"ని నిర్మాత అన్నాడట. దీంతో ఏమీ చేయలేక... ఎంతో ఓపిగ్గా చిత్రం పూర్తయ్యే వరకూ ఆగిందట. ఇపుడెవరైనా కదిలిస్తే... బాబోయ్ జూనియర్ ఎన్టీఆర్ తోనా.. నావల్ల కాదు అంటోందట. బాలరామాయణం సమయంలోనే సహనటీమణుల్ని ఏడిపించేవాడని ఆ చిత్రంలో నటించిన కొందరు చెపుతుంటారు. అదే అలవాటు ఇంకా కొనసాగుతోందని అంటున్నారు. అయితే సమంత విషయంలో ఆమెను ఎలాంటి ఆటతో ఆటపట్టించాడన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. 

Saturday, October 30, 2010

నా అందాలు ఎంత చూపించాలో నాకు తెలుసు

నా అందాలు ఎంత చూపించాలో నాకు తెలుసు


కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కు వలస వచ్చి ఇక్కడే పాతుకుపోయిన ప్రియమణిని ఎక్స్‌పోజింగ్ గురించి ప్రశ్నలడిగితే మండిపడుతోంది. హీరోయిన్ కనబడితే చాలు... ఆ ప్రశ్న తప్ప మరేమీ లేనట్లుగా ఖచ్చితంగా అడుగుతుంటారని రుసరుసలాడింది.ఇటీవలి సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ మోతాదును కాస్త పెంచిన ప్రియమణి... ఇండస్ట్రీలో ఉండాలంటే అందాలను శృతిమించి చూపించాల్సిన పనిలేదని చెపుతోంది. అయినా ఎంతవరకు చూపించాలో తనకు తెలుసుననీ, తానేమీ చిన్నపిల్లను కాదని అంటోంది.తను బికినీ వేసుకోవాలో వద్దో... లేదంటే ఎక్స్‌పోజింగ్ చేయాలో వద్దో అనే పాఠాలు తనకెవరూ చెప్పనవసరం లేదని గరంగరంలాడింది. 

పేరు మారాక పేరొచ్చింది

పేరు మారాక పేరొచ్చింది
 
 
నేను.. నా 50 మంది స్నేహితులు చాలా ఆనందంగా గడిపాం. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనంత అనుభూతిని నాకు మిగిల్చిన రోజిది’’ అంటున్నారు రిమ్మా. ‘చిత్రం, మనసంతా నువ్వే’లాంటి పలు చిత్రాల ద్వారా తెలుగువారిని ఆకట్టుకోవడంతో పాటు తమిళ్, హిందీ చిత్రాల ద్వారా కూడా ఆయా రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రీమాసేనే ఈ రిమ్మా. పేరు మార్చితే అదృష్టం తన్నుకొస్తుందని ఎవరో చెబితే ‘రిమ్మా’గా
మారిపోయారామె. ‘‘ఆ ఫలితం ‘ఆక్రోష్’ ద్వారా కనిపించింది’’ అంటున్నారు రిమ్మా. ప్రియదర్శన్ దర్శకత్వంలో రిమ్మా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఇందులో ఆమె డీ-గ్లామరైజ్డ్ రోల్ చేశారు. తనలో ఇంత మంచి నటి ఉందని మేం ఊహించలేదని బాలీవుడ్ వర్గాలు రిమ్మాని ప్రశంసిస్తున్నాయి. ఈ ప్రశంసలందుకుంటూ ఆనందంలో ఉన్న రిమ్మా శుక్రవారం తన పుట్టినరోజుని కూడా అంతే ఆనందంగా జరుపుకున్నారు.

 

Friday, October 29, 2010

ఆ ఒక్కటీ అడక్కండి

ఆ ఒక్కటీ అడక్కండి
 
 
కారు పెద్దదైనా, చిన్నదైనా సరే... నంబర్‌లో మాత్రం ‘4’ అంకె ఉండాలి’’ అని అంటున్నారు సౌత్ నుంచి బాలీవుడ్‌కు ప్రమోట్ అయిన అందాల నటి అసిన్. ఈ తారకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి. ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టగానే నల్ల పిల్లి ఎదురొచ్చిందనుకోండి వెంటనే ఆ అడుగు వెనక్కి తీసుకుని ఇంట్లోకి చెక్కేస్తారు.
‘‘నావి మూఢ నమ్మకాలు అనుకున్నా ఫర్వాలేదు. నా నమ్మకం నాది’’ అన్నది ఈ బ్యూటీ థియరీ. సంఖ్యా శాస్త్రాన్ని కూడా ఈ అమ్మడు మెండుగా నమ్ముతారు. ఓ ప్రముఖ న్యూమరాలజిస్ట్ ‘నీకు 4 అంకె బాగా కలిసొస్తుందమ్మా’ అన్నారట. అప్పట్నుంచి అసిన్‌కి అవసరమైన చోట 4 అంకెకి ప్రాధాన్యం ఇవ్వడం పరిపాటి అయ్యింది. ముఖ్యంగా కారు నంబర్ల విషయంలో ఏ మాత్రం రాజీపడరు తను. ‘4’ అంకె వచ్చేట్లు నంబర్ తీసుకుంటారు. గత ఐదేళ్లుగా అసిన్ పుట్టినరోజుకి ఆమె తల్లిదండ్రులు మంచి కారు కొని బహుమతిగా ఇస్తున్నారు.
ఒకసారి ఆడి, ఆ తర్వాత బెంజ్.. ఇలా కూతురికి ఖరీదు గల కార్లు కొనిచ్చి ఆమె అమ్మా, నాన్నలు మురిసిపోతుంటారు. తాజాగా అసిన్‌కు బిఎండబ్ల్యు కార్ కొనిచ్చారని సమాచారం. ఈ కారు నంబర్‌లో కూడా 4 అంకె వచ్చేట్లు చూసుకున్నారు అసిన్. 0004, 4000, 400... అసిన్ కారు నంబర్లు ఈ విధంగా ఉంటాయి. న్యూమరాలజీని నమ్మి, ఆచరించిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? అనే ప్రశ్నను ముందుంచితే - ‘‘ఆ ఒక్కటీ అడక్కండి. ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం అన్ని విషయాలు చెప్పేస్తారేంటి’’’ అన్నారు మూతి తిప్పుతూ అసిన్.
 

బిల్‌క్లింటన్‌గా ఇమ్రాన్ హష్మి!

బిల్‌క్లింటన్‌గా ఇమ్రాన్ హష్మి!
 
 
మెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ గురించి ఎవరికీ పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆయన గురించి తెలిసిన వారికి ‘మోనికా లెవిన్‌స్కీ’తో ఆయన సాగించిన ప్రేమాయణం గురించి కూడా అంతే తెలిసి ఉంటుంది. ఆవిడగారు వైట్‌హౌస్‌లో ‘సెక్రటరీ’గా పనిచేశారు. ఆ సమయంలోనే వారి మధ్య ‘పర్సనల్ ఎఫైర్’ సాగింది. ఈ రసవత్తరమైన ఉదంతం ఇప్పుడు సినిమాగా రాబోతుంది.‘ట్రిపుల్ ఎక్స్(గీగీగీ)’ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బిల్ క్లింటన్ పాత్రను ఇమ్రాన్ హష్మి పోషించనున్నట్లు సమాచారం. కాగా, ఆయన మనసుదోచిన మాయలాడి మోనికా లెవిన్‌స్కీ పాత్రను ఏ హీరోయిన్ పోషిస్తారన్నది తెలియవలసి వుంది. ‘ముద్దుల’ హీరోగా బాలీవుడ్‌లో మంచి పేరు గాంచిన ఇమ్రాన్... క్లింటన్ పాత్రకు ‘భేష్’ అయిన వాడుగా బాలీవుడ్ చెబుతోంది.
 

