Friday, October 22, 2010

ఎన్టీఆర్‌తో తమన్నా!

ఎన్టీఆర్‌తో తమన్నా!
 
 
తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్‌గా భాసిల్లుతున్న మిల్కీ వైట్ భామ తమన్నా త్వరలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ చిత్రంలో నటించనున్నారని తెలిసింది. ‘హ్యాపీడేస్’ చిత్రం విజయంతో తెలుగుతో పాటు తమిళంలో కూడా క్రేజీ తారగా ఎదిగిన తమన్నా ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో పాటు తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘బద్రీనాథ్’, నాగచైతన్య సరసన ఓ చిత్రంలోను నటిస్తున్నారు. రెండు భాషల్లోనూ క్రేజీ హీరోలతో నటిస్తున్న తమన్నా ఎన్టీఆర్‌తో ఓ చిత్రంలో నటించే లక్కీ చాన్స్‌ను కొట్టేయడం విశేషమే. గతంలో తారక్ (ఎన్టీఆర్) హీరోగా ‘అశోక్’ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు కాగా, ఇటీవల ప్రభాస్‌తో ‘డార్లింగ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వున్నారు.
 

No comments:

Post a Comment