Thursday, October 28, 2010

షకీలా'ఖతర్నాక్ రాణి'

షకీలా'ఖతర్నాక్ రాణి'

 షకీలా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఖతర్నాక్ రాణి'. ఎం.ఎం.సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై గప్పిట మధుమోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఆర్.చిదంబరం నిర్మిస్తున్నారు. సినిమా విశేషాలను నిర్మాత ఆర్.చిదంబరం చెబుతూ "ఈ చిత్రం షూటింగ్ ఈ నెల్లోనే మొదలైంది.తొలి షెడ్యూల్ పూర్తయింది. నవంబరు 1 నుంచి రెండో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన షకీలా ఈ చిత్రంలో ధైర్య సాహసాలు ప్రదర్శించే రెబెల్ పాత్రలో కనిపించబోతోంది. టైటిల్‌కి తగ్గట్టుగానే తన పాత్ర కూడా ఖతర్నాక్‌గానే ఉంటుంది

కళ్లు చెదిరే కాంబినేషన్

కళ్లు చెదిరే కాంబినేషన్

అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది, పాటగాడు, ఎత్తుకు పై ఎత్తు’ తదితర తెలుగు చిత్రాల్లో, ‘పదినారు వయదినిలే, అపూర్వ రాగంగళ్’ వంటి తమిళ చిత్రాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్‌హాసన్. కెరీర్ ఆరంభంలో ఈ విధంగా కలిసి నటించిన రజనీ, కమల్‌లు విడివిడిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న తర్వాత ఎవరి సినిమాలతో వారు బిజీ అయ్యారు. అయినప్పటికీ వీరి కాంబినేషన్‌లో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యపడలేదు. ఇక ఈ కాంబినేషన్ కలవాలంటే వారి గురువు ‘కె.బాలచందర్’ రంగంలోకి దిగాల్సిందేనని, ఆయన ఒక్కడి వల్లే అది సాధ్యమవుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు కూడా. కానీ బాలచందర్ మాత్రం.. ‘ఇప్పుడు ఈ హీరోలతో సినిమా చేయలేను. ఒకప్పుడు వాళ్లకు ఇమేజ్ ఉండేది కాదు. నేను అల్లుకున్న కథలుతో వారితో సినిమాలు చేశాను. ఇప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే.. నా కథ కిల్ అవుతుంది’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు. దాంతో ఈ సూపర్‌స్టార్ల కలయికలో ఇక సినిమా వచ్చే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకోవచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రముఖ దర్శకుడు శంకర్ వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా చేయడానికి కథ తయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో పెద్ద బేనర్‌గా వెలుగుతున్న ‘సన్ పిక్చర్స్’ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించడానికి కళానిధి మారన్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Wednesday, October 27, 2010

'ఆరెంజ్' అన్ని రికార్డుల్ని బ్రేక్ చెయ్యాలని ఆశిస్తున్నా

'ఆరెంజ్' అన్ని రికార్డుల్ని బ్రేక్ చెయ్యాలని ఆశిస్తున్నా 

 రాంచరణ్, జెనీలియా జంటగా అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నాగేంద్రబాబు నిర్మిస్తోన్న 'ఆరెంజ్' చిత్రం పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలయ్యాయి. సోమవారం రాత్రి శిల్పకళావేదికలో వేలాదిమంది అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగిన వేడుకలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ డి. రామానాయుడు ఆడియో సీడీలను ఆవిష్కరించి, తొలి ప్రతిని చిరంజీవికి అందజేశారు. అంతకుముందు తొలి పాట 'సిడ్నీ నగరం చేసే నేరం'ను నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ సంయుక్తంగా విడుదల చేయగా, 'పోవే పొమ్మంటే వచ్చేసిందా చెలీ ప్రేమ' అంటూ సాగే రెండో పాటని హీరోలు అల్లు అర్జున్, రానా విడుదల చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 'ఆరెంజ్' సినిమా హిట్టవ్వాలనీ, రికార్డుల్ని బ్రేక్ చెయ్యాలనీ మీలానే నేనూ ఆశిస్తున్నానంటూ అభిమానుల్ని ఉద్దేశించి అన్నారు.
 

పవన్‌కళ్యాణ్‌తో వినాయక్

పవన్‌కళ్యాణ్‌తో వినాయక్
 
 
ఆసక్తిని, అంచనాలను పెంచే కాంబినేషన్లు కొన్ని ఉంటాయి. అలాంటి కలయికే.. పవన్‌కళ్యాణ్, వి.వి.వినాయక్. హీరోల్లో పవన్‌కళ్యాణ్‌ది, దర్శకుల్లో వినాయక్‌ది జనరంజకమైన శైలి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించే పాత్రలతో యువతరం రోల్‌మోడల్‌గా నిలిచి.. పవర్‌స్టార్‌గా ఎదిగారు పవన్‌కళ్యాణ్.
అలాగే మాస్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ సినిమాలు రూపొందించి.. సంచలన దర్శకునిగా నిలిచారు వినాయక్. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు అంబరాన్ని తాకుతాయనడంలో సందేహమే లేదు. ఈ అపూర్వ కలయికకు నిర్మాత డి.వి.వి.దానయ్య శ్రీకారం చుట్టారు. త్వరలో వీరిద్దరి కలయికలో ఆయన ఓ సంచలన చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది.

 

Tuesday, October 26, 2010

రొమాంటిక్ 'తేనెటీ గ2'

రొమాంటిక్ 'తేనెటీగ2'

 పలు విజయవంతమైన అనువాద చిత్రాలను నిర్మించిన జ్యోతి ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ అందిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తేనెటీగ2'. సాధిక కథానాయికగా నటించిన ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు మొదలయ్యాయి. చిత్రం గురించి దర్శకుడు వి.ప్రసాద్ వివరిస్తూ 'లండన్‌లో చదువుకుంటున్న ముగ్గురు యువకులకు ఓ రోజు ఓ అందమైన యువతి పరిచయమవుతుంది.ఆమె అందానికి దాసులైన ఆ యువకులు ఆమె వెంటపడుతుంటారు. తన భర్తని హత్య చేస్తే ఆ తర్వాత తనతో ఎంజాయ్ చేయవచ్చని ఆ యువతి ఆఫర్ ఇస్తుంది. దాంతో ఆ యువకులు షాకవుతారు. ఇంటికి వెళ్లి బాగా ఆలోచించుకున్న తర్వాత ఆమె భర్తని హత్య చేయలేమనే విషయాన్ని ఆ యువతికి చెప్పడానికి ఆమె ఇంటికి వెళ్లిన ఆ యువకులకు అప్పటికే ఆమె భర్త హత్య చేయబడి ఉండటం గమనించి భయకంపితులవుతారు.అక్కడ నుంచి పారిపోవాలనే ఆలోచన వచ్చినా తన భర్తను హత్య చేస్తే తనతో ఎంజాయ్ చేయవచ్చని ఆ యువతి ఇచ్చిన ఆఫర్ గుర్తుకు వచ్చి ఆమె దగ్గరికి వెళ్లి ఆమె భర్తని తామే చంపామని, ఎంజాయ్ చేయడానికి తమతో రమ్మని చెబుతారు. వెంటనే ఆ యువతి పోలీసులకు కబురుచేసి, హత్యానేరం కింద ఆ ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేయిస్తుంది.అమాయకులైన ఆ యువకులు ఈ హత్యానేరం నుంచి ఎలా బయట పడ్డారన్నది ఆసక్తి కలిగించే అంశం. సాధిక గ్లామర్ ఈ సినిమాకి ఎస్సెట్ అని చెప్పాలి. యువతను ఆకట్టుకునే అంశాలతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది' అన్నారు. 

నాకు వయసు దాచుకోవడం ఇష్టం ఉండదు

నాకు వయసు దాచుకోవడం ఇష్టం ఉండదు
 
 
‘ప్రతిభా, నైపుణ్యాలు ఉన్నంత మాత్రాన విజయం వెంటనే వరించాలనే నిబంధన ఏమీలేదు. ఓపిక అనేది మనిషికి చాలా కీలకమైనది. అది లేకపోతే.. జీవితం గేరుల్లేని బండిగా తయారవుతుంది’’ అంటున్నారు జెనీలియా. తన జీవితంలో ఎదురైన పలు సంఘటనలను నెమరు వేసుకుంటూ జెనీలియా పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘కెరీర్ మొదట్లో నన్నందరూ ఐరన్‌లెగ్ అన్నారు. ఆ మాటకు నేను కృంగిపోతే ఈ రోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు కదా.. ఒక దారిలో నడిచేటప్పుడు చిన్న చిన్న అవరోధాలు సహజంగా ఎదురవుతాయి. అందుకని వాటినే తలచుకొని విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు. చిన్నతనం నుంచీ నా తీరు ఇదే. నిరాశ అన్న మూడక్షరాలను నా దరిదాపుల్లోకి కూడా రానియ్యను. బొమ్మరిల్లు’ నాటికీ.. ఇప్పటికీ మీ అందంలో ఏ మాత్రం మార్పు రాలేదని, ఇప్పటికీ టీనేజ్ బ్యూటీగానే ఉంటారని.. చాలామంది అడుగుతుంటారు. నా అందానికి కారణం కూడా ఓ విధంగా క్రీడలే. చిన్నతనం నుంచీ నేను ఆడిన క్రీడలు నేటికీ నా వయసును కనిపించనీయవు. వయసును దాచుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం నా వయసు 27. ఇది నిజం’’ అంటూ ఎంతో ఆసక్తిగా తన గురించి చెప్పుకొచ్చారు జెనీలియా.

Monday, October 25, 2010

నవంబర్ రెండో వారంలో 'కళ్యాణ్ రామ్ కత్తి'

నవంబర్ రెండో వారంలో 'కళ్యాణ్ రామ్ కత్తి'

 హీరోగా నటిస్తూ యన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తోన్న 'కల్యాణ్‌రామ్ కత్తి' చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మల్లికార్జున్ దర్శకుడు. సినిమా గురించి హీరో, నిర్మాత కల్యాణ్‌రామ్ తెలియజేస్తూ "మణిశర్మ సారథ్యంలో చేసిన పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్స్ చూసిన వాళ్లంతా చాలా బాగున్నాయని ఫోన్లు చేస్తున్నారు. 'అతనొక్కడే' తర్వాత నాకు ఆడియో సూపర్ అనీ, ట్రైలర్స్ బ్రహ్మాండం అనీ ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చింది ఈ సినిమాకే. ప్రేక్షకులు, అభిమానులు ఆశిస్తున్న స్థాయిలో అన్నిరకాల వాణిజ్య అంశాలతో చిత్రం తయారైంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. నవంబర్ 12న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

మధుర మీనాక్షి

మధుర మీనాక్షి

ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మధుర మీనాక్షి’. శ్రీ కామాక్షితాయి మూవీమేకర్స్ పతాకంపై రాజవంశీ దర్శకత్వంలో మందలపు హరీష్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ ‘‘ సోషియో మైథలాజికల్‌గా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ‘మధుర మీనాక్షి’గా రమ్యకృష్ణ అభినయం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఖర్చుకు వెనుకాడకుండా అత్యాధునిక సాంకేతికతతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దర్శకుడు రాజవంశీయే సంగీతాన్ని కూడా సమాకూర్చారు. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం. ప్రస్తుతం బ్యాలెన్స్‌గా వున్న పాటను చిత్రీకరిస్తున్నాం. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. నవంబరులో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులందరినీ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. 

Sunday, October 24, 2010

రామ్ హీరోగాబెల్లంకొండ సురేష్ చిత్రం 'కందిరీగ'

రామ్ హీరోగాబెల్లంకొండ సురేష్ చిత్రం 'కందిరీగ'

 రామ్ హీరోగా శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించే కొత్త చిత్రం 'కందిరీగ' షూటింగ్ శుక్రవారం ఉదయం రామానాయుడు స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు స్రవంతి రవికిషోర్ క్లాప్‌నివ్వగా, దర్శకుడు బి.గోపాల్ కెమెరా స్విచ్ఆన్ చేశారు. మరో దర్శకుడు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. నవంబర్ మొదటి వారం నుంచి ఏకధాటిగా హైదరాబాద్, పొల్లాచ్చి, రాజమండ్రిల్లో జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుందని, హీరోయిన్ ఎంపిక జరుగుతోందని బెల్లంకొండ సురేష్ చెప్పారు.

కళ్లతో కథ చెబుతా

కళ్లతో కథ చెబుతా


‘‘కళ్లతో కథలు చెప్పే కళ నాకు చిన్నప్పుడే అలవడింది’’ అంటున్నారు శ్రీయ. ఈ బ్యూటీ కథక్ నేర్చుకున్నారు. ఆ విషయం గురించి శ్రీయ చెబుతూ - ‘‘కథక్ అంటే కళ్లతో కథ చెప్పడం అని అర్థం. చెప్పాల్సిన భావాన్ని కళ్లతోనే పలికించాలి. ఈ డాన్స్ నేర్చుకున్నాను కాబట్టి హావభావాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేసినప్పుడు నేను చెప్పదల్చుకున్న భావాన్ని ఎంచక్కా కళ్లతోనే అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పగలుగుతున్నాను. కథక్ నా జీవితానికి ఎంతో ఉపయోగపడింది. నా శరీరాకృతి బాగుండటానికి ఒక కారణం ఈ డాన్స్. నేను చిన్నప్పుడు చాలా స్టేజ్ షోలు ఇచ్చాను. 

Friday, October 22, 2010

రక్తచరిత్ర చూశాను... బాగా నచ్చింది

"రక్తచరిత్ర" చూశాను... బాగా నచ్చింది
 
 ఈ చిత్రాన్ని తాను చూశానని, తనకు చాలా బాగా నచ్చిందని ప్రిన్స్ మహేష్‌బాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘ ‘రక్తచరిత్ర’ను నేను మరచిపోలేను. డెరైక్టరుగా రాము ‘బెస్ట్ ప్రొడక్ట్’ అందించాడు’’ అని మహేష్ పేర్కొన్నారు. ఇక ప్రేక్షకుల విషయానికొస్తే- రెగ్యులర్‌గా సినిమాలు చూడనివారు కూడా ‘రక్తచరిత్ర’ చూడ్డానికి సమాయత్తమవుతున్నారు.

హీరోగా ధూళిపాళ మనవడు

హీరోగా ధూళిపాళ మనవడు

దివంగత నటుడు ధూళిపాళ మనవడు ఫణిరాజ్ హీరోగా సువిధ ఫిలిమ్స్ సంస్థ నిర్మించే చిత్రం షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త మల్లెల కిషార్ సమర్పణలో రూపుదిద్దుకునే ఈ చిత్రంతో కె.జయపాలన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అంశాలతో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు నటిస్తారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్న ఈ చిత్రానికి సంగీతం: రాజభాస్కర్, ఫొటోగ్రఫీ: సురేష్, కథ, కథనం: ఎం.కిషోర్‌బాబు, నిర్మాతలు: పి.సంగీతరావు, ఎ.రాజారెడ్డి, నాగేశ్వరరావు, దర్శకత్వం: కె.జయపాలన్.

ఎన్టీఆర్‌తో తమన్నా!

ఎన్టీఆర్‌తో తమన్నా!
 
 
తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా భాసిల్లుతున్న మిల్కీ వైట్ భామ తమన్నా త్వరలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ చిత్రంలో నటించనున్నారని తెలిసింది. ‘హ్యాపీడేస్’ చిత్రం విజయంతో తెలుగుతో పాటు తమిళంలో కూడా క్రేజీ తారగా ఎదిగిన తమన్నా ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో పాటు తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘బద్రీనాథ్’, నాగచైతన్య సరసన ఓ చిత్రంలోను నటిస్తున్నారు. రెండు భాషల్లోనూ క్రేజీ హీరోలతో నటిస్తున్న తమన్నా ఎన్టీఆర్‌తో ఓ చిత్రంలో నటించే లక్కీ చాన్స్‌ను కొట్టేయడం విశేషమే. గతంలో తారక్ (ఎన్టీఆర్) హీరోగా ‘అశోక్’ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు కాగా, ఇటీవల ప్రభాస్‌తో ‘డార్లింగ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వున్నారు.
 

Thursday, October 21, 2010

రేప్ చేసినతనినే పెళ్లి చేసుకోవాలా?

రేప్ చేసినతనినే పెళ్లి చేసుకోవాలా?


 రేప్ చేసినతనినే పెళ్లి చేసుకోవటం మనం మాములుగా నమ్మలేం, కానీ ఈ మధ్య వెస్ట్ ఢిల్లీ లో జరిగిన కేసులో ఒకామె రేప్ రేప్ చేసినతని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది.ఇలా పెళ్లి చేసుకుంటే సమస్య తీరిపోతుందా. అన్ని రేప్ కేసు లకి ఇదే పరిష్కారమా అంటే కాదు అంటున్నారు, ప్రముక సైకాలజిస్ట్ సీమ. రేప్ అనేది ఆమె జీవితంలో పెద్ద మచ్చ లాంటిదని మరియు ఆ విషయం నుండి ఆమె మనసును బయటకు తీసుకురావాలి అని అంటున్నారు సీమ. ఇలా రేప్ చేసినవాల్లని కటినంగా శిక్షించాలని అంటున్నారు.ప్రముక సైకాలజిస్ట్ సీమ.

ఎక్కడైనా దూసుకుపోయే కారు

ఎక్కడైనా దూసుకుపోయే కారు 


జేమ్స్ బాండ్ చిత్రాలో కనిపించే కారు లాంటిదే తయారుచేసాడు...బ్రిటిన్ కు చెందిన ఫిల్ ఫౌలె.హేలో ఇంటర్ సేప్టార్ గా పిలిచే ఈ బహుళ చర కారుకు చాల విశేషాలు ఉన్నాయ్.ఈ కారు కాక్ పీట్లో హైబ్రిడ్ పవర్ యునిట్ తో పాటు సూపర్ కంప్యూటర్ కూడా ఉంది. ఇది గాలిలో 500 కిలో మీటర్ల వేగంతో దుసుకుపోగలదు.కేవలం 2 .3 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకోగలదు.భూ ఉపరితలానికి 20 వేల మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు.

Wednesday, October 20, 2010

బ్యాంకాక్‌లో 'మిరపకాయ్' క్లైమాక్స్

బ్యాంకాక్‌లో 'మిరపకాయ్' క్లైమాక్స్


రవితేజ హీరోగా రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్లుగా ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై హరీష్‌శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న 'మిరపకాయ్' చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ' బ్యాంకాక్‌లో మంగళవారం నుంచి చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనగా 12 రోజుల పాటు క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాం.ఆ తర్వాత యూరప్‌లో 3 పాటల్ని చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుంది. రవితేజ తన బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా, అందరినీ ఎంటర్‌టైన్ చేసే మాస్ కేరెక్టర్‌ని పోషిస్తున్నారు. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా  దర్శకుడు హరీష్‌శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో ఆరెంజ్

ఆస్ట్రేలియాలో ఆరెంజ్
 
 
మగధీర’తో స్టార్ ఇమేజ్‌ని తెచ్చుకున్న రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆరెంజ్’. జెనీలియా, షాజన్‌పదంసి ఇందులో నాయికలు. బొమ్మరిల్లు, పరుగు చిత్రాల తో అభిరుచి గల దర్శకునిగా ప్రేక్షకులతో కితాబులందుకున్న ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ చిత్రానికి నిర్దేశకుడు. కె.వెంకట్రావు సమర్పణలో అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె.నాగబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సిడ్నీలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్రం విశేషాలను నాగబాబు తెలుపుతూ -‘‘‘మగధీర’ లాంటి ఓ సంచలన విజయం తర్వాత చరణ్ ఎలాంటి సినిమా చేస్తే బావుంటుందో... ఎంతో ఆలోచించి... తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ ‘ఆరెంజ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.

Tuesday, October 19, 2010

చిరంజీవి మేనల్లుడు హీరోగా 'రేయ్'ప్రారంభం

చిరంజీవి మేనల్లుడు హీరోగా 'రేయ్'ప్రారంభం 

 చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రేయ్'. విజయదశమిని పురస్కరించుకుని ఆదివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. బొమ్మరిల్లు పతాకంపై వై.వి.యస్.చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. చిరంజీవి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు క్లాప్‌నిచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. హరికృష్ణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
 

ఆ అలవాటు పోవడం లేదు

ఆ అలవాటు పోవడం లేదు
మమతా మోహన్‌దాస్ చాలా ఆనందంగా ఉంది . దానికి కారణం ‘అన్వర్’ సినిమా. పృథ్వీరాజ్, మమత జంటగా మలయాళంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంపై మమత భారీ అంచనాలు పెంచుకున్నారు. ఆ అంచనాలు నేడు నిజమయ్యాయని ఆమె చెబుతూ - ‘‘అన్వర్ చాలా మంచి చిత్రం. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే చిత్రం ఇది. అందుకే ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ మెండుగా ఉండాలని కోరుకున్నాను,నా కోరిక నెరవేరింది.
మలయాళంలో మమత నటించిన ‘నిరకళ్చా’ చిత్రం ఈ ఆగస్ట్‌లో విడుదలైంది. ఆ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది.
ఇటలీ భాషలోకి కూడా ‘నిరకళ్చా’ను ఇప్పుడు అనువదిస్తున్నారు. ఆ ఆనందంలో ఉన్న మమత ఇప్పుడు ‘అన్వర్’ విజయంతో రెట్టింపు ఆనందంలో ఉన్నారు. ఈ సంతోష సమయంలో గోళ్లు కొరికేసుకుంటున్నారట. చిన్నప్పట్నుంచి మమతాకు గోళ్లు కొరుక్కునే అలవాటు ఉంది. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘గోళ్లు కొరకడం మానమని మా అమ్మ నాతో చిన్నప్పట్నుంచి చెబుతోంది.ఏదైనా మానగలను కానీ అది మాత్రం మానలేను. కాకపోతే నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు మాత్రం ఇబ్బంది అవుతోంది. గోళ్లు కొరుకుతున్నప్పుడు ఆ పెయింట్ మొత్తం నోట్లోకి పోతోంది. అయినా సరే గోళ్లు కొరుకుతూనే ఉంటాను’’ అంటున్నారు మమతా మోహన్‌దాస్.Monday, October 18, 2010

'మహేష్‌ఖలేజా'తొలి వారం కలెక్షన్లు 21 కోట్లు

'మహేష్‌ఖలేజా'తొలి వారం కలెక్షన్లు 21 కోట్లు


మహేశ్‌బాబు, అనుష్క జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కనకరత్న మూవీస్ సంస్థ నిర్మించిన 'మహేష్ ఖలేజా' చిత్రం రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన సి.కళ్యాణ్ మాట్లాడుతూ ' మా సినిమా తొలి వారం 21 కోట్ల 31 లక్షల 97 వేల రూపాయల షేర్ సంపాదించింది.ఈ దసరా సెలవుల్లో ప్రేక్షకులు చిత్రాన్ని అధిక సంఖ్యలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్‌బాబు పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మా సినిమాకు కనకవర్షవ కురిపిస్తున్న ప్రేక్షకులకు, మహేశ్‌బాబు అభిమానులకు కృతజ్ఞతలు' అన్నారు.

టీకా మిస్ అవుతున్నా

టీకా మిస్ అవుతున్నా


మేం ఈ పండగను ‘దసరా టీకా’ అంటాం. పండగ రోజున అన్నదమ్ములకు బొట్టు పెడతాం. నాకు అన్నదమ్ములు లేరు. అందుకని మా కజిన్స్‌కు బొట్టు పెడుతుంటాను. పండగనాడు మా నాన్నగారి అక్కచెల్లెళ్లు మా ఇంటికి వచ్చి నాన్నగారికి బొట్టు పెడతారు. అందరిలానే మా పంజాబీలకు దసరా పెద్ద పండగే. దుర్గాదేవికి పూజలు చేస్తాం. భారీ ఎత్తున వంటకాలు తయారు చేస్తాం. మా బంధువులంతా మా ఇంటికి వస్తారు. ఇంటిల్లిపాదీ కలిసి విందు భోజనం చేస్తాం. ప్చ్.. ఈసారి షూటింగ్‌లో బిజీగా ఉన్నందువల్ల పండగ సంబరాలను మిస్ అవుతున్నాను. ఎనీహౌ.. దసరా పండగ చేసుకుంటున్నవారికి నా శుభాకాంక్షలు.

Thursday, October 14, 2010

వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారట....

వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారట.... 


బాలీవుడ్ నటి దీపికా పదుకునేకి కోపమొచ్చింది. సినిమా సంగతులు కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి విలేకరులు పదేపదే ప్రశ్నించడంపై చిందులేసింది. తాజాగా ఓ షూటింగ్ లో పాల్గొన్న దీపికా పదుకునేను విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. రణబీర్ కపూర్‌తో ప్రేమ విఫలమైన దగ్గర్నుంచి తాజాగా సిద్దార్థ్ మాల్యాతో రొమాన్స్ సాగించడంపై ప్రశ్నలు అడిగారు. పనిలో పనిగా ఓ పిల్లజర్నలిస్ట్.. దీపికకు ఎదురెళ్లి.. మిస్ దీపికా... సిద్దార్థ్ మాల్యాను మీరు ఒళ్లు తగ్గించుకోమని చెప్పారటగా.. అందుకనే ఆయన శరీరంలోని కొవ్వును తగ్గించుకునేందుకు పొద్దస్తమానం జిమ్‌ల చుట్టూ తిరుగుతున్నాడని అంటున్నారు. నిజంగానే మీరలా చెప్పారా.. అనడిగాడట. దీంతో ఇంతెత్తున లేచిన దీపికా.. నీ ఇష్టం వచ్చింది నువ్వు రాసుకో... ఎవరైనా కాస్త లావుగా కనిపిస్తే ఒళ్లు తగ్గిస్తే బావుంటావని అంటాం. అంతమాత్రాన లింకు పెట్టేయడమేనా..? అయినా అలా "గాలి" వార్తలు రాసేవారికి ఏం పనీ పాటా లేదా.. మంచి వార్తలు రాస్తే అందరూ సంతోషిస్తారు అంటూ... సిద్దార్థ్ మాల్యా దూరంగా విష్ చేస్తూ ఉండటంతో అటువైపు వెళ్లిపోయింది. 

హిమాలయాలకు రజినీకాంత్

హిమాలయాలకు రజినీకాంత్


సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రతి ఏడాది హిమాలయాలను సందర్శించడం ఆనవాయితీగా మారింది. భారతదేశంలోనే సంచలన విజయం సాధించి రికార్డు సృష్టించిన రోబో చిత్రం విడుదల దగ్గర్నుంచి రజినీకాంత్ సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎప్పటిమాదిరిగానే హిమాలయాల్లోని ఓ ధ్యాన మందిరంలో రజినీకాంత్ గడుపుతారని తెలిసింది. ఈసారి పర్యటనలో కైలాసంతోపాటు మానససరోవరాన్ని కూడా సందర్శించనున్నట్లు భోగట్టా. హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత తదుపరి ప్రాజెక్టు గురించి ఆలోచన చేస్తారని రజినీ సన్నిహితులు చెపుతున్నారు. 

తుపాకీ గుండు దూసుకుపోయింది

తుపాకీ గుండు దూసుకుపోయింది
షాట్ రెడీ.. టేక్.. అని డెరైక్టర్ అనగానే నీతూచంద్ర పొజిషన్‌లోకి వచ్చారు. ఆమెకు కాస్తంత దూరంలో ఉన్న విలన్ కూడా ఒక వస్తువుకి తుపాకీని గురి పెట్టి నిప్పులు కక్కేలా చూడటం మొదలుపెట్టాడు. నీతూచంద్ర కారులోంచి దిగి పడవ వైపు వడివడిగా అడుగులేయాలి. ఈలోపు ఆ విలన్ తుపాకీతో ఆ వస్తువుని పేల్చాలి. ఆరోజు తీయాల్సిన సీన్ ఇది. డెరైక్టర్ టేక్ అనగానే... నీతూ కారు దిగి పడవ వైపు వెళ్లడం మొదలుపెట్టారు. విలన్ కూడా తుపాకీ ట్రిగ్గర్ నొక్కాడు. కానీ.. గురి తప్పింది. ఆ తుపాకీ గుండు నీతూ చంద్ర పెదాలను ముద్దాడేసింది. బాధ తట్టుకోలేక ఆమె కెవ్వున కేకపెట్టారు. పెదాల నుంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ సన్నగా విలపించసాగారామె. ఇదంతా జరిగింది తమిళ చిత్రం ‘ఆదిభగవాన్’ షూటింగ్‌లో. థాయ్‌ల్యాండ్‌లో ఇది జరిగింది. ‘జయం’రవి, నీతూ చంద్ర జంటగా అమీర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

Wednesday, October 13, 2010

రవితేజ హీరోగా గుణశేఖర్ 'కత్తి'

రవితేజ హీరోగా గుణశేఖర్ 'కత్తి'

 రవితేజ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో ఓ యువ నిర్మాత నిర్మించే 'కత్తి' చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకొనే తొలి సినిమా ఇదే. ఈ చిత్రం గురించి గుణశేఖర్ మాట్లాడుతూ ' కత్తి అనే టైటిల్‌తో ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని రవితేజ హీరోగా రూపొందిస్తున్నాను. 'కత్తి' టైటిల్‌లో ఎంత ఫోర్స్, జోష్ ఉన్నాయో ఈ స్క్రిప్ట్‌లో కూడా అంత జోష్, ఫోర్స్ ఉన్నాయి. కత్తిలాంటి పాత్రకు రవితేజ కరెక్ట్‌గా సూటవుతారు.
 

దేవుడా... ఆ రెండు కోరికలు తీర్చు

దేవుడా... ఆ రెండు కోరికలు తీర్చు
 
 
‘‘స్టార్‌డమ్‌లోని మత్తును, గమ్మత్తును ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నా. ఇది చాలా బావుంది. గొప్ప నటిగా కూడా ఖ్యాతిని ఆర్జించాలని ఉంది. ఇకపై నా పయనం ఆ దిశగానే’’ అంటున్నారు తమన్నా. ‘హ్యాపీడేస్’ ముందు వరకూ ఫెయిల్యూర్స్‌తో చెలిమి చేసిన ఈ అందాలతార.. ‘హ్యాపీడేస్’తో సౌతిండియాలోనే క్రేజ్ స్టార్‌గా ఎదిగారు. ముఖ్యంగా తమిళనాట స్టార్‌డమ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘బద్రీనాథ్’ చిత్రంలోనూ, నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదిలావుంటే.. ఈ పాలబుగ్గల సింగారికి సడన్‌గా ఆఫ్‌బీట్ సినిమాలపై గాలి మళ్లింది. అలాంటి సినిమాల్లో నటించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతూ ఆమె పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ-‘‘రిటైర్ అయ్యేలోపు ఒక్కసారైనా కమల్‌సార్, రజనీసార్‌ల సరసన కథానాయికగా చేయాలని ఉంది. ఆ కోరికలని కూడా దేవుడు తీరుస్తాడని నా నమ్మకం’’ అని ఆశాభావం వ్యక్తపరిచారు అందాల తమన్నా.

Tuesday, October 12, 2010

మల్లికా.. నీ కప్ సైజులెంత..?

మల్లికా.. నీ కప్ సైజులెంత..?


సెక్సిణి మల్లికా శరావత్ తన తదుపరి చిత్రం ప్రమోషన్‌ను తన భుజాలపై వేసుకున్నది. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాదు కూడా వచ్చి వెళ్లింది. తాజాగా పలు వెబ్ మీడియాలలో అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిస్తానని ప్రకటించింది. తనను ప్రశ్నలడగ దలచివారు నేరుగా తమతమ ప్రశ్నలను సదరు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయమని కోరింది.ఇంకేం.. అభిమానులు వచ్చిన అవకాశాన్ని ఎలా వదలిపెడతారు. బాగా ఉపయోగించుకున్నారు. వారు పోస్ట్ చేసిన ప్రశ్నలను చూసి సెక్సిణి కళ్లు గిర్రున తిరిగాయట. ఇంతకీ అంతగా గిరగిర తిప్పిన ప్రశ్నలేంటో కొన్నింటిని చూద్దాం....మల్లికా నీ కప్ సైజెంత..? నిర్మాతలతో నువ్వు పడుకుంటావా..?నీ అందాలు అంత హాట్‌గా రెచ్చగొట్టేంత ఎలా ఉంటున్నాయి మల్లికా..? దానికి కారణం...? ఇత్యాది హాటెస్ట్ ప్రశ్నలతో అభిమానులు ఉక్కిరిబిక్కిరి చేశారట. తొలుత కాస్త తొట్రుపాటుకు గురయినా ఆ తర్వాత ఓపిగ్గా అన్ని ప్రశ్నలకు జవాబులిచ్చిందట మల్లిక.

21న రక్తచరిత్ర

21న  రక్తచరిత్ర

రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో సాగే కథాంశంతో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన చిత్రం ‘రక్త చరిత్ర’. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని ‘ఎ’ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. సెన్సార్ సభ్యుల సూచన మేరకు ఈ చిత్రంలోని ‘అనంతపురం’ అనే పేరును ‘ఆనందపురం’గా మార్చారు. వివేక్ ఓబరాయ్, సూర్య, ప్రియమణి, రాధికా ఆప్టే, శత్రుఘ్నసిన్హా ఇందులో ముఖ్య పాత్రధారులు. ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమా గురించి చిత్ర సమర్పకుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఇది పరిటాల రవి, మద్దెల చెరువు సూరి కథాంశమని చాలామంది అనుకుంటున్నారు. అది వారి పొరపాటు.

Monday, October 11, 2010

చిరంజీవి మేనల్లుడు హీరోగా వైవీఎస్ చౌదరి చిత్రం

చిరంజీవి మేనల్లుడు హీరోగా వైవీఎస్ చౌదరి చిత్రం

 చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్నారు. ఆయన పేరు సాయి ధరమ్‌తేజ్. చిరంజీవికి ఆయన స్వయానా మేనల్లుడు (సోదరి కుమారుడు). ఆయనను హీరోగా పరిచయం చేయబోతోంది దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి.'శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ' చిత్రం ద్వారా వెంకట్, చందులను; 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రంతో ఆదిత్య ఓంను; 'దేవదాసు'తో రామ్‌ను హీరోలుగా పరిచయం చేసిన చౌదరి ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థ బొమ్మరిల్లు పతాకంపై తీసే సినిమాతో ధరమ్‌తేజను కథానాయకుడిగా పరిచయం చేయాలని సంకల్పించారు. 

‘రోబో’ రికార్డుల పరంపర

‘రోబో’ రికార్డుల పరంపర
 
 
రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘రోబో’ ఈ నెల 1న విడుదలై విజయపథంలో దూసుకెళుతున్న విషయం విదితమే. ఈ చిత్రాన్ని దాదాపు 140 కోట్ల రూపాయలతో తీశారు. భారతీయ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇదే. వసూళ్లు కూడా ఇప్పుడు ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఈ చిత్రం తొలి వారం 117 కోట్లు కలెక్ట్ చేసిందట. తమిళనాడులో 60, ఆంధ్ర ప్రదేశ్‌లో 30, కర్నాటకలో 8, కేరళలో 4, హిందీ వెర్షన్ 15 కోట్లు తొలి వారానికి వసూలు చేసి రికార్డ్ సృష్టించిందని వార్తలందుతున్నాయి. ఇటీవల విడుదలైన సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్’ ఈ ఏడాదిలో ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఎక్కువ వసూళ్లు కురిపించిన చిత్రంగా నమోదైంది.

Saturday, October 9, 2010

కారిపోతున్న ఐస్‌క్రీమ్‌ను నాకి తింటా

కారిపోతున్న ఐస్‌క్రీమ్‌ను నాకి తింటా


కాజల్ అగర్వాల్‌కు ఐసులన్నా ఐస్‌క్రీమ్‌లన్నా నోరూరుతుందట. ఎక్కడైనా ఐస్‌క్రీమ్ పార్లల్ కనబడితే చటుక్కున ఆగిపోయి తనకిష్టమైన ఐస్‌క్రీమ్‌ను లాగించేసి వెళుతుందట. అంతేకాదండోయ్.. పొద్దస్తమానం ఐస్‌క్రీమ్‌లను కొనాల్సి వస్తోందని ఐస్‌క్రీమ్ ఎలా చేయాలో నేర్చేసుకుందట. ఏదీ.. కొన్ని ఐస్‌క్రీమ్‌ల పేర్లు చెప్పమని అడిగితే, బనానా ఐస్ క్రీమ్, బ్లాక్ జామ్ ఐస్‌క్రీమ్, చాక్లెట్ ఐస్‌క్రీమ్, కోకోనట్ ఐస్‌క్రీమ్, ఫ్రూట్ ఐస్‌క్రీమ్, హాట్ చాక్లెట్ ఐస్‌క్రీమ్, కేసర్ ఇలాచి ఐస్‌క్రీమ్, మ్యాంగో ఐస్‌క్రీమ్, పైనాపిల్ ఐస్‌క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీమ్, వెనిలా ఐస్‌క్రీమ్.. ఇంకా చాంతాడంత లిస్టు ఉన్నదని చెప్పింది. ఇంట్లో తీరిక దొరికినపుడల్లా వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని ఐస్‌క్రీమ్ తయారు చేసుకుని జుర్రుకుంటుందట. అన్నట్లు చిన్నపిల్లల్లా ఐస్‌క్రీమ్ కరిగిపోయి చేతుల నుండి కారిపోతూ ఉంటే దానిని నాకుతూ రుచి చూడటం అంటే కాజల్‌కు భలే ఇష్టమట. అలా తింటేనే క్రీమ్‌లో ఉన్న రుచి మజా తెలుస్తుందని అంటోందట. 

Friday, October 8, 2010

పగబట్టే నాగిని

పగబట్టే నాగిని

 యువతరం ప్రేక్షకుల్ని తన గ్లామర్‌తో మైమరపిస్తున్న శృంగార తార మల్లికా శరావత్ తాజా చిత్రం ' హిస్'. ఈ సినిమాలో పగ బట్టే నాగిని పాత్రలో మల్లిక నటించింది. ఇతర బాలీవుడ్, హాలీవుడ్ తారల కలయికలో రూపుదిద్దుకున్న ఈ భారీ థ్రిల్లింగ్ స్నేక్ పిక్చర్‌ను శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  

అమ్మ చెప్పినట్లే జరిగింది

అమ్మ చెప్పినట్లే జరిగింది


బోణి’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి కథానాయికగా పరిచయమైన పంజాబీ భామ కృతి ఖర్బందా. అందమైన ముఖవర్ఛసు. చూడగానే ఆకట్టుకునే ఆ‘కృతి’తో వుండే ఈ తార నటించిన తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా హీరోయిన్‌గా మరికొన్ని అవకాశాలు వరించాయి ఈమెను. కానీ కథానాయికగా పరిశ్రమలో స్థిరపడాలంటే సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేయాలని భావించిన కృతి ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు. తన కెరీర్‌ను మలుపు తిప్పగల మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కృతి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన నటించే లక్కీ చాన్స్‌ను కొట్టేశారు కృతి. బాలీవుడ్‌లో రూపొందిన ‘లవ్ ఆజ్ కల్’కు రీమేక్‌గా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో పవన్ సరసన నాయికగా నటించే అరుదైన అవకాశాన్ని పొందారు.హిందీలో ‘లవ్ ఆజ్‌కల్ ’ సినిమా చూస్తున్నప్పుడు పంజాబీ అమ్మాయి గెటప్‌లో ఉన్న ఆ హీరోయిన్‌ను చూసి ‘ఈ పాత్రకునువ్వు బాగా సరిపోతావు’ అని మా అమ్మ అన్నారు. కాకతాళీయంగా ఇప్పుడు తెలుగు రీమేక్‌లో నేను అదే పాత్రను చేయడం ఎంతో థ్రిల్లింగ్‌గా వుంది.

Thursday, October 7, 2010

చైనా లో మళ్ళి కనిపించిన ఫ్లయింగ్ సాసర్

చైనా లో మళ్ళి కనిపించిన ఫ్లయింగ్ సాసర్ 


ఫ్లయింగ్ సాసర్స్ గురుంచి శాస్త్రవేత్తలకు ఇప్పటకి అంతు చిక్కని విషయంగానే ఉంది. ఐతే కొద్ది రోజుల క్రితం చైనా లో మంగోలియా ప్రాంతం లోని 'బోటు  ఎయిర్ పోర్ట్' ఫైన ఎగురుతూ కనిపించాయట.ఇలా కనిపించటం ఇది ఎనిమిదవ సారిట.  ఈ విషయమై ఎయిర్ పోర్ట్ ని గంట ఫైనే మూసివేసారట.  

15 కోట్లు వదులుకున్న అక్షయ్

15 కోట్లు వదులుకున్న అక్షయ్


మన దేశంలో పదిహేను కోట్ల రూపాయల పారితోషికాన్ని వదులుకునే నటుడు ఎవరైనా ఉంటారా? అదీ కేవలం పది రోజుల పనికి. కానీ అలాంటి నటుడు ఒకరున్నారు. ఆయన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఈమధ్య 'ఫాల్తు' అనే సినిమాలో నటించడం కోసం పదిహేను కోట్ల ఆఫర్‌తో అక్షయ్‌ని సంప్రదించాడు నిర్మాత వశు భగ్నాని. చేతిలో కాల్షీట్లు లేని అక్షయ్ అంత మొత్తం పారితోషికం వచ్చే అవకాశాన్ని కూడా ఈజీగా కాదనుకున్నాడు.

580 థియేటర్లలో "ఖలేజా"

580 థియేటర్లలో "ఖలేజా"

 మహేష్, అనుష్క జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'ఖలేజా' 580 ధియేటర్ లలో  గురువారం విడుదల అవుతుంది . దాదాపు రూ.50కోట్ల వ్యయంతో భారీగా నిర్మించిన ఈ సినిమాను ఇక్కడ 580 థియేటర్లలో విడుదల చేస్తున్నారు . ఓవర్‌సీస్‌లో 48 ప్రింట్లతో విడుదలవుతోంది. మా సినిమా టైటిల్‌కు ఈ రోజు కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రం సంగీతం సూపర్ హిట్ అయినట్టే సినిమా కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంటుందని ఆశిస్తున్నాం'' అని సి.కల్యాణ్ మీడియా ముకంగా  పేర్కొన్నారు.
 

Wednesday, October 6, 2010

హిందీ తారల ఫోన్ నంబర్లు కావాలి

హిందీ తారల ఫోన్ నంబర్లు కావాలి


ఈ మాట అంటున్నది మన సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ నిజం. ఆయన వద్ద తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ ఫోన్ నంబర్ తప్ప బాలీవుడ్‌కు చెందిన ఏ హీరో, హీరోయిన్ల నంబర్స్ తన వద్ద లేవట. అదిసరే... రజనీకాంత్‌కి ఇప్పుడు వాళ్ల నంబర్స్ ఎందుకు అవసరం అయ్యాయి అనే విషయానికొస్తే... తను తాజాగా నటించిన ‘రోబో’(తమిళంలో ఎంథిరన్) చిత్రాన్ని ముంబైలో స్పెషల్ స్క్రీన్ చేసి, ఆ స్క్రీనింగ్‌కి కొందరు అగ్ర నటీనటుల్ని ఆహ్వానించాలనుకున్నారు. ఈ పని నిమిత్తం ఇద్దరు తన వ్యక్తిగత సిబ్బందిని ముంబైకి పంపి, బాలీవుడ్ తారల ఫోన్ నంబర్సును కలెక్ట్ చేయమని ఆయన చెప్పినట్లు తెలిసింది. 

రామ్‌చరణ్‌తేజ్‌తో శ్రీదేవి తనయ?

రామ్‌చరణ్‌తేజ్‌తో శ్రీదేవి తనయ?


నిన్నటి వెండితెర కలలరాణి శ్రీదేవి కుమార్తె జాన్వీ త్వరలో కథానాయికగా రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలిసింది. ‘మగధీర’తో సూపర్ ఇమేజ్‌ని సాధించిన రామ్‌చరణ్‌తేజ్ సరసన జాన్వి నటించే అవకాశం వున్నట్లు వార్తలు అందుతున్నాయి. మెగాస్టార్ నటించగా సూపర్‌హిట్ అయిన ‘అత్తకుయముడు- అమ్మాయికి మొగుడు’ చిత్రాన్ని ఇప్పటి తరంవారికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి, రామ్‌చరణ్‌తో తెరకెక్కించే ఆలోచన వుందట. ఈ సినిమా వాస్తవరూపం దాలిస్తే ‘రామ్‌చరణ్-జాన్వి’ నాయకా నాయికలుగా మనకు దర్శనమిస్తారు.

Tuesday, October 5, 2010

వదినతో ప్రేమలో పడ్డ మరిది

వదినతో ప్రేమలో పడ్డ మరిది 


యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న "మేరే బ్రదర్ కి దుల్హన్" లో  వదినతో ప్రేమలో పడ్డ మరిది పాత్రను ఇమ్రాన్ ఖాన్, వదిన పాత్రను కత్రిన కైఫ్ మరియు వేరొక పాత్రలో అలీ జాఫెర్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, తొలి పరిచయం అలీ అబ్బాస్ జాఫెర్ దర్శకత్వం వహిస్తున్నారు. గత వారంలో షూటింగ్ ప్రారంబించారు.ఈ సినిమాని 2011 మద్యలో రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు.

బిప్స్, జాన్ అబ్రహం ల మద్య ఫైటింగ్

బిప్స్, జాన్ అబ్రహం ల మద్య ఫైటింగ్ 


హాట్ జోడి బిపాషా బసు మరియు జాన్ అబ్రహం ల మధ్య ఫైటింగ్ జరగబోతుంది. నిజంగా వాళ్ళ ఇద్దరి మధ్య అనుకునేరు కాదండి వాళ్ళ ఇద్దరు నటించిన వేర్వేరు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయీ .  బిపాషా నటించిన ఆక్రోష్ సినిమా అక్టోబర్ 1 నా రిలీజ్ కావాల్సి ఉండగా, అయోధ్య తీర్పు వలన అక్టోబర్ 15 కి పోస్ట్ పోన్ కావడం జరిగింది. జాన్ నటించిన "ఝూత  హి సాహి" సినిమా కూడా  అక్టోబర్ 15  న రిలీజ్ కాబోతుంది. బిప్స్ ఈ విషయాన్నీ తన ట్విట్టర్ ఎకౌంటు లో పేర్కొంది.

Monday, October 4, 2010

ఐష్ కు ఇదే చివరి హిట్టా

ఐష్ కు ఇదే చివరి హిట్టా!


రోబో చిత్రం తెలుగు, తమిళ్, హిందీ భాషలో విజయం సదిస్తున్నదన్న ఆనందం ఐశ్వర్య రాయ్ కు మెల్లగా ఆవిరైపోతుంది. శంకర్ దర్సకత్వంలో రూపొంది గనవిజయం సాదించిన సినిమాల్లో హీరోఇన్లుగా నటించిన వారంతా షేడ్డుకి వెళ్ళడం కాయం అని తెలిసిందే. జెంటిల్మన్ లో నటించిన మధుబాల, ప్రేమికుడులో నటించిన నగ్మా, శివాజిలో నటించి శ్రేయ,భారతీయుడు లో నటించిన మనీషా కొయిరాలా, ఊర్మిళ వంటి హీరోయిన్లు ఆ చిత్రాల తరవాత హిట్లు లేక కనుమరుగైపోగా. జీన్స్ లో నటించిన ఐశ్వర్య కు ఆ చిత్రం తర్వాత తాళ్ వరకు హిట్లు లేవు.
 

సుమంత్‌ కు ఫ్రెంచ్ కిస్‌ ఇచ్చిన ప్రియమణి!

సుమంత్‌ కు  ఫ్రెంచ్ కిస్‌ ఇచ్చిన  ప్రియమణి!


గత కొంత కాలంగా మంచి హిట్‌ కోసం పరితపించి పోతున్న యువహీరో సుమంత్ తాజాగా కుమార్ బ్రదర్స్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ భామ ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రెండీ లవ్‌స్టోరీతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రయమణి హాట్‌గా కనిపించనుంది. పైపెచ్చు సుమంత్‌కు ఫ్రెంచ్ కిస్‌ను కూడా రుచిచూపించిందట. అయితే, ఈ కిస్‌తో సుమంత్‌కు సినిమా కిక్కెస్తుందో లేదో తెరపై చూడాల్సిందే. 

పెళ్లి కి షరతు పెట్టిన డైరెక్టర్?

పెళ్లి కి షరతు పెట్టిన డైరెక్టర్?


డైరెక్టర్ మోహిత్ సూరి, హీరోయిన్ ఉదిత గోస్వామి కొన్నాళ్ళ నుంచి డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒక కండిషన్ పెట్టాడట.మోహిత్ సూరి డై రెక్షన్ లో క్రూక్ అనే సినిమా (ఆస్ట్రేలియా లో జాత్యహంకార దాడుల నేపద్యంలో) వస్తుంది. ఆ సినిమా గనుక హిట్ ఐతే ఉదిత గోస్వామి ని పెళ్లి చేసుకుంటాడట.

Saturday, October 2, 2010

ఓంకార్‌తో టీవీ యాంకర్ అర్చన ప్రేమాయణం

ఓంకార్‌తో టీవీ యాంకర్ అర్చన ప్రేమాయణం


డాన్స్‌ షోలు ఏర్పాటుచేసే టీవీ యాంకర్‌ అర్చన ఓంకార్‌ ప్రేమలో పడిపోయింది. ఆమె ఓంకార్‌ షోల్లో అప్పుడప్పుడు దర్శనమిచ్చేది. ఆయన మాట్లాడే విధానం బాగా నచ్చి బుట్టలో పడినట్లు తెలుస్తోంది. నటిగా పలు చిత్రాల్లో నటించినా అవకాశాలు రావడంలేదు. ప్రస్తుతం పిల్లల డాన్స్‌ షోలో పాల్గొంటోంది. ఆమధ్య యంగ్‌ హీరోలతో పబ్‌లో తరచూ కన్పించేది. కొద్దికాలంగా మారిన పరిస్థితుల రీత్యా పబ్‌ల్లోకి వెళ్లాంటే భయపడుతోంది. ఓంకార్‌ను పెళ్లిచేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అవ్వాలని తన సన్నిహితులతో అంటోందట అర్చన.

మమతా మోహన్ దాస్ ఎఫైర్

 మమతా మోహన్ దాస్  ఎఫైర్  మమతా మోహన్‌దాస్ ఒక రకమైన బాధ, విసుగును ఏకకాలంలో ప్రదర్శిస్తున్నారు. ఆమె ఆగ్రహానికి ఓ కారణం ఉంది. మమతాకు, ఓ మలయాళ దర్శకుడికి మధ్య ‘ఎఫైర్’ సాగుతోందనే వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్త గురించే ఈ కేరళ కుట్టి పై విధంగా స్పందిస్తున్నారు. ఇంతకీ సదరు దర్శకుడ్ని మమతా నోరారా ‘సోదరా’ అని పిలుస్తారట. అయినా కూడా తమ గురించి లేనిపోని వార్తలు సృష్టించి ప్రచారం చేయడం మమతాను బాధపెట్టిందట